Don't Miss!
- Finance
Vistara: రికార్డు సృష్టించిన విస్తారా ఎయిర్ వేస్.. కంపెనీ పెట్టాక తొలిసారిగా..
- News
KTR: ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేసిన కేటీఆర్.. చూస్తే ఆగమే ఇగ..!
- Lifestyle
Republic Day 2023: పిల్లల కోసం రిపబ్లిక్ డే స్పీచ్ ఐడియాలు.. ఈ టిప్స్ పాటిస్తే ప్రైజ్ మీదే
- Sports
KL Rahul : ప్రేయసికి మూడు ముళ్లు వేయనున్న రాహుల్.. ఐపీఎల్ తర్వాత భారీగా రిసెప్షన్!
- Automobiles
భారత్‌లో Aura ఫేస్‌లిఫ్ట్ విడుదల చేసిన హ్యుందాయ్: ధర & వివరాలు
- Technology
స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్ & ఎలక్ట్రానిక్ గాడ్జెట్లపై రిపబ్లిక్ డే ఆఫర్లు!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
Veera Simha Reddy Day 1 Collections: బాలయ్య ఊచకోత.. టాప్ మూవీగా రికార్డు.. ఒక్క రోజే అన్ని కోట్లా!
తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ సుస్థితరమైన స్థానాన్ని సొంతం చేసుకుని.. సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మరింత ఉత్సాహంగా కనిపిస్తోన్న ఆయన.. వరుసగా సినిమాలు చేస్తోన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'వీర సింహా రెడ్డి' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీనికి టాక్‌తో సంబంధం లేకుండా స్పందన దక్కుతోంది. ఫలితంగా ఈ చిత్రానికి మొదటి రోజు కలెక్షన్లు భారీ స్థాయిలో వచ్చాయి. ఈ నేపథ్యంలో వీర సింహా రెడ్డి ఫస్ట్ డే రిపోర్టును మీరే చూసేయండి!

వీర సింహా రెడ్డిగా వచ్చిన బాలయ్య
నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని రూపొందించిన పవర్‌ఫుల్ యాక్షన్ మూవీనే 'వీర సింహా రెడ్డి'. ఈ యాక్షన్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ కాగా.. వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోజ్ వంటి స్టార్లు నటించారు. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మించారు. అలాగే, థమన్ దీనికి సంగీతాన్ని సమకూర్చాడు.
ఘాటు
ఫొటోతో
టెంప్ట్
చేస్తోన్న
దీప్తి
సునైనా:
కింది
నుంచి
చూపిస్తూ
హాట్‌గా!

వీర సింహా రెడ్డి బిజినెస్ వివారాలు
నటసింహా బాలయ్య నటించిన 'వీర సింహా రెడ్డి' మూవీకి నైజాంలో రూ. 15 కోట్లు, సీడెడ్‌లో రూ. 13 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 33.30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 61.30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటతో రూ. 4.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.20 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్ల బిజినెస్ చేసింది.

అలాంటి టాక్... కలెక్షన్లు సునామీ
ఎన్నో అంచనాల నడుమ రూపొందిన బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి' మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, దీనికి సంబంధం లేకుండా రెస్పాన్స్ భారీ స్థాయిలో వచ్చింది. దీంతో ఈ సినిమాకు అనుకున్న దానికంటే ఓపెనింగ్ డేన అత్యధిక కలెక్షన్లు వచ్చాయని చెప్పుకోవచ్చు.
షర్ట్
విప్పేసి
రెచ్చిపోయిన
నిధి
అగర్వాల్:
ప్యాంట్
వేసుకోవడం
మర్చిపోయిందా
ఏంటీ!

తొలి రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
'వీర సింహా రెడ్డి'కి ఆంధ్రా, తెలంగాణలో ఫస్ట్ డే భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 5.21 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.55 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.53 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.73 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.08 కోట్లు, గుంటూరులో రూ. 3.40 కోట్లు, కృష్ణాలో రూ. 1.65 కోట్లు, నెల్లూరులో రూ. 1.20 కోట్లతో కలిపి.. రూ. 23.35 కోట్లు షేర్, రూ. 39.10 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
ఆంధ్రా, తెలంగాణలో భారీ స్థాయిలో రూ. 23.35 కోట్లు కొల్లగొట్టిన బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.60 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.95 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే తొలి రోజు బాలయ్య నటించిన సినిమా ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 28.90 కోట్లు షేర్, రూ. 50.10 కోట్లు గ్రాస్ వచ్చింది.
బట్టలు విప్పేసి షాకిచ్చిన హీరోయిన్: హాట్ షోలో ఎవరూ చేయని విధంగా!

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'వీర సింహా రెడ్డి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 74 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి రోజు దీనికి రూ. 28.90 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 45.10 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

ఏకంగా అన్ని కోట్లతో కొత్త రికార్డు
'వీర సింహా రెడ్డి' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు పోటెత్తాయి. దీంతో ఈ సినిమా మొదటి రోజే దాదాపు రూ. 30 కోట్లు షేర్‌తో పాటు యాభై కోట్లు గ్రాస్ మార్కును చేరుకుంది. తద్వారా బాలయ్య కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్‌తో సంచలన రికార్డు సాధించింది. అలాగే, సీడెడ్‌లో ఎక్కువ ఓపెనింగ్ సాధించిన చిత్రాల్లో ఇది ఐదో స్థానానికి చేరి అరవింద సమేత రికార్డు దాటింది.