»   » బాహుబలి2 కలెక్షన్ల కుంభవృష్టి..1500 కోట్ల చేరువలో.. ఆగని వసూళ్ల వరద!

బాహుబలి2 కలెక్షన్ల కుంభవృష్టి..1500 కోట్ల చేరువలో.. ఆగని వసూళ్ల వరద!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సంచలన దర్శకుడు రాజమౌళి రూపొందించిన బాహుబలి2 చిత్రం కలెక్షన్ల సునామీ కొనసాగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబడుతున్నది. చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా రూ.1500 కోట్ల మైలురాయికి చేరువైంది. బాహుబలి2 కలెక్షన్లు ట్రేడ్ అనలిస్టులను షాక్ గురిచేస్తున్నాయి. ఇప్పట్లో వసూళ్ల హవాకు ఢోకాలేదనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా.. 1330 కోట్లు..

ఇండియాలో బాహుబలి2 సినిమా రూ.1090 కోట్లు (రూ.855 కోట్లు నికరం) గ్రాస్ కలెక్షన్లను సాధించింది. ఓవర్సీస్‌లో 240 కోట్లు సాధించింది. మొత్తంగా రూ.1330 కోట్ల వసూళ్లను రాబట్టిందని ట్రేడ్ అనలిస్టు రమేశ్ బాలా పేర్కొన్నారు.


దేశవ్యాప్తంగా రూ.413 కోట్లు..

బాహుబలి2 హిందీ వెర్షన్ ఇప్పటివరకు దేశీయంగా రూ.390 కోట్ల నికర వసూళ్లను సాధించింది. మే 12వ తేదీన రూ.10 కోట్లు, శనివారం రూ.13.5 కోట్లు సాధించింది. దేశవ్యాప్తంగా రూ.413 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని రమేశ్ బాలా వెల్లడించారు.


బాహుబలికి దీటుగా దంగల్

బాహుబలికి దీటుగా దంగల్

ఇదిలా ఉండగా, బాహుబలికి ధీటుగా అమీర్‌ఖాన్ నటించిన దంగల్ చిత్రం చైనాలో ప్రభంజనం సృష్టిస్తున్నది. కలెక్షన్లపరంగా దంగల్ చైనా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్నది. ఓవర్సీస్ మార్కెట్లో దంగల్ కొత్త రికార్డులు నెలకొల్పుతున్నది.


 బాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు..

బాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు..

టాలీవుడ్ నటుడు ప్రభాస్, అనుష్క, రానా దగ్గుబాటి, రమ్యకృష్ణ తదితరులు నటించిన బాహుబలి2 చిత్రం ఏప్రిల్ 28న విడుదలైన సంగతి తెలిసిందే. ఖాన్లు, కపూర్ల అధిపత్యంలో ఉండే బాలీవుడ్‌ను శాసిస్తూ బాహుబలి సరికొత్త రికార్డులను నెలకొల్పడం విశేషం.English summary
After crossing the Rs 1000-crore mark, Baahubali 2: The Conclusion is well on its way to make Rs 1,500 crore at the global box office. The SS Rajamouli epic starring Prabhas, Anushka Shetty, Rana Daggubati, Tamannaah and Ramya Krishnan has grossed a total of Rs 1,330 crore worldwide so far.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu