Just In
- 56 min ago
RRR నుంచి అదిరిపోయే అప్డేట్: గుడ్ న్యూస్ చెప్పిన ఎన్టీఆర్, చరణ్.. వాళ్లిచ్చే సర్ప్రైజ్ అదే!
- 2 hrs ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- 3 hrs ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
- 4 hrs ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
Don't Miss!
- News
భారత జవాన్ల చేతిలో చైనా సైనికులకు చావుదెబ్బ: 20 మందికి గాయాలు: తరిమికొట్టిన సరిహద్దు బలగాలు
- Lifestyle
జనన నియంత్రణ ఉన్నప్పటికీ గర్భం వచ్చే ప్రమాదం
- Finance
Gold prices today: రూ.49,000 స్థాయికి బంగారం ధరలు, వెండి స్వల్పంగా అప్
- Sports
మెల్బోర్న్ సెంచరీ చాలా స్పెషల్.. అందుకే సిడ్నీలో మైదానం వీడలేదు: అజింక్యా రహానే
- Automobiles
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆశ్చర్యం: బాలయ్య ముందున్నాడు, ఎన్టీఆర్ వెనకంజ!
హైదరాబాద్: నందమూరి ఫ్యామిలీ నుండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ లో కొనసాగుతున్నది ఇద్దరే ఇద్దరు. అందులో ఒకరు నందమూరి నటసింహం బాలకృష్ణ. మరొకరు యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్. ఇధ్దరి సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్లు డిసెంబర్ 31న పోటీ పోటీగా విడుదలయ్యాయి.
బాబాబ్, అబ్బాయ్ సినిమాల టీజర్లు పోటీ పోటీగా యూట్యూబులో విడుదల కావడం అందరినీ ఆశ్చర్య పరిచింది. కొన్ని మీడియా సంస్థలు ఇద్దరి మధ్య టీజర్ వార్ అంటూ కథనాలు వెలువరించాయి. బాలయ్య ‘లయన్', జూ ఎన్టీఆర్ ‘టెంపర్' టీజర్లు విడుదలై 5 రోజులు పూర్తయింది.

ఫలితాలు గమనిస్తే....బాలయ్య ‘లయన్' టీజర్ 3.30 లక్షల పైచిలుకు హిట్స్ తో ముందంజలో ఉంది. జూ ఎన్టీఆర్ ‘టెంపర్' టీజర్ కేవలం 2 లక్షల పై చిలుకు హిట్స్‌తో వెనకంజలో ఉంది. సాధారణంగా అంతా టీజర్ వార్ విషయంలో కుర్రోడు ముందుంటాడని ఊహించాడు. కానీ బాబాయ్ స్టామినా కింద జూ ఎన్టీఆర్ బుడ్డోడే అని తేలిపోయింది.
' కొందరు కొడితే ఎక్సరేలో కనపడుతుంది. మరికొందరుకొడితే స్కానింగ్ లో కనపడుతుంది. అదే నేను కొడితే హిస్టరీలో వినపడుతుంది.' అంటూ బాలకృష్ణ పవర్ ఫుల్ గా వచ్చేసారు. నందమూరి బాలకృష్ణ శక్తిమంతమైన సీబీఐ అధికారిగా భిన్నకోణాల్లో నటిస్తోన్న చిత్రానికి 'లయన్' అనే టైటిల్ ఖరారు చేస్తూ టీజర్ ని వదిలారు. సత్యదేవ్ దర్శకునిగా పరిచయమవుతోన్న ఈ చిత్రాన్ని ఎస్.ఎల్.వి. సినిమా పతాకంపై రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్నారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ సినిమా టీజర్‌ని బుధవారం రాత్రి 11 గంటల 15 నిమిషాలకు విడుదల చేశారు. ఇందులో త్రిష, రాధికా ఆప్టే హీరోయిన్స్.
"ఇద్దరు కొట్టుకుంటే యుద్దం...అదే ఒకడే మీదడపోతే అది దండయాత్ర...ఇది దయాగాడి దండయాత్ర అంటూ" పవర్ ఫుల్ డైలాగుతో ఎన్టీఆర్ టీజర్ ఆకట్టుకునే విధంగా ఉంది. శివబాబు బండ్ల సమర్పిస్తున్న సినిమా ‘టెంపర్'. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేశ్ నిర్మాత.