బాహుబలి 2 బాక్సాఫీస్ వార్ ముగియలేదు, ఈ దెబ్బతో దాన్ని తొక్కేయడం ఖాయం!
Recommended Video

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన 'బాహుబలి-2' చిత్రానికి అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన 'దంగల్' చిత్రానికి మధ్య బాక్సాఫీస్ వార్ ఇంకా ముగియలేదు. అత్యధిక కలెక్షన్లతో నెం.1 స్థానంలో ఉన్న 'దంగల్' చిత్రాన్ని రెండోస్థానంలోకి తొక్కేయడానికి మరో అవకాశం దక్కింది మన తెలుగు చిత్రానికి. చైనాలో విడుదలవుతున్న 'బాహుబలి-2' మూవీ 'దంగల్' కలెక్షన్లను అధిగమిస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

చైనాలో లైన్ క్లియర్
‘బాహుబలి-2' చిత్రం ఇప్పటికే చైనాలో విడుదలవ్వాల్సి ఉంది. అయితే పలు కారణాలతో ఆలస్యం అయింది. హాలీవుడ్ వెబ్ సైట్ కథనం ప్రకారం బాహుబలి-2' చిత్రం ఇటీవల చైనాలో సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుందని, ఈస్టార్స్ మీడియా సంస్థ ఈ చిత్రాన్ని చైనా వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు పేర్కొంది.

ఈసారి తప్పకుండా కొడుతుందా?
అయితే ‘బాహుబలి-2' చిత్రం చైనాలో ఎప్పుడు విడుదలవుతుంది? అనే విషయం ఇంకా ఫైనల్ కాలేదు. బాహుబలి తొలి భాగం చైనాలో పెద్దగా వర్కౌట్ కాలేదు... దంగల్, భజరంగీ భాయిజాన్, సీక్రెట్ సూపర్ స్టార్ చిత్రం కంటే తక్కువే కలెక్ట్ చేసింది. అయితే ‘బాహుబలి-2' మంచి వసూళ్లు సాధిస్తుందని ఆశిస్తున్నారు.

ఆల్ టైమ్ హయ్యెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిల్మ్
ఆల్ టైమ్ హయ్యెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిల్మ్ రికార్డ్ ‘దంగల్' పేరుమీదే ఉంది. ఈ చిత్రం రూ. 1864 కోట్లు వసూలు చేసింది, ఒక చైనాలోనే రూ. 1200 కోట్లు రాబట్టింది. దీంతో బాహుబలి-2 రెండో స్థానంతో సరిపెట్టుకోక తప్పలేదు.

రూ. 150 కోట్లు దాటితే చాలు
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి-2' చిత్రం వరల్డ్ వైడ్ బాక్సాఫీసు వద్ద రూ. 1713 కోట్లు రాబట్టింది. దంగల్ సినిమా రికార్డును బద్దలు కొట్టాలంటే చైనాలో రూ. 150 కోట్ల మార్కును దాటితే చాలు. చైనాలో బాహుబలి-2 వసూళ్లు బావుంటే రూ. 2000 కోట్ల మార్కును అందుకునే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే రూ. 2వేల కోట్ల మార్కును అందుకున్న తొలి ఇండియన్ చిత్రంగా ‘బాహుబలి-2' రికార్డులకెక్కడం ఖాయం.

చైనాలో సంవత్సరానికి 34 సినిమాలే
చైనా ప్రభుత్వం లోకల్ సినిమాలను ఎంకరేజ్ చేయడానికి అక్కడ సంవత్సరంలో 34 విదేశీ సినిమాలకు మాత్రమే అనుమతి ఇస్తోంది. ఇందులో 90 శాతం హాలీవుడ్ చిత్రాలే విడుదలవుతున్నాయి. బాహుబలి 2 విడుదల ఆలస్యం కావడానికి ఇది కూడా ఓ కారణం కావొచ్చు.


Click it and Unblock the Notifications











