Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Veera Simha Reddy: బాలకృష్ణ పెను సంచలనం.. అక్కడ RRR రికార్డు సమం.. టాప్ చిత్రాల్లో వీర సింహా రెడ్డి
ఆరు పదుల వయసులోనూ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా.. మునుపటి లాంటి ఉత్సాహంతోనే వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆయన మరింత జోష్‌తో కనిపిస్తున్నారు. దీంతో పలు చిత్రాలను లైన్‌లో పెట్టేశారు.
ఈ క్రమంలోనే ఇప్పుడు బాలయ్య 'వీర సింహా రెడ్డి' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. క్రేజీ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ సినిమా తాజాగా కొన్ని ముఖ్యమైన రికార్డులను సాధించింది. ఆ సంగతులేంటో మీరే చూసేయండి!

వీర సింహా రెడ్డిగా బాలకృష్ణ
నటసింహా బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందిన మాస్ మూవీనే 'వీర సింహా రెడ్డి'. ఈ యాక్షన్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ కాగా.. వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోజ్ వంటి స్టార్లు నటించారు. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మించారు. అలాగే, థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు.
ఘాటు ఫొటోతో టెంప్ట్ చేస్తోన్న దీప్తి సునైనా: కింది నుంచి చూపిస్తూ హాట్‌గా!

టాక్‌తో సంబంధం లేకుండా
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'వీర సింహా రెడ్డి' మూవీ భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, దీనికి సంబంధం లేకుండా రెస్పాన్స్ భారీ స్థాయిలో వచ్చింది. మరీ ముఖ్యంగా మొదటి రోజు ఫస్ట్ అండ్ సెకెండ్ షోకు అత్యధిక స్పందన దక్కిందని చెప్పాలి.

ఒక్క రోజులోనే అన్ని కోట్లతో
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన 'వీర సింహా రెడ్డి' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా స్పందన భారీగా దక్కడంతో కలెక్షన్లు కూడా అదే రీతిలో పోటెత్తాయి. దీంతో ఈ సినిమా మొదటి రోజే దాదాపు రూ. 30 కోట్లు షేర్‌తో పాటు యాభై కోట్లు గ్రాస్ మార్కును చేరుకుంది. తద్వారా బాలయ్య కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్‌తో సంచలన రికార్డు నమోదు చేసింది.
షర్ట్ విప్పేసి రెచ్చిపోయిన నిధి అగర్వాల్: ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిందా ఏంటీ!

హైదరాబాద్‌లో 1000 షోలు
'వీర సింహా రెడ్డి' మూవీ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1000కి పైగా థియేటర్లలో విడుదలైంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఇది ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. అంతేకాదు, హైదరాబాద్‌లో ఈ చిత్రానికి స్పెషల్ షోలతో కలిపి మొత్తంగా ఆరు పడ్డాయి. ఇలా ఒక్క నగరంలోనే ఈ చిత్రం 1000 షోలు ప్రదర్శితం చేసుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన కొద్ది చిత్రాల్లో స్థానం సాధించింది.

ఏడులోనే వీర సింహా రెడ్డి
హైదరాబాద్ నగరంలో మొదటి రోజే 1000 అంతకంటే ఎక్కువ షోలు ప్రదర్శితం చేసుకున్న సినిమాల జాబితాలో 'సాహో' మొదటి స్థానంలో ఉంది. దీని తర్వాత వరుసగా 'సరిలేరు నీకెవ్వరు', 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్', 'RRR', 'సర్కారు వారి పాట', 'వీర సింహా రెడ్డి' మూవీలు ఉన్నాయి. అందుకే నైజాంలో ఈ చిత్రాలన్నీ భారీ వసూళ్లను రాబట్టాయి.
ఉల్లిపొర లాంటి డ్రెస్ మంచు లక్ష్మి షో: ఓ రేంజ్‌లో ఎద అందాలు ఆరబోత

క్రాస్ రోడ్స్‌లోనూ రికార్డు
ఇక, నైజాం ఏరియాలో అత్యంత ముఖ్యమైన ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో 'వీర సింహా రెడ్డి' మొదటి రోజే రూ. 43 లక్షలు గ్రాస్‌ను వసూలు చేసి సత్తా చాటింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' పేరిట ఉన్న రూ. 41 లక్షలు రికార్డును బ్రేక్ చేసేసింది. ఇక, ఈ జాబితాలో 'RRR' రూ. 75 లక్షలతో మొదటి స్థానంలో ఉండగా.. సర్కారు వారి పాట, కేజీఎఫ్ 2 తర్వాత ఉన్నాయి.