twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దటీజ్ బాలయ్య :'లెజెండ్‌' 275 వేడుక

    By Srikanya
    |

    హైదరాబాద్ : బాలకృష్ణ వంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో కి సరైన కథ పడితే ఎలా ఉంటుందో,ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో 'లెజెండ్‌' మరో సారి ప్రూవ్ చేసింది. ఈ చిత్రం ఇప్పుడు 275 రోజులు పూర్తి చేసుకొంది. కడప జిల్లా ప్రొద్దుటూరు (అర్చన), కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు (మినీ శివ)లలో 275 రోజులు పూర్తి చేసుకొంది. ఈ సందర్భంగా ఈనెల 28న ప్రొద్దుటూరులో 'లెజెండ్‌' సంబరాలు జరుపనున్నారు. కార్యక్రమంలో బాలకృష్ణ, సోనాల్‌ చౌహాన్‌, రాధికా ఆప్టేలతో పాటు చిత్రబృందమంతా పాల్గొనబోతోంది.

    https://www.facebook.com/TeluguFilmibeat

    పూర్తి వివరాల్లోకి వెళితే...

    బోయపాటి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘లెజెండ్‌' చిత్రం 275 రోజులు పూర్తి చేసుకుంది. లెజెండ్‌ చిత్రం వంద కాదు..రెండు వందలు కాదు ఏకంగా 275 రోజుల ప్రదర్శిస్తూ సరికొత్త రికార్డు నెలకొల్పింది. కడప జిల్లా ప్రొద్దుటూరులోని అర్చన థియేటర్‌, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని మిని శివ థియేటర్లలో లెజెండ్‌ 275 రోజులు పూర్తిచేసుకుంది. దీంతో బాలయ్య అభిమానులు సంతోషంతో పండుగ చేసుకుంటున్నారు.

    బాలకృష్ణ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిన లెజెండ్‌ చిత్రాన్ని సాయి కొర్రపాటి సమర్పణలో అనిల్‌ సుంకర, గోపి ఆచంట, రామ్‌ ఆచంట నిర్మాతలుగా క్వాలిటీ విషయంలో రాజీపడకుండా తెరకెక్కించారు. ఈ చిత్రం 127 సెంటర్లలో 50 రోజులు, 31 సెంటర్లలో 100 రోజులు పూర్తిచేసుకుని పెద్ద విజయం సాధించింది. ఈ సందర్భంగా 275 రోజులు పూర్తిచేసుకున్న థియేటర్లలలో ఈనెల 28సాయంత్రం 5గంటలకు అభిమానులు విజయోత్సవ సంబరాలు చేపట్టనున్నారు.

    Balakrishna's 'Legend' Completes 275 days

    'నీకు బీపీ వస్తే నీ పీఏ వణుకుతాడేమో.. నాకు బీపీ వస్తే ఏపీ వణుకుద్దీ..' అంటూ నందమూరి బాలకృష్ణ పలికిన సంభాషణలు, బోయపాటి శ్రీను దర్శకత్వ శైలి, రెండు పాత్రల్లో చూపించిన వైవిధ్యం, కథ కథనాలు, దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం వెరసి 'లెజెండ్‌'కి మరపురాని విజయాన్ని అందించాయి. 'సింహా' తరవాత బాలకృష్ణ-బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన చిత్రం 'లెజెండ్‌'. వారాహి చలనచిత్రం, 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. 2014లో 'లెజెండ్‌' మర్చిపోలేని విజయాన్ని నమోదు చేసుకొంది.

    నందమూరి బాలకృష్ణ అభినయం, ఆయన పలికిన సంభాషణల తీరు,భోయపాటి శ్రీను దర్శకత్వ ప్రతిభ, వారాహి చలన చిత్రం మరియు 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ప్ నిర్మాణ విలువలు, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రం సాధిస్తున్న సంగీతం ఈ చిత్రం సాధిస్తున్న సంచలన విజయంలో కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా బోయపాటి శ్రీను తన 5వ చిత్రంతోనే 50 కోట్ల క్లబ్ లో స్థానం సంపాదించుకోవడం విశేషం.

    2014లో సరైన హిట్టు ఒక్కటీ లేదే అనుకుంటున్న తరుణంలో సరిగ్గా బోయపాటి 'లెజెండ్‌'ని రంగంలోకి దించాడు. ఈ ఏడాదిలోనే బ్లాక్‌బస్టర్‌ హిట్‌ని పరిశ్రమకు ఇచ్చాడు. అటు ప్రేక్షకుల్ని కేరింతలు కొట్టించాడు. ఈ క్రెడిట్‌ పూర్తిగా నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనులదే. బాలయ్యలో అసలైన సింహాన్ని తెరపైకి తెచ్చాడు. యాక్షన్‌లో ఉగ్రనరసింహుడిని చూపించాడని ఫ్యాన్స్ అంటున్నారు. లెజెండ్‌ గర్జనతో థియోటర్స్ మార్మోగిపోయాయి. కుటుంబ ప్రేక్షకుల కోసం చక్కని సెంటిమెంట్‌ రంగరించి వదలటం ప్లస్ అయ్యింది.

    ముఖ్యంగా సెకండాఫ్ లో సెంటిమెంట్‌, ట్రెయిన్‌ ట్రాక్‌పై ఎపిసోడ్‌లో ప్రేమ సన్నివేశం ప్రేక్షకుడి గుండె పగిలిపోయే ఉద్వేగాన్ని ఇచ్చాయి. గుడిమెట్లపై బాలయ్య ఉగ్రరూపం యాక్షన్‌కే కొత్త హంగులు అద్దిందని అంతటా వినపడుతోంది. మాస్‌ యాక్షన్‌ ప్రియులకు ఇదో కన్నుల పండుగగా మారింది.

    English summary
    'Legend' has completed 275 days now at Archana theatre in Proddutur (Single Shift 4 shows) and Mini Shiva theatre in Yemmiganur (direct 4 shows). With completing 275 days in Proddutur, 'Legend' has created record as the film, which has run for the most number of days in Kadapa district. On the occasion of completing 275 days, celebrations will be done on December 28th from 5 pm in Proddutur.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X