»   » బాహుబలి-2 ఫస్ట్ డే కలెక్షన్స్..... ఆలిండియా రికార్డ్?

బాహుబలి-2 ఫస్ట్ డే కలెక్షన్స్..... ఆలిండియా రికార్డ్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి-2 సినిమాపై ఎంత క్రేజ్ ఉందో ఆన్ లైన్ లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న టికెట్లు.... ప్రసాద్ ఐమాక్స్ లాంటి థియేటర్స్ వద్ద టిక్కెట్ల కోసం కిలోమీటర్ల మేర లైన్ కట్టిన ప్రేక్షకులే నిదర్శనం.

మరికొన్ని గంటల్లో సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా బాహుబలి-2 ఫీవర్ మొదలైంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే బాహుబలి-2 మేనియా మరింత ఎక్కువగా ఉంది. బాలీవుడ్ అయినా, ఇతర రీజనల్ బాషా చిత్రాలు విడుదలైతే ఆయా ప్రాంతాల్లో మాత్రమే బాగా క్రేజ్ ఉంటుంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో, అన్నిరాష్ట్రాల్లో ఒక సినిమా కోసం ఇంతగా ఎదురు చూడటం ఇదే తొలిసారి.


ఫస్ట్ డే కలెక్షన్స్ ఆలిండియా రికార్డ్

ఫస్ట్ డే కలెక్షన్స్ ఆలిండియా రికార్డ్

సినిమాకు ఉన్న భారీ క్రేజ్ దృష్ట్యా ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో సినిమా ఆలిండియా రికార్డ్ నెలకొల్పడం ఖాయం అంటున్నారు ట్రేడ్ పండితులు. అన్ని బాషల్లో కలిపి ఈ చిత్రం తొలి రోజు రూ. 80 నుండి రూ. 85 కోట్లు వసూలు చేస్తుందని అంచనా.


హిందీలో...

హిందీలో...

వరల్డ్ వైడ్ ఈచిత్రం దాదాపు 9వేల పైచిలుకు థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఒక హిందీలోనే 3500లకు పైగా స్క్రీన్లలో ఈ సినిమా రిలీజవుతోంది. హిందీలో తొలి రోజు కనీసం రూ. 30 కోట్లు వసూలు చేస్తుందని అంచనా. తెలుగు, తమిళం, మళయాలం బాషాల్లో కలిపి ఓవరాల్ గా తొలి రోజు రూ. 80 నుండి రూ. 85 కోట్లు వసూలు చేస్తుందని లెక్కలు వేస్తున్నారు.


ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్

ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్

ఇప్పటి వరకు ఇండియన్ సినీ చరిత్రలో ఓపెనింగ్ డే రికార్డ్ సల్మాన్ ఖాన్ మూవీ ప్రేమ్ రతన్ ధన్ పాయో సినిమాపై ఉంది. ఈ చిత్రం తొలి రోజు రూ. 55 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీని తర్వాతి స్థానంలో రూ. 53 కోట్లతో రజనీకాంత్ కబాలి చిత్రం ఉంది. హయ్యెస్ట్ కలెక్షన్స్ ఇన్ సింగిల్ డే అనే విషయానికిస్తే అమీర్ ఖాన్ దంగల్ మూవీ విడుదలైన మూడో(ఆదివారం)రోజు రూ. 59 కోట్లు వసూలు చేసింది. ఈ రికార్డులన్నింటినీ ‘బాహుబలి-2' మూవీ బద్దలు కొడుతుందని అంటున్నారు.


గంటల్లో మిలియన్ల కొద్దీ టికెట్స్

గంటల్లో మిలియన్ల కొద్దీ టికెట్స్

బుక్ మై షో లాంటి ఆన్ లైన్ టికెట్ బుకింగ్ వెబ్ సైట్ల ద్వారా గంటలోనే మిలియన్ బాహుబలి టికెట్ అమ్ముడయ్యాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బాహుబలి-2 సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో?English summary
Baahubali: The Conclusion will shatter all the records with ease upon its release this Friday. Opening Day Prediction 78 to 84 crore All languages.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu