For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రాజ రాజ చోర, బెల్ బాటమ్ మూవీలకు షాక్: షోలు రద్దు చేస్తూ నిర్ణయం.. ఎందుకంటే..

  |

  సినిమా ఇండస్ట్రీలో మరోసారి బాక్సాఫీస్ మార్కెట్ పై అనుమానం మొదలైంది. హిట్ టాక్ అందుకున్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత రేంజ్ లో అయితే కలెక్షన్స్ ను అందుకోవడం లేదని అర్థమవుతుంది. కరోనా వైరస్ భయం జనాల్లో ఏ మాత్రం తగ్గలేదని కూడా తెలుస్తోంది. ఇక థియేటర్ బిజినెస్ పై ముందు నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ కొందరు ధైర్యంగా విడుదల చేశారు. అయితే ఆ మార్గంలో అందరూ అనుకున్నంత స్థాయిలో అయితే లాభాలు అందుకోవడం లేదు. ఊహించని విధంగా నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది.

  ఇటీవల విడుదలైన సినిమాల పరిస్థితి కూడా మరీ దారుణంగా తయారయింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సినిమా బిజినెస్ పై తీవ్ర స్థాయిలో ప్రభావం పడింది అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోల సినిమాలకు మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ అందరినీ షాక్ కు గురి చేశాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల విడుదలైన రాజ రాజ చోర సినిమా పలు చోట్ల టికెట్స్ అమ్ముడు పోకపోవడంతో షోలను క్యాన్సిల్ చేసే పరిస్థితి ఏర్పడింది.

  ఆ సినిమాలు బాగానే కనెక్ట్ అయ్యాయి

  ఆ సినిమాలు బాగానే కనెక్ట్ అయ్యాయి

  ఈ ఏడాది మొదట్లో విడుదలైన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్లను భారీగానే అందుకున్నాయి 50% అకూపెన్సితో విడుదలైన సినిమాలు సైతం మంచి ప్రాఫిట్స్ లోకి వచ్చాయి. క్రాక్ మాస్టర్ రెడ్ వంటి సినిమాలు ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకున్నయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమాలు నష్టాల బారిన పడకుండా ఉంటే చాలు అనుకుంటున్న తరుణంలో జనాలకు సినిమాలు కనెక్ట్ అవ్వడంతో మంచి లాభాలను అందించాయి. ఇక విజయ్ కూడా డబ్బింగ్ సినిమాతో తెలుగులో తన మార్కెట్ స్థాయిని పెంచుకోవడం విశేషం.

  ఆ ఆనందం ఎక్కువ రోజులు ఉండలేదు

  ఆ ఆనందం ఎక్కువ రోజులు ఉండలేదు

  ఉప్పెన, జాతి రత్నాలు వంటి సినిమాలు కూడా నిర్మాతల్లో అయితే ఒక మంచి సంతోషాన్ని నింపాయి. బాక్సాఫీస్ రికార్డు కూడా ఎప్పటికప్పుడు తారుమారు అవుతూ ఉండడంతో మళ్లీ థియేట్రికల్ బిజినెస్ ట్రాక్ లోకి వచ్చినని ఎంతగానో సంబరాలు చేసుకున్నారు. కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు దక్కలేదు. కరోనా సెకండ్ వేవ్ అనంతరం మళ్లీ ఎప్పటిలానే పరిస్థితులు భయంకరంగా మారుతున్నాయి. ఒక వైపు కరోనా వైరస్ తన బలాన్ని మెల్లగా పెంచుకుంటూ ఉండగా ఆ ప్రభావం కూడా సినిమా బిజినెస్ లపై పడుతోంది.

  రాజ రాజ చోర.. ఇలా అయ్యిందేంటి?

  రాజ రాజ చోర.. ఇలా అయ్యిందేంటి?

  అయితే సినిమాల రిజల్ట్ విషయంలో కొంత కన్ఫ్యూజన్ అయితే నెలకొంటోంది. ఎందుకంటే పాజిటివ్ టాక్ అందుకున్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత రేంజ్ లో వసూళ్లను అనుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజ రాజ చోర మంచి పాజిటివ్ టాక్ ను అందుకున్న విషయం తెలిసిందే. శ్రీ విష్ణు హీరోగా నటించిన ఆ సినిమా ట్రైలర్ తోనే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమాకు ప్రమోషన్ కూడా గట్టిగానే చేశారుమ్ గాని అనుకున్నంత రేంజ్ లో జనాల్లోకి వెళ్లలేకపోయింది.

   సినిమా షోలు క్యాన్సిల్

  సినిమా షోలు క్యాన్సిల్

  పాజిటివ్ రివ్యూలు రావడంతో పాటు చూసిన మొదటి ప్రేక్షకులు కూడా సినిమా బావుందని కామెంట్స్ చేశారు. దీంతో సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద ఎంతో కొంత లాభాలను అందిస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ ప్రస్తుతం జనాలు థియేటర్స్ వైపు అసలు తిరిగి చూడడం లేదు. రాజ రాజ చొర టికెట్స్ కూడా అమ్ముడు పోకపోవడంతో చిత్ర నిర్మాతలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. సినిమా షోలను క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ పెరగకపోవడం ఇండస్ట్రీలో మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

  అక్షయ్ కుమార్ సినిమాకు 13 టిక్కెట్లు

  అక్షయ్ కుమార్ సినిమాకు 13 టిక్కెట్లు

  మరోవైపు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం నార్త్ లో అయితే ఇంకా పూర్తిస్థాయిలో థియేటర్లో తెరచుకోలేదు. సినిమా బిజినెస్ అయితే అక్కడ భారీగా తగ్గిపోయింది. థియేటర్స్ లో విడుదల కావాల్సిన ఎన్నో సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీ ల్లో విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఇక అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరో సినిమా కూడా హైదరాబాద్‌లోని ప్రముఖ మల్టీప్లెక్స్‌లో మొత్తంగా 13 టికెట్లు అమ్ముడవ్వడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

  మిగతా వాళ్ళు వస్తారా లేదా?

  మిగతా వాళ్ళు వస్తారా లేదా?

  అక్షయ్ కుమార్ నటించిన బెల్ బాటమ్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సినిమాకు భారీగా రిలీజ్ చేశారు. అయితే మొదటి రోజు సినిమాకు కేవలం రెండు కోట్ల నెట్ వసూళ్లు రావడం షాక్ ఇచ్చింది. అక్షయ్ కుమార్ సినిమాలు చాలా వరకు మొదటి రోజే 20 కోట్లకు పైగా వసూళ్లను అందుకునేవి. కానీ బెల్-బాటం విషయంలో మాత్రం రివర్స్ అయ్యింది. కేవలం పదుల సంఖ్యలో టికెట్లు అమ్ముడుపోవడం అంటే అది అంత సాధారణమైన విషయం కాదు. ఇక ఈ సినిమా షోలు కూడా క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇక మళ్లీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది ఎవరికీ తెలియదు.

  ఇక ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న మరికొన్ని సినిమాలు ప్రస్తుత వాతావరణం అర్థం చేసుకొని సినిమాలను విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇక ఏ మాత్రం అనుమానం వచ్చినా కూడా రిలీజ్ విషయంలో మళ్ళీ వెనక్కి తగ్గుతాయని చెప్పవచ్చు. ఈ విషయంలో ఒక క్లారిటీ రావాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

  English summary
  Bell bottom, Raja Raja chora shows cancelled due to no audience
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X