»   » గూగుల్ సెర్చింగ్ టాప్ 10: 'బాహుబలి' స్దానం? లిస్ట్ లో ఇంకే సినిమాలు?

గూగుల్ సెర్చింగ్ టాప్ 10: 'బాహుబలి' స్దానం? లిస్ట్ లో ఇంకే సినిమాలు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాహుబలి చిత్రం విడుదలైనప్పటి నుంచీ సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. ఇప్పుడు బాహుబలి తాజాగా సరికొత్త రికార్డును సృష్టించింది. ఇండియాలో ఆన్‌లైన్‌లో ఎక్కువ మంది వెతికిన సినిమాల లిస్ట్‌లో చోటు సంపాదించుకుంది. మూడో స్థానంలో నిలిచి మన తెలుగు వారి సత్తాను దేశవ్యాప్తంగా చాటింది. అయితే మిగతా ఏ సినిమాలు గూగుల్ సెర్చ్ లో చోటు చేసుకున్నాయి. టాప్ 10 లిస్ట్ ఈ క్రింద మీరు చూడవచ్చు.

ప్రస్తుత కంప్యూటర్ ప్రపంచంలో ఇంటర్నెట్ అంటే ముందుగా గుర్తొచ్చేది గూగుల్ సెర్చ్ ఇంజన్. గత కొన్నేళ్లుగా గూగుల్ సెర్చ్ ఇంజన్లో ఏ సినిమా స్టార్ ఎక్కువ సెర్చ్ చేయబడ్డాడనే విషయంలో కూడా హాట్ టాపిక్ అవుతుంది. ఎప్పటి లానే ఈ సంవత్సరం కూడా గూగుల్ ఎక్కువ సెర్చ్ చేయబడ్డ సెలబ్రిటీల లిస్టు విడుదల చేసింది. అయితే గత పదేళ్లుగా ఏ హీరోని ఎక్కువ సెర్చ్ చేసారనే విషయం తెలియచేసింది.

గత దశాబ్ద కాలంలో గూగుల్ ఎక్కువగా వెదికిన భారతీయ నటీ నటులుగా బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ ఖాన్ సన్నీలియోన్లు మొదటిస్థానం దక్కించుకున్నారు. సల్మాన్ తర్వాత షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్ రజనీకాంత్లు మొదటి ఐదు స్థానాల్లో నిలిచారు. హృతిక్ రోషన్, షాహిద్ కపూర్, రణ్జీర్ కపూర్, ఆమిర్ ఖాన్, ఇమ్రాన్ హష్మీలు టాప్ టెన్లో చోటు దక్కించుకున్నారు.

హీరోయిన్ల జాబితాలో సన్నీ తర్వాత కత్రినా కైఫ్, కరీనా కపూర్, కాజల్ అగర్వాల్, దీపికా పదుకునే ఐశ్వర్య రాయ్, ప్రియాంకా చోప్రా తమన్నా అలియా భట్, సోనాక్షిసిన్హాలు గూగుల్ జాబితాలో నిలిచారు. క్లాసిక్ నటుల్లో అమితాబ్ బచ్చన్, రేఖలు మొదటి స్థానాల్లో నిలిచారు. అమితాబ్ తర్వాత కమల్ హాసన్, రాజేష్ ఖన్నా మిథున్ చక్రవర్తి,, ధర్మేంద్ర తదితరులు ఉన్నారు.

మరి సినిమాల విషయానికి వస్తే... లిస్ట్ ఇలా సాగింది

పికే

పికే

అమీర్ ఖాన్ హీరోగా నటించిన పీకే చిత్రం వివాదాస్పద చిత్రంగానూ నిలిచింది. ఈ చిత్రం ఎక్కువ జనం సెర్చ్ చేసారు.

కహాని

కహాని

విద్యాబాలన్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ ధ్రిల్లర్ చిత్రం గురించి జనం ఎక్కువ ఆసక్తి చూపించారు.

బాహుబలి

బాహుబలి

రాజమౌళి దర్శకత్వంలో వచ్చి ప్రపంచ వ్యాప్తంగా హిట్ అయిన బాహుబలి చిత్రం ఎక్కువ గూగుల్ సెర్చ్ చేయబడింది

ఆషికి 2

ఆషికి 2

చక్కటి ప్రేమ కధగా వచ్చి మ్యూజికల్ లవ్ స్టోరీగా నిలిచిన ఆషికి 2 కూడా ఎక్కువ గూగుల్ సెర్చ్ చేయబడింది.

ధూమ్ 3

ధూమ్ 3

అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన ధూమ్ సీరిస్ లోని ఈ మూడవ చిత్రం ఎక్కువ గూగుల్ సెర్చ్ చేయబడింది

కిక్

కిక్

సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన కిక్ చిత్రం (తెలుగు రీమేక్) ఎక్కువ గూగుల్ సెర్చ్ చేయబడ్డ చిత్రాల్లో ఉంది.

భజరంగి భాయీజాన్

భజరంగి భాయీజాన్

సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన భజరంగి భాయీజాన్ చిత్రం రికార్డ్ లు బ్రద్దలు కొట్టడమే కాక గూగుల్ సెర్చ్ లోనూ 7 స్దానం ఆక్రమించింది.

హ్యాపీ న్యూ ఇయిర్

హ్యాపీ న్యూ ఇయిర్

షారూఖ్ ఖాన్ హీరోగా వచ్చిన హ్యాపీ న్యూ ఇయిర్ చిత్రం గూగుల్ సెర్చ్ లో ఎనిమిదవ స్దానంలో ఉంది.

హీరో

హీరో

సల్మాన్‌ ఖాన్‌ నిర్మాణంలో వచ్చిన మొదటి బాలీవుడ్‌ చిత్రం 'హీరో'. ఈ చిత్రంలో సూరజ్‌ పంచోలీ, అతియా శెట్టి నటించారు. ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది.

ఏక్ విలన్

ఏక్ విలన్


శ్రద్దా కపూర్, సిద్దార్ద మల్హోత్రా జంటగా నటించిన ఈ చిత్రంలో జెనీలియా భర్త రితీష్ దేశముఖ్ విలన్ గా నటించాడు. ఈ చిత్రం మంచి హిట్టైంది.

English summary
Baahubali, the film has been declared the third most searched Indian film on Google in the last decade. Baahubali stood next only after Vidya Balan's Kahaani, while Aamir Khan's PK topped the list.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu