»   »  'లయన్' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ !! (ఏరియావైజ్)

'లయన్' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ !! (ఏరియావైజ్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలకృష్ణ తాజా చిత్రం 'లయన్' మొన్న గురువారం విడుదలైంది. అయితే మార్నింగ్ షోకే చాలా చోట్ల నెగిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కలెక్షన్స్ విషయంలో మాత్రం ఓకే అనిపించుకుంది. రికార్డులు తిరగరాస్తుందనుకున్న ఈ చిత్రం డివైడ్ టాక్ దెబ్బకు..తొలి రెండు

రోజులు...కేవలం7.8 గ్రాస్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంతేకాదు మూడో రోజు అంటే శనివారం,కీలకమైన ఆదివారాలు బాగా డ్రాప్ కనపడింది. ముఖ్యంగా మల్టిఫ్లెక్స్ లు చాలా చోట్ల ఖాళీగా కనిపించాయి. బి,సి సెంటర్లే ఈ చిత్రాన్ని కొద్దో,గొప్పో ఆదుకుంటున్నాయి. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్


...ఆదివారం కాకుండా...ఆ రిపోర్ట్ రావాల్సి ఉంది.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


 Balakrishna's Lion First weekend Collections


ఏరియా మూడు రోజుల షేర్ ( కోట్లలో)


-------------------- ----------------------------------------------


నైజాం 2.42


సీడెడ్ 1.98


నెల్లూరు 0.50


కృష్ణా 0.69


గుంటూరు 1.05


వైజాగ్ 0.84


తూర్పు గోదావరి 0.66


పశ్చిమ గోదావరి 0.63


మూడు రోజులు ఎపి & తెలంగణా 8.77( కేవలం మూడు రోజులు)


ఆదివారంతో కలిపి ఎస్టిమేషన్ 11 కోట్లుకథేమిటంటే....


ముంబైలోని మనోహర్ హాస్పటిల్ లో ...కోమాలో ఉన్న గాడ్సే(బాలకృష్ణ) ఒకరోజు లేచి కూర్చుంటాడు. చాలా కాలం తర్వాత స్పృహలోకి వచ్చిన గాడ్సే...తన పేరు బోస్ అని గాడ్సే కాదని చెప్తూడు. అంతేకాక అక్కడకి వచ్చిన తల్లితండ్రులు(చంద్రమోహన్, జయసుధ)లను, భార్య (రాధికా


ఆప్టే)ని గుర్తుపట్టక...వాళ్లు అసలు తన వాళ్ళే కాదని పొమ్మంటాడు. అంతటితో సరిపెట్టక..సరయు(త్రిష) రోడ్డు మీద కనపడితే..ఆమె తన గర్ల్ ఫ్రెండ్ అని వెనకపడతాడు .


ఓ ఇంటికి వెళ్లి అది తన ఇల్లే అంటాడు. అక్కడున్న చలపతిరావు, గీతలను తన తల్లితండ్రులు అంటాడు. ఇంతకీ గాడ్సే ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు. అదేమన్నా హెల్త్ ప్లాబ్లమా..లేక అతను చెప్పేది నిజమేనా... ఇంతకీ ..అతను చెప్పే బోస్ ఎవరు...ముఖ్యమంత్రి (ప్రకాష్ రాజ్)


కు గాడ్సేకు వైరం ఏమిటి... బోస్, గాడ్సే వేరు వేరా..ఒకరేనా అనే విషయాలు తెలుసుకోవాలంటే ...సినిమా చూడాల్సిందే.


బాలకృష్ణ సరసన త్రిష హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, జయసుధ, అలీ, గీత, చంద్రమోహన్‌ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: వెంకట్‌ ప్రసాద్‌, కూర్పు: గౌతంరాజు

English summary
Lion movie collected a share of Rs.8.77 crores at the end of its three days run in AP and Telangana.
Please Wait while comments are loading...