»   »  బాహుబలి-2 ఇంకా ఔట్ కాలేదు, ఇదే టాప్: తేల్చేసిన తరణ్ ఆదర్శ్!

బాహుబలి-2 ఇంకా ఔట్ కాలేదు, ఇదే టాప్: తేల్చేసిన తరణ్ ఆదర్శ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: 'బాహుబలి-2' మూవీ మరో రికార్డ్ తన ఖాతాలో వేసుకుంది. బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది. కేవలం హిందీలోనే రూ. 500 కోట్ల గ్రాస్ సాధించిన ఏకైక చిత్రంగా చరిత్ర సృష్టించింది.

ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఇందుకు సంబంధించిన లెక్కలను ట్విట్టర్ ద్వారా విడుదల చేసారు. హిందీ వెర్షన్ కు సంబంధించిన మరే ఇతర బాలీవుడ్ సినిమా కూడా బాహుబలి-2 దరి దాపుల్లో కూడా లేదు.


ఆ రెండూ బాహుబలి-2

హిందీలో ఇతర సినిమాలు రూ. 500 కోట్ల మార్కునే కాదు.... రూ. 400 కోట్ల మార్కును కూడా అందుకోలేక పోయాయి. ఈ రెండు మైలురాళ్లు బాహుబలి ఖాతాలోనే ఉండటం గమనార్హం.


బాహుబలి తర్వాత పీకె

బాహుబలి-2 తర్వాత హిందీలో 2014లో విడుదలైన ‘పీకే' అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఉంది. ‘గజిని' రూ. 100 కోట్లు (2008), ‘త్రీ ఈడియట్స్‌' రూ. 200 కోట్లు (2009), ‘పీకే' రూ. 300 కోట్లు (2014), ‘బాహుబలి 2' రూ. 500 కోట్లు (2017) ఉన్నాయని తరణ్‌ ఆదర్శ్ తెలిపారు.


బాహుబలి ప్రభంజనం ఇలా...

హిందీలో బాహుబలి-2 ప్రభంజనం పరిశీలిస్తే..... తొలి 3 రోజుల్లో రూ. 100 కోట్ల మార్కును, ఆరు రోజుల్లో 200 కోట్లు, 10 రోజుల్లో 300 కోట్లు, 15 రోజుల్లో 400 కోట్లు, 20 రోజుల్లో 450 కోట్లు, 24 రోజుల్లో 475 కోట్లు, 34 రోజుల్లో రూ. 500 కోట్ల మార్కును రీచ్ అయింది.


బాహుబలి-2 5వ వారం

బాహుబలి-2 హిందీ వెర్షన్ 5వ వారం వసూళ్లు పరిశీలిస్తే.... శుక్రవారం రూ. 1.56 కోట్లు, శనివారం రూ. 2.25 కోట్లు, ఆదివారం రూ. 3.16 కోట్లు, సోమవారం రూ. 1.34 కోట్లు, మంగళవారం రూ. 1.22 కోట్లు, బుధవారం రూ. 1.20 కోట్లు... ఓవరాల్ ఇప్పటి వరకు రూ. 500.13 కోట్ల నెట్ సాధించిందని తరణ్ ఆదర్శ్ తెలిపారు.English summary
"Baahubali2 ₹ 500 cr, NOT OUT... Continues its HEROIC RUN... HIGHEST GROSSER EVER... Hindi. India biz" taran adarsh tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu