»   » బాలకృష్ణ “లెజండ్”: అదిరిపోయే కొత్త రికార్డు ఇంకోటి

బాలకృష్ణ “లెజండ్”: అదిరిపోయే కొత్త రికార్డు ఇంకోటి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బాలకృష్ణ సూపర్ హిట్ చిత్రం "లెజండ్" ఇంకో రికార్డు ని క్రియేట్ చేసింది. తెలుగు తెరపై తొలి డైమండ్ జూభ్లీ చిత్రంగా ఈ చిత్రం నిలిచింది. అప్పట్లో తొలి డైమండ్ జూబ్లీ చిత్రం (అరవై వారాలు) అన్నగారు నటించిన లవకుశ. ఇప్పట్లో లెజండ్ చిత్రం కావటం విశేషం. ఈ మేరకు నిర్మాతలు పోస్టర్ డిజైన్ చేసి అభిమానుల కోసం సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఉంచారు. ఇక్కడ మీరు చూస్తున్నది ఆ పోస్టరే.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ చిత్రం మార్చి 28 నాటికి రిలీజై సంవత్సరం అవుతుంది. ఇప్పటికీ రెండు థియోటర్ లలో ఈ చిత్రం ఆడుతూనే ఉంది. అంటే 60 వారాల పోస్టర్... ఎమ్మిగినూరు, ప్రొద్దుటూరులో పడనుంది.

ఈ రోజుల్లో రెండో వారం చిత్రం ఆడటం కష్టమన్న సమయంలో ఇలా కంటిన్యూగా సంవత్సరం పాటు ఆడటం అనేది ఓ రికార్డే. ఈ విషయంలో నందమూరి అభిమానులు చాలా ఆనందంగా ఉన్నారు. బాలకృష్ణ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిన లెజెండ్‌ చిత్రాన్ని సాయి కొర్రపాటి సమర్పణలో అనిల్‌ సుంకర, గోపి ఆచంట, రామ్‌ ఆచంట నిర్మాతలుగా క్వాలిటీ విషయంలో రాజీపడకుండా తెరకెక్కించారు. ఈ చిత్రం 127 సెంటర్లలో 50 రోజులు, 31 సెంటర్లలో 100 రోజులు పూర్తిచేసుకుని పెద్ద విజయం సాధించింది.

Balakrishna's Legend movie new record

‘సింహా'లో రాయల్‌గా కనిపించే బాలయ్యబాబును కాస్త మీటర్‌ పెంచి ఇందులో జనం కోసం పాటుపడే వ్యక్తిగా చూపించారు. 100 సినిమాల్లో ఫ్యామిలీ హీరోగా చేసిన జగపతిబాబును విలన్‌గా పరిచయం చేశారు. బాలయ్యబాబు పవర్‌ని తట్టుకోవాలంటే ఎదురుగా బలమైన వ్యక్తి తప్పకుండా ఉండాలి. జగపతిబాబుగారు ఆ రోల్‌కి సంపూర్ణమైన న్యాయం చేశారు.''

బాలకృష్ణ మాట్లాడుతూ ... ''ఎమ్మిగనూరులో 'లెజెండ్‌' సినిమా 400 రోజులు ఆడటం ఆనందంగా ఉంది. ఇంతమంది అభిమానం పొందడం నా పూర్వజన్మ సుకృతం. చరిత్ర సృష్టించాలన్నా మేమే..చరిత్రను తిరగరాయాలన్నా మేమే.''అన్నారు

సినిమా గురించి... 'నీకు బీపీ వస్తే నీ పీఏ వణుకుతాడేమో.. నాకు బీపీ వస్తే ఏపీ వణుకుద్దీ..' అంటూ నందమూరి బాలకృష్ణ పలికిన సంభాషణలు, బోయపాటి శ్రీను దర్శకత్వ శైలి, రెండు పాత్రల్లో చూపించిన వైవిధ్యం, కథ కథనాలు, దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం వెరసి 'లెజెండ్‌'కి మరపురాని విజయాన్ని అందించాయి. 'సింహా' తరవాత బాలకృష్ణ-బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన చిత్రం 'లెజెండ్‌'. వారాహి చలనచిత్రం, 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.

2014లో 'లెజెండ్‌' మర్చిపోలేని విజయాన్ని నమోదు చేసుకొంది. నందమూరి బాలకృష్ణ అభినయం, ఆయన పలికిన సంభాషణల తీరు,భోయపాటి శ్రీను దర్శకత్వ ప్రతిభ, వారాహి చలన చిత్రం మరియు 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ప్ నిర్మాణ విలువలు, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రం సాధిస్తున్న సంగీతం ఈ చిత్రం సాధిస్తున్న సంచలన విజయంలో కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా బోయపాటి శ్రీను తన 5వ చిత్రంతోనే 50 కోట్ల క్లబ్ లో స్థానం సంపాదించుకోవడం విశేషం.

2014లో సరైన హిట్టు ఒక్కటీ లేదే అనుకుంటున్న తరుణంలో సరిగ్గా బోయపాటి 'లెజెండ్‌'ని రంగంలోకి దించాడు. ఈ ఏడాదిలోనే బ్లాక్‌బస్టర్‌ హిట్‌ని పరిశ్రమకు ఇచ్చాడు. అటు ప్రేక్షకుల్ని కేరింతలు కొట్టించాడు. ఈ క్రెడిట్‌ పూర్తిగా నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనులదే. బాలయ్యలో అసలైన సింహాన్ని తెరపైకి తెచ్చాడు. యాక్షన్‌లో ఉగ్రనరసింహుడిని చూపించాడని ఫ్యాన్స్ అంటున్నారు.

లెజెండ్‌ గర్జనతో థియోటర్స్ మార్మోగిపోయాయి. కుటుంబ ప్రేక్షకుల కోసం చక్కని సెంటిమెంట్‌ రంగరించి వదలటం ప్లస్ అయ్యింది. ముఖ్యంగా సెకండాఫ్ లో సెంటిమెంట్‌, ట్రెయిన్‌ ట్రాక్‌పై ఎపిసోడ్‌లో ప్రేమ సన్నివేశం ప్రేక్షకుడి గుండె పగిలిపోయే ఉద్వేగాన్ని ఇచ్చాయి. గుడిమెట్లపై బాలయ్య ఉగ్రరూపం యాక్షన్‌కే కొత్త హంగులు అద్దిందని అంతటా వినపడుతోంది. మాస్‌ యాక్షన్‌ ప్రియులకు ఇదో కన్నుల పండుగగా మారింది.

English summary
Two centres in Rayalaseema including Emmiganuru and Proddutur have been playing “Legend” from the past 60 weeks and scored a record now.
Please Wait while comments are loading...