twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bangarraju 9 Days Collections: వీకెండ్‌లో షాకింగ్ కలెక్షన్లు.. వసూళ్లు పెరిగినా బంగార్రాజుకు నిరాశే

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ మూవీలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. వీటికి ప్రేక్షకుల నుంచి కూడా రెస్పాన్స్ భారీ స్థాయిలోనే దక్కుతోంది. దీంతో అలాంటి చిత్రాలను చేయడానికి హీరోలు ఎంతో ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. ఇలా ఈ మధ్య కాలంలో వచ్చిన భారీ మల్టీస్టారర్ మూవీనే 'బంగార్రాజు'. అక్కినేని ఫ్యామిలీకి చెందిన నాగార్జున, నాగ చైతన్య కలిసి ఇందులో నటించారు. 'సోగ్గాడే చిన్ని నాయన'కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆరంభంలోనే ఈ చిత్రానికి కలెక్షన్లు కూడా భారీగా వచ్చాయి. తర్వాత తగ్గుతూ వచ్చి శనివారం పుంజుకుంది. ఈ నేపథ్యంలో 'బంగార్రాజు' మూవీ తొమ్మిది రోజుల కలెక్షన్ల రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి!

    బంగార్రాజుగా అక్కినేని స్టార్ల రచ్చ

    బంగార్రాజుగా అక్కినేని స్టార్ల రచ్చ

    అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే 'బంగార్రాజు'. కల్యాణ్ కృష్ణ కురసాల రూపొందించిన ఈ మూవీ 'సోగ్గాడే చిన్ని నాయన'కు సీక్వెల్‌గా రూపొందింది. ఇందులో రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా చేశారు. దీన్ని అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నాగార్జున నిర్మించారు. ఈ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.

    Deepika Padukone: వింత డ్రెస్‌తో అందాల ఆరబోత.. మొన్న రొమాన్స్ ఇప్పుడు ఘోరంగా!Deepika Padukone: వింత డ్రెస్‌తో అందాల ఆరబోత.. మొన్న రొమాన్స్ ఇప్పుడు ఘోరంగా!

    బంగార్రాజు మూవీ బిజినెస్ డీటేల్స్

    బంగార్రాజు మూవీ బిజినెస్ డీటేల్స్

    సంక్రాంతి బరిలో నిలిచిన 'బంగార్రాజు' మూవీ రైట్స్‌కు పోటీ ఏర్పడింది. దీంతో నైజాంలో రూ. 11 కోట్లు, సీడెడ్‌లో రూ. 6 కోట్లు, ఆంధ్రా మొత్తంలో రూ. 16.80 కోట్లతో రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 33.80 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.20 కోట్లుతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.15 కోట్ల బిజినెస్ జరిగిందట.

     9వ రోజు వచ్చిన కలెక్షన్ల వివరాలు

    9వ రోజు వచ్చిన కలెక్షన్ల వివరాలు

    ఆంధ్రా, తెలంగాణలో 'బంగార్రాజు' మూవీకి 9వ రోజూ కలెక్షన్లు పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 11 లక్షలు, సీడెడ్‌లో రూ. 13 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 12 లక్షలు, ఈస్ట్‌లో రూ. 9 లక్షలు, వెస్ట్‌లో రూ. 5 లక్షలు, గుంటూరులో రూ. 6 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో కలిపి రెండు రాష్ట్రాల్లో 9వ రోజు రూ. 64 లక్షలు షేర్, రూ. 1 కోటి గ్రాస్ వచ్చింది.

    హరితేజకు చేదు అనుభవం: ఎదవ ఓవర్ యాక్షన్.. నీకు కరోనా రావాలి అంటూ దారుణంగా!హరితేజకు చేదు అనుభవం: ఎదవ ఓవర్ యాక్షన్.. నీకు కరోనా రావాలి అంటూ దారుణంగా!

     9 రోజులకూ కలిపి వచ్చింది ఎంత

    9 రోజులకూ కలిపి వచ్చింది ఎంత

    'బంగార్రాజు'కు 9 రోజులకు కలిపి ఏపీ తెలంగాణలో మంచి కలెక్షన్లు వచ్చాయి. దీంతో నైజాంలో రూ. 7.78 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.14 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.59 కోట్లు, ఈస్ట్‌లో రూ. 3.70 కోట్లు, వెస్ట్‌లో రూ. 2.63 కోట్లు, గుంటూరులో రూ. 3.13 కోట్లు, కృష్ణాలో రూ. 2.02 కోట్లు, నెల్లూరులో రూ. 1.59 కోట్లతో.. 9 రోజుల్లో రూ. 31.58 కోట్లు షేర్, రూ. 51.02 కోట్లు గ్రాస్ వచ్చింది.

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

    తెలుగు రాష్ట్రాల్లో 9 రోజులకు రూ. 31.58 కోట్లు వసూలు చేసిన బంగార్రాజు మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ రాణించింది. ఫలితంగా రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.65 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.40 కోట్లను రాబట్టింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమా తొమ్మిది రోజుల్లోనే రూ. 34.63 కోట్లు షేర్‌తో పాటు రూ. 58 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుని సత్తా చాటింది.

    హాట్ షోలో బౌండరీ దాటిన సరయు: లోపలి అందాలన్నీ కనిపించేలా బిగ్ బాస్ బ్యూటీ రచ్చ
    https://telugu.filmibeat.com/television/bigg-boss-telugu-5-7-arts-sarayu-roy-bold-photos-gone-viral-106530.html

    టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?

    టార్గెట్ ఎంత? ఇంకెంత రావాలి?

    ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'బంగార్రాజు' అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.15 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 39 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 9 రోజుల్లోనే రూ. 34.63 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 4.37 కోట్లు వసూలు చేస్తేనే ఇది హిట్‌ స్టేటస్‌‌ను అందుకుంటుంది.

    శనివారం మూవీకి తప్పని నిరాశ

    శనివారం మూవీకి తప్పని నిరాశ

    'బంగార్రాజు' మూవీకి మొదటి వీకెండ్‌లో భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. కానీ, వీక్ డేస్‌లో మాత్రం ఇది క్రమంగా డౌన్ అవుతూ వచ్చింది. అయితే, 9వ రోజైన శనివారం ఇది పుంజుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ, కేవలం ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 18 లక్షలే పెరిగాయి. ఇది ఆశించిన దాని కంటే తక్కువే అని సినీ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.

    English summary
    Akkineni Nagarjuna and Naga Chaitanya Did Bangarraju Movie Under Kalyan Krishna Direction. This Movie Collects Rs 34.63 Crores in 9 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X