twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Veera Simha Reddy Day 3 Collections: కొంత పెరిగాయి కానీ కష్టమే.. వస్తే ఈ రెండు రోజుల్లోనే రావాలి!

    |

    గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన ఫ్యాక్షన్ బ్యాగ్రౌండ్ యాక్షన్ మూవీ వీర సింహారెడ్డి సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుంది. ఈ సినిమాకు కొంత నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా బాక్సాఫీస్ వద్ద ఒక లెవెల్లో అయితే కలెక్షన్స్ అందుకుంటూ వెళుతుంది. ఇక మొదటి రెండు రోజుల్లో కలెక్షన్స్ లో చాలా తేడాలు కనిపించాయి. ఇక మూడవరోజు ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది ఇంకా ఎంత వస్తే సక్సెస్ అయినట్లు లెక్క అనే వివరాల్లోకి..

     వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ బిజినెస్

    వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ బిజినెస్


    'వీర సింహా రెడ్డి' మూవీ ఏరియాల వారిగా చేసిన బిజినెస్.. నైజాంలో రూ. 15 కోట్లు, సీడెడ్‌లో రూ. 13 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 33.30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 61.30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకటతో రూ. 4.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 6.20 కోట్లతో కలిపి.. వరల్డ్ వైడ్ గా రూ. 73 కోట్ల బిజినెస్ చేసింది.

    3వ రోజు ఊహించని కలెక్షన్స్

    3వ రోజు ఊహించని కలెక్షన్స్


    'వీరసింహారెడ్డి'కి నైజాం, తెలంగాణలో మొదటి రెండు రోజుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక మూడవ రోజు వచ్చిన కలెక్షన్స్.. నైజాంలో రూ. 2.02 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.68 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 72 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 60 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 24 లక్షలు గుంటూరులో రూ. 48 లక్షలు కోట్లు, కృష్ణాలో రూ. 44 లక్షలు, నెల్లూరులో రూ. 27 లక్షలతో కలిపి.. రూ. 6.45 కోట్లు షేర్, రూ. 10.90 కోట్లు గ్రాస్ వచ్చింది.

    వరల్డ్ వైడ్ 3 రోజుల లెక్క

    వరల్డ్ వైడ్ 3 రోజుల లెక్క

    ఆంధ్రా, తెలంగాణలో మూడు రోజుల కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఆంధ్ర తెలంగాణలో ఇప్పటివరకు 37 కోట్లు రాగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.60 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.95 కోట్లు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ లో 4.40 కోట్లు వచ్చాయి. దీంతో కలిపితే తొలి రోజు బాలయ్య నటించిన సినిమా ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లో రూ. 44.50 కోట్లు షేర్‌, రూ. 73.90 కోట్లు గ్రాస్ వచ్చింది.

    ప్రాఫిట్ లోకి రావాలంటే..

    ప్రాఫిట్ లోకి రావాలంటే..


    'వీర సింహా రెడ్డి' మూవీకి అంచనాలకు తగ్గట్టుగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 74 కోట్లుగా నమోదైంది. మూడు రోజుల్లో రూ. 44.50 కోట్ల షేర్ దక్కింది. అంటే మరో రూ. 29.50 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

    రెండు రోజుల్లోనే రావాలి

    రెండు రోజుల్లోనే రావాలి

    వీరసింహారెడ్డి సినిమాకు మొదటి రోజు 25.35 కోట్ల షేర్ రాగా రెండవ రోజు కేవలం 5.5 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. ఇక మూడవరోజు మాత్రం పండగ కావడంతో 6.45 కోట్లతో కలెక్షన్స్ కొంత పెరిగాయి. ఇక సంక్రాంతి రోజు కూడా ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ అయితే భారీగా నమోదయ్యాయి. సోమవారం కూడా సినిమాకు కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈ గ్యాప్ లోనే టార్గెట్ ను ఫినిష్ చేస్తే నష్టాలు రాకుండా ఉంటాయి. మరి సినిమా ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి.

    English summary
    Nandamuri Balakrishna Veera Simha Reddy Released January 15th Worldwide. Now This Movie Collects 6 Crores In Day 3.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X