Don't Miss!
- News
Pavan Kalyan: ట్రాఫిక్‌లో చిక్కుకున్న పవన్ కల్యాణ్.. పోలీసులు ఏం చేశారంటే..!
- Finance
Axis Bank: యాక్సిస్ బ్యాంక్ కళ్లు చెదిరే లాభాలు.. కానీ పడిపోయిన స్టాక్ ధర.. ఏం చేయాలి..?
- Lifestyle
స్త్రీ, పురుషులు ఇద్దరూ తమ సంతానోత్పత్తని మెరుగుపరుచుకోవడానికి ఇవి తినాలి!
- Technology
ఫిబ్రవరి లో లాంచ్ కానున్న టాప్ ప్రీమియం ఫోన్లు! టాప్ 10 ఫోన్ల లిస్ట్!
- Sports
INDvsNZ : మూడో వన్డేలో టాప్ స్కోర్ చేసే బ్యాటర్ ఎవరు?.. ఈ ముగ్గురి మధ్య పోటీ!
- Automobiles
మాజీ విశ్వ సుందరి 'సుస్మితా సేన్' మనసు దోచిన లగ్జరీ కారు.. ధర ఎంతో తెలుసా?
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
Veera Simha Reddy: బాలయ్య సంచలన రికార్డు.. ఏకంగా అన్ని కోట్లకు మూవీ రైట్స్.. ఎంతొస్తే హిట్ అంటే!
గతంలో కంటే ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ జెట్ స్పీడుతో దూసుకుపోతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. దీనికితోడు తన గత చిత్రం 'అఖండ'తో ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నారు. దీంతో మరింత జోష్‌తో ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు బాలయ్య 'వీర సింహా రెడ్డి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఎన్నో అంచనాలను ఏర్పరచుకున్న ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ రైట్స్ గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం పదండి!

వీర సింహా రెడ్డిగా బాలయ్య మాస్
గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రమే 'వీరసింహారెడ్డి'. ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ కాగా.. వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ వంటి స్టార్లు కూడా కీలక పాత్రలను పోషించారు. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మించారు. అలాగే, థమన్ దీనికి సంగీతాన్ని అందించాడు.
Golden Globe Awards: RRR పెను సంచలనం.. నాటు నాటు సాంగ్‌కు అత్యుత్తమ అవార్డ్.. ఏషియాలోనే తొలిసారి

రీవేంజ్ స్టోరీతో.. కొత్తదనం చూపి
క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'వీర సింహా రెడ్డి' మూవీని గతంలో మాదిరిగానే రీవేంజ్ స్టోరీతో తెరకెక్కించినట్లు తెలిసింది. అయితే, ఇందులో గోపీచంద్ మార్క్ సరికొత్త ట్రీట్‌మెంట్.. బాలయ్య పవర్‌ఫుల్ యాక్షన్ అదిరిపోతుందట. ముఖ్యంగా ఇందులో ఎమోషన్స్ అదిరిపోయేలా డిజైన్ చేసినట్లు తెలిసింది. దీంతో ఈ మూవీపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి.

రిలీజ్‌కు రెడీ.. ఫ్యాన్స్ అరాచకం
నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన 'వీర సింహా రెడ్డి' మూవీ విడుదలపై అనుమానాలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని జనవరి 12న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇక, అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ఫీవర్ మొదలైంది. ఈ సినిమా కోసం థియేటర్లను ముస్తాబు చేస్తూ.. ఫ్లెక్సీలు రెడీ చేస్తూ ఫ్యాన్స్ తెగ రచ్చ చేస్తూ అరాచకం సృష్టిస్తున్నారు.
Varisu Twitter Review: విజయ్ మూవీకి షాకింగ్ టాక్.. అసలైందే మిస్ చేసి.. తమిళంలోనే ఇలా ఉంటే!

సినిమా హక్కులు హట్ కేక్‌ల్లాగే
పవర్‌ఫుల్ కాంబోలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'వీర సింహా రెడ్డి' మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది విడుదలైనా మంచి రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే అన్ని ఏరియాల రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడు అయ్యాయని అంటున్నారు.

ఏపీ, తెలంగాణలో బిజినెస్ ఇలా
'వీర సింహా రెడ్డి' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరిగింది. ట్రేడ్ లెక్కల ప్రకారం.. నైజాంలో రూ. 15 కోట్లు, సీడెడ్‌లో రూ. 13 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 9 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 5.20 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 5 కోట్లు, గుంటూరులో రూ. 6.40 కోట్లు, కృష్ణాలో రూ. 5 కోట్లు, నెల్లూరులో రూ. 2.70 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 61.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
బ్రాలో టెంపరేచర్ పెంచేసిన దివి: అందాల ఆరబోతకు హద్దే లేదుగా!

టోటల్‌గా ప్రీ బిజినెస్ ఎంతంటే
నందమూరి బాలకృష్ణ నటించిన 'వీర సింహా రెడ్డి' మూవీకి దేశ వ్యాప్తంగా కూడా మంచి స్పందన దక్కుతోంది. దీంతో ఈ సినిమా కర్నాటక హక్కులు రూ. 4.50 కోట్లకు రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 6.20 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్లు వ్యాపారం జరిగింది. అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 74 కోట్లుగా ఉంది.

బాలయ్య కెరీర్‌లోనే అత్యధికం
నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన 'వీర సింహా రెడ్డి' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్లు బిజినెస్ జరిగింది. తద్వారా ఆయన కెరీర్‌లోనే అత్యధిక బిజినెస్ చేసుకున్న చిత్రంగా ఇది రికార్డు సాధించింది. గతంలో 'అఖండ' మూవీకి రూ. 53 కోట్లు మేర బిజినెస్ జరిగింది. అది సూపర్ హిట్ అయింది. దీంతో ఇప్పుడు దీనికి ఏకంగా రూ. 20 కోట్లు వ్యాపారం పెరిగింది.