»   » ఖరారు: బాలకృష్ణ 'డిక్టేటర్‌' టీజర్ తేదీ

ఖరారు: బాలకృష్ణ 'డిక్టేటర్‌' టీజర్ తేదీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'ప్రాణం తీసే భయం కన్నా ప్రాణం పోసే ఆయుధం గొప్పది. ఆ వెపనే నా క్యారెక్టర్‌. దాని పేరే డిక్టేటర్‌' అంటూ వస్తున్న బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 99వ చిత్రం 'డిక్టేటర్‌'. అంజలి హీరోయిన్. శ్రీవాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఎరోస్‌ ఇంటర్నేషనల్‌, వేదాశ్వ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రం టీజర్ ని వినాయిక చవితి(సెప్టెంబర్ 17) కి విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. చిత్రం 2016 సంక్రాతికి విడుదల కానుంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


బాలకృష్ణ మాట్లాడుతూ ''ఈ సినిమా పేరు చాలా బలమైనది. అందుకు తగ్గట్టుగానే కథని తయారు చేశారు. ఇంతకు ముందున్న రికార్డుల్ని తిరగరాసేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు దర్శకుడు. ప్రాణం తీసే భయం కన్నా ప్రాణం పోసే ఆయుధం గొప్పదనే కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకొంటున్న ఈ సినిమా ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుంది. మంచి కథకి, మంచి నటీనటులు, సాంకేతికబృందం తోడైంది. గత చిత్రాల్లాగే ఇదీ మంచి విజయాన్ని సొంతం చేసుకొంటుంది''అన్నారు.


Balakrishna's Dictator teaser for Vinayaka Chaviti ?

అంజలి మాట్లాడుతూ ''తొలిసారి బాలకృష్ణగారితో కలిసి నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇదివరకు ఎప్పుడూ చేయని ఓ విభిన్నమైన పాత్రని ఇందులో పోషిస్తున్నాను''అన్నారు.


దర్శకుడు మాట్లాడుతూ..''నా తొలి చిత్రం'లక్ష్యం' పూర్తయిన వెంటనే బాలకృష్ణగారితో సినిమా చేయాలనుకొన్నా. కానీ అప్పట్లో కుదరలేదు. అది ఒక రకంగా మంచికే అయ్యింది. ఇప్పుడు బాలకృష్ణగారి సినిమాకి దర్శకత్వం వహిస్తుండడంతోపాటు, నిర్మాణంలోనూ భాగం పంచుకొనే అవకాశం దొరికింది. బాలకృష్ణ ఇదివరకు కుటుంబ ప్రేక్షకుల్ని అలరించే సినిమాలు చేశారు, అభిమానుల్ని అలరించే చిత్రాలూ చేశారు. మేం ఈ సినిమాని ప్రతి అభిమాని తమ కుటుంబంతో కలసి చూసేలా తీయబోతున్నాం. బాలకృష్ణ రెండు కోణాల్లో సాగే పాత్ర పోషిస్తున్నారు. ఆయన 99వ సినిమా కాబట్టి మరింత బాధ్యతతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నా. ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ తొలిసారి తెలుగులో నిర్మిస్తున్న సినిమా ఇదే'' అన్నారు దర్శకుడు.


రచయిత కోన వెంకట్‌ మాట్లాడుతూ ''బాలకృష్ణగారి సినిమాకి కథ అందించడం ఆనందంగా ఉంది. ఆయన చేసిన సినిమాల్ని గుర్తు చేసుకొంటూ వాటికి దీటుగా ఉండేలా ఈ కథని మలిచాం. బాలకృష్ణ పాత్ర హుందాగా ఉంటుంది. కుటుంబ ప్రేక్షకుల్ని అలరించేలా మంచి వినోదాన్నీ పండించబోతున్నారు''అన్నారు.


అంజలి హీరోయిన్ గా నటించనున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్ ఎంపిక కావల్సి వుంది. నందమూరి బాలకృష్ణ, అంజలి, నాజర్, బ్రహ్మానందం, రవి కిషన్, కబీర్, వెన్నెల కిషోర్, పృథ్వి, కాశీ విశ్వనాథ్, ఆనంద్, సుప్రీత్ అమిత్ తదితరులు నటిస్తున్నారు. ప్రొడ్యూసర్: ఏరోస్ ఇంటర్నేషనల్, కోప్రొడ్యూసర్: వేదాశ్వ క్రియేషన్స్, డైరెక్టర్: శ్రీవాస్, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్, గోపీ మోహన్, మాటలు: ఎం. రత్నం, రచన: శ్రీధర్ సీపాన, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, మ్యూజిక్: థమన్, ఎడిటర్: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మకడలి, ఫైట్స్: రవివర్మ, స్టిల్స్: అన్బు, పి.ఆర్.ఓ: వంశీ శేఖర్.

English summary
Balakrishna 's 99th film ‘Dictator’ which is being directed by Sriwaas first look teaser on Vinayaka Chaviti which happens to be on September 17th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu