»   » రేపు రాజమౌళి ‘బాహుబలి’ స్పెషల్ షో ! మీరు వెళ్తున్నారా?

రేపు రాజమౌళి ‘బాహుబలి’ స్పెషల్ షో ! మీరు వెళ్తున్నారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'బాహుబలి - ది బిగినింగ్' సినిమాని ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుందంటారు అభిమానులు. అందుకేనేమో టీవిల్లో ఎప్పుడు ఈ చిత్రాన్ని ప్రసారం చేసినా టీఆర్పీలు అదిరిపోతున్నాయి. దాంతో ఈ చిత్రం స్పెషల్ షో ని రేపు మరోసారి ధియోటర్లలో చూసే అవకాసం కలిపిస్తున్నారు. రేపే ఎందుకని, ఏమటా స్పెషాలిటీ అంటారా...

రేపు ఫిబ్రవరి 24న మహాశివరాత్రి సందర్బంగా హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య 70 ఎంఎం థియేటర్లో 'బాహుబలి - ది బిగినింగ్' సెకండ్ షోను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఈ విషయం తెలిసిన బాహుబలి వీరాభిమానులు, ప్రభాస్ ఫ్యాన్స్ఎంతో సంతోషపడుతూ థియేటర్ యాజమాన్యాన్ని అభినందిస్తున్నారు. ఈ షోకు సంబందించిన టికెట్లు కూడా ఇప్పటికే సగం పైగా అమ్ముడుపోయాయని సమాచారం.


Baahubali: Maha Shivaratri Special show

ఇక ఈ చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతున్న 'బాహుబలి 2' ఎలాంటి ఆలస్యం లేకుండా ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. అలాగే బాహుబలి2 (ద కంక్లూజన్)కు రిలీజ్ కు ముందే రికార్డులు బ్రద్దలు కొడుతోంది. రీసెంట్ గా ఈ సినిమా నైజాం రైట్స్ ను ఎసియన్ ఎంటర్ ప్రైజెస్ అధినేతలు నారాయణ్ దాస్ నారంగ్, సునీల్ నారంగ్ లు 40 కోట్లకు దక్కించుకున్న సంగతి తెలిసిందే.తాజాగా 'బాహుబలి2' చిత్రం హిందీ శాటిలైట్ రైట్స్ ను సోనీ టీవీ 51కోట్లకు దక్కించుకుంది. ఈ మొత్తానికి సర్వీస్ ట్యాక్స్ లు అదనం. బాహుబలి పార్ట్ 1(ద బిగినింగ్) ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీసులను కొల్లగొట్టడంతో పార్ట్ 2కు మంచి హైప్ క్రియేట్ అయింది. దీంతో బాహుబలి కోసం మార్కెట్ వర్గాలు క్యూకడుతున్నాయి. ప్రీ రిలిజ్ బిజినెస్ దుమ్మురేపుతోంది.


ఇప్పటికే, బాహుబలి2 ఓవర్సీస్ రైట్స్ తెలుగు, తమిళం, హిందీ కలిసి థియేటర్ రైట్స్ 47కోట్లకు అమ్మినట్టు ఇప్పటికే వార్తలు వినిపించాయి. మొత్తానికి ఏ హక్కులైన మినిమం 50కోట్లకు ఏమాత్రం తగ్గకుండా మార్కెట్ కావడం ట్రేడ్ వర్గాల్లో సంచలనంగా మారింది.


ఈ సినిమా ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని మూడు వెర్షన్స్ (తెలుగు, తమిల, మళయాళం) కు గానూ 45 కోట్లు కు అమ్ముడయ్యాయి. ఓవర్ సీస్ రైట్స్ ఈ స్దాయిలో అమ్ముడవటం ఓ ఇండియన్ సినిమాకు రికార్డే. యుఎస్ లోని టాప్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలలో ఒకటైన గ్రేట్ ఇండియన్ ఫిల్మ్ వారు ఈ మొత్తాన్ని వెచ్చించి ఈ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

English summary
On the occasion of Maha Sivaratri on Feb 24th, the special shows are screening in Hyderabad. Rajamouli's Baahubali movie will be screened at RTC X Roads, Hyderabad
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu