»   »  'బాహుబలి-2' హిందీ రైట్స్ రేటు..షాకిస్తోంది

'బాహుబలి-2' హిందీ రైట్స్ రేటు..షాకిస్తోంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :రాజమౌళి డైరక్షన్ లో ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమా బాహుబలి. ఈ సినిమా ధక్షిణ భారతదేశ సిని తరిత్రలో అత్యదిక వసూళ్లు సాధించిన రెండో చిత్రం. సుమారు 100 కోట్ల రూపాయల వసూల్లు సాధించింది హిందీ వెర్షన్. ఇప్పుడు ఈ చిత్రం కంటిన్యూషన్ (సీక్వెల్ కాదు)షూటింగ్ జరగుతోంది.

ఈ నేపధ్యంలో చిత్రానికి బిజినెస్ ఎంక్వైరీలు మొదలయ్యాయి. అయితే బాహుబలి నిర్మాతలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. బాహుబలికి వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకుంటూ..రెండో పార్ట్ ని అమ్మాయిని నిర్ణయించుకున్నారు.అందులో భాగంగా హిందీ రైట్స్ కు ప్రస్తుతం బిజినెస్ జరుగుతోందని వినికిడి.


'Bahubali-2 ': 150 crore for hindi version

బాలీవుడ్ కు చెందిన ఓ పెద్ద డిస్ట్ర్రిబ్యూషన్ కంపెనీ.. బాహుబలి పార్టు టూ కు సంబందించి హిందీ రైట్స్ ను సుమారు 150 కోట్లు ఆఫర్ చేసినట్టు సమాచారం. ఇందులోనే సాటిలైట్స్ హక్కులు కూడా కలుపుకుని ఉంటాయని తెలుస్తోంది. అయితే కరుణ్ జోహార్ కే ఈ సారి కూడా ఈ సినిమా ఇద్దామా అనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు చెప్తున్నారు. దాంతో డీల్ ఇంకా ఫైనల్ కాలేదని చెప్పుకుంటున్నారు.


ఒక వేళ ఈ డీల్ ఫైనల్ అయ్యి..ఈ సినిమాకు అంత వస్తే, ధక్షిణ భారతంలో అత్యదింకంగా రేటు పలికిన డబ్బింగ్ సినిమాగా చరిత్రలోకి చేరుతుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపోందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే కేరళలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ వేసవికి సిద్దం అవుతుందని సమాచారం.

English summary
Well-known distribution company from Bollywood has offered Rs. 150 crore for the rights of Hindi version of Baahubali 2.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu