»   » బెల్లంకొండ నాని ‘పైసా’కు బంగారు కొండ

బెల్లంకొండ నాని ‘పైసా’కు బంగారు కొండ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆర్ధిక ఇబ్బందులతో విడుదల ఆగిపోయిన 'పైసా' చిత్రానికి ఎట్టకేలకు విడుదల అవటానికి మార్గం సుగమం అయ్యింది. బెల్లంకొండ సురేష్ పూనుకుని ఈ చిత్రం విడుదలకు ప్రయత్నస్తున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. నిర్మాత పుప్పాల రమేష్ ..పైనాన్షియల్ క్రైసిస్ తో చేతులు ఎత్తేయటంతో...బెల్లంకొండ చిత్రంపై నమ్మకంతో ముందుకు వచ్చాడని చెప్తున్నారు. త్వరలోనే ఈ మేరకు విడుదల తేదీతో ప్రకటన వస్తుందని సమాచారం.


నాని హీరోగా, కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'పైసా' . ఈ చిత్రాన్ని పుప్పాల రమేష్ ఎల్లోఫ్లవర్స్ బేనర్‌పై నిర్మిస్తున్నారు. నాని సరసన కేథరీన్ నటిస్తోంది. హవాలా మనీ చుట్టూ కథ తిరుగుతుంది. ఓల్డ్ సిటికి చెందిన కుర్రాడు డబ్బు మీద మోజుతో హవాలా ట్రాన్సిక్షన్ లోకి లాగబడతాడు. అక్కడ నుంచి వచ్చే సమస్యలతో కథ,కథనం నడుస్తుంది. ఈ చిత్రంలో నాని పేరు... ప్ర'క్యాష్'(Pra'cash'). డబ్బు కంటే అతనికి ఏదీ ఎక్కువ కాదు. దర్శకుడు కృష్ణ వంశీ మార్కుకు ఏమాత్రం తగ్గకుండా ఈచిత్రం ఉండబోతోంది. అన్ని కోణాల్లో తనదైన ముద్రవేస్తూ ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.


కృష్ణ వంశీ మాట్లాడుతూ.... ''డబ్బు డబ్బు డబ్బు. లేచింది మొదలు ప్రతి ఒక్కరూ పఠించేది మనీ మంత్రమే. పచ్చ నోటు చుట్టూ ప్రదక్షిణలే. వేలు, లక్షలు అనే మాటకి ఇప్పుడు విలువే లేదు. వందల కోట్లు, వేల కోట్లు అంటూ అందరూ సరదాగా మాట్లాడేస్తున్నారు. సంపాదన మోజులో మనుషులమన్న విషయాన్నే మరిచిపోతున్నారు. పచ్చ నోట్ల నీడలో అనుబంధాలు, ఆత్మీయతలు కనుమరుగైపోతున్నాయి. మన జీవనాన్ని, సామాజిక పరిస్థితుల్నీ డబ్బే శాసిస్తోంది. ఈ విషయాన్ని మా చిత్రంలో చూపించాము'' అన్నారు కృష్ణవంశీ.

కృష్ణ వంశీ కంటిన్యూ చేస్తూ.......'పైసా' సినిమాను కసితో, ఎనర్జీతో, పాషన్‌తో తీసాను. నాని కూడా పాషన్‌తో, ఒక మంచి సినిమాలో భాగం కావాలని నటించాడు. సినిమా మొదటి నుంచి ఎన్నో సమస్యలు వచ్చాయి. సినిమా విడుదలైన తర్వాత నిర్మాత రమేష్ పుప్పాలకు ఏమీ మిగలదు. ఆ విషయం తెలిసి కూడా ఆయన ధైర్యంగా తీసారు' అని చెప్పుకొచ్చారు. నిర్మాత మాట్లాడుతూ ''వర్తమాన సమాజాన్ని ప్రతిబింబించే కథ ఇది. డబ్బు చుట్టూ సాగుతుంది. వినోదానికి ప్రాధాన్యమిస్తూనే ఆలోచన రేకెత్తించేలా చిత్రాన్ని తీర్చిదిద్దారు దర్శకుడు. ఇందులో నాని నటన అందరికీ నచ్చుతుంది''అన్నారు.

English summary
Nani,Catherine Tresa starrer ‘Paisa’ directed by Krishna Vamsi should have been released by this time. However the film plunged into financial crisis with producer Ramesh Puppala becoming bankrupt. According to the latest Bellamkonda Suresh is getting ready to release the film. However he will not get any credit as the film is already cleared by censor. ‘Paisa’ is about a youngster trapped in the business of Hawala transactions in old city of Hyderabad. Film's release date will be out soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu