twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇదీ చరిత్ర అంటే... రూ. 1000 కోట్లను అందుకున్న బాహుబలి-2

    ‘బాహుబలి-2' మూవీ ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని నమోదు చేసింది. రూ. 1000 కోట్ల మార్కును అందుకుని సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: 'బాహుబలి-2' మూవీ ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని నమోదు చేసింది. రూ. 1000 కోట్ల మార్కును అందుకుని సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. సినిమా విడుదలైన 9వ రోజే బాహుబలి-2 ఈ రికార్డును అందుకోవడం విశేషం.

    ఇప్పటి వరకు ఎవరికీ అందని బ్రహ్మాండంగా ఉన్న రూ. 1000 కోట్లను అందుకుని బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టిన బాహుబలి-2 మూవీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సెకండ్ వీకెండ్ కూడా చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తుండటంతో సినిమా వసూళ్లు ఓవరాల్ రన్‌లో రూ. 1500 కోట్ల మార్కును అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.

    ఇండియాలో ఎంత?

    ఇండియాలో ఎంత?

    ఇప్పటి వరకు వసూలైన లెక్కలు రూ. 1000 కోట్లపై చిలుకు ఉన్నాయని, రూ. 800 కోట్లకుపైగా ఇండయాలోనే వసూలైందని, రూ. 200 కోట్లకుపైగా ఓవర్సీస్ మార్కెట్ లో వసూలైందని ప్రముఖ సినీ ట్రేడ్ విశ్లేషకుడు రమేష్ బాల తెలిపారు.

    ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటోంది

    బాహుబలి మూవీ గురించి ఇపుడు ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటోంది. బిబిసీ న్యూస్ లో ఈ సినిమా రికార్డుల గురించి ప్రశంసలు రావడం విశేషం. ఒక తెలుగు సినిమా గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకోవడం ఇదే తొలిసారి.

    కష్టానికి తగిన ప్రతిఫలం

    కష్టానికి తగిన ప్రతిఫలం

    ఒక సినిమా కోసం ఇన్ని వందల కోట్ల బడ్జెట్, ఐదేళ్ల సమయం కేటాయించడం చూసి మొదట్లో చాలా మంది విమర్శించారు. కానీ ఇపుడు బాహుబలి చిత్రం ప్రభంజనం చూసి అలా విమర్శించిన వారు తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు.

    రెండు ప్రాజెక్టులు కలిపితే

    రెండు ప్రాజెక్టులు కలిపితే

    బాహుబలి పార్ట్ 1 గతంలో విడుదలై దాదాపు 600 కోట్లకుపైగా వసూలు చేసింది. ఇపుడు బాహుబలి 2 ఆల్రెడీ 1000 కోట్లను క్రాస్ చేసింది. ఓవరాల్ రన్ లో రెండు ప్రాజెక్టులు కలిపి రూ. 2 వేల కోట్ల మార్కును అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

    English summary
    SS Rajamouli’s film Baahubali 2 has achieved a rare feat. The film has become the first Indian movie ever to collect Rs 1000 crore. Baahubali 2 has collected around Rs 800 crore in Indian and Rs 200 crore in the overseas market, making it highest grossing Indian film ever. Trade tracker Ramesh Bala confirmed the same and tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X