For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాలయ్య 'డిక్టేటర్' పాటలు వినాలంటే...

  By Srikanya
  |

  హైదరాబాద్‌: నందమూరి బాలకృష్ణ, అంజలి నటిస్తున్న కొత్త చిత్రం 'డిక్టేటర్‌'. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు శ్రీవాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. మరో ప్రక్క ఆడియోని రెడీ చేసి, డిసెంబర్ 20న విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి థమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇది బాలకృష్ణకు 99వ చిత్రం కావడం విశేషం.

  బాలకృష్ణ మాట్లాడుతూ.... ‘డిక్టేటర్' అనే సినిమా నా కెరీర్లోనే మోస్ట్ స్టైలిష్ మూవీ అవుతుంది. ఇదివరకూ అభిమానులు నన్ను చూడని ఓ సరికొత్త రోల్ ని శ్రీవాస్ నాకోసం డిజైన్ చేసాడు. ఆ పాత్ర కోసం 12కేజీల బరువు కూడా తగ్గానని' తెలిపాడు. ఇప్పటికే రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.

  అరేయ్ నీ హిస్టరీలో బ్లడ్ ఉందేమో నా బ్లడ్‌లోనే హిస్టరీ ఉంది.. , మద్యం తాగితే ఆరోగ్యానికి హానికరం.. నాలాంటి వాన్ని రెచ్చగొడితే జీవితానికే ప్రమాదకరం అంటూ తనదైన స్టెల్లో టీజర్ లో బాలయ్య చెప్పాడు. అంజలి, సోనాల్ చౌహాన్, హీరోయిన్ అక్షలు బాలయ్యతో ఆడిపాడనున్నారు.

  బాలకృష్ణ మాట్లాడుతూ ''ఈ సినిమా పేరు చాలా బలమైనది. అందుకు తగ్గట్టుగానే కథని తయారు చేశారు. ఇంతకు ముందున్న రికార్డుల్ని తిరగరాసేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు దర్శకుడు. ప్రాణం తీసే భయం కన్నా ప్రాణం పోసే ఆయుధం గొప్పదనే కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకొంటున్న ఈ సినిమా ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుంది. మంచి కథకి, మంచి నటీనటులు, సాంకేతికబృందం తోడైంది. గత చిత్రాల్లాగే ఇదీ మంచి విజయాన్ని సొంతం చేసుకొంటుంది''అన్నారు.

  Balakrishna's Dictator Audio Release Date Confirmed.

  అంజలి మాట్లాడుతూ ''తొలిసారి బాలకృష్ణగారితో కలిసి నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇదివరకు ఎప్పుడూ చేయని ఓ విభిన్నమైన పాత్రని ఇందులో పోషిస్తున్నాను''అన్నారు.

  దర్శకుడు మాట్లాడుతూ..''నా తొలి చిత్రం'లక్ష్యం' పూర్తయిన వెంటనే బాలకృష్ణగారితో సినిమా చేయాలనుకొన్నా. కానీ అప్పట్లో కుదరలేదు. అది ఒక రకంగా మంచికే అయ్యింది. ఇప్పుడు బాలకృష్ణగారి సినిమాకి దర్శకత్వం వహిస్తుండడంతోపాటు, నిర్మాణంలోనూ భాగం పంచుకొనే అవకాశం దొరికింది. బాలకృష్ణ ఇదివరకు కుటుంబ ప్రేక్షకుల్ని అలరించే సినిమాలు చేశారు, అభిమానుల్ని అలరించే చిత్రాలూ చేశారు. మేం ఈ సినిమాని ప్రతి అభిమాని తమ కుటుంబంతో కలసి చూసేలా తీయబోతున్నాం. బాలకృష్ణ రెండు కోణాల్లో సాగే పాత్ర పోషిస్తున్నారు. ఆయన 99వ సినిమా కాబట్టి మరింత బాధ్యతతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నా. ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ తొలిసారి తెలుగులో నిర్మిస్తున్న సినిమా ఇదే'' అన్నారు దర్శకుడు.

  రచయిత కోన వెంకట్‌ మాట్లాడుతూ ''బాలకృష్ణగారి సినిమాకి కథ అందించడం ఆనందంగా ఉంది. ఆయన చేసిన సినిమాల్ని గుర్తు చేసుకొంటూ వాటికి దీటుగా ఉండేలా ఈ కథని మలిచాం. బాలకృష్ణ పాత్ర హుందాగా ఉంటుంది. కుటుంబ ప్రేక్షకుల్ని అలరించేలా మంచి వినోదాన్నీ పండించబోతున్నారు''అన్నారు.

  నందమూరి బాలకృష్ణ, అంజలి, నాజర్, బ్రహ్మానందం, రవి కిషన్, కబీర్, వెన్నెల కిషోర్, పృథ్వి, కాశీ విశ్వనాథ్, ఆనంద్, సుప్రీత్ అమిత్ తదితరులు నటిస్తున్నారు. ప్రొడ్యూసర్: ఏరోస్ ఇంటర్నేషనల్, కోప్రొడ్యూసర్: వేదాశ్వ క్రియేషన్స్, డైరెక్టర్: శ్రీవాస్, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్, గోపీ మోహన్, మాటలు: ఎం. రత్నం, రచన: శ్రీధర్ సీపాన, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, మ్యూజిక్: థమన్, ఎడిటర్: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మకడలి, ఫైట్స్: రవివర్మ, స్టిల్స్: అన్బు, పి.ఆర్.ఓ: వంశీ శేఖర్.

  English summary
  Nandamuri Balakrishna’s upcoming movie “Dictator” under the direction of Sriwass the movie is near the completion.The movie audio release date is December 20.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X