twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘భరత్ అనే నేను’... 25 రోజులు పూర్తి, ఇంతకీ లాభాలు వచ్చాయా?

    By Bojja Kumar
    |

    Recommended Video

    Bharath Ane Nenu Celebrates 25 Days Of Its Release

    మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'భరత్ అనేను' చిత్రం ఏప్రిల్ 20న విడుదలై బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ రూ. 205 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేయడం ద్వారా మహేష్ బాబు కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. తాజాగా బాక్సాఫీసు వద్ద 25 రోజులు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఇప్పటి వరకు రూ. 95 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసింది. విడుదలైన చాలా ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లు పెట్టుబడి రికవరీ అయి లాభాల బాట పట్టగా, కొన్ని చోట్ల మాత్రం ఇంకా పూర్తిగా రికవరీ కాలేదని తెలుస్తోంది. ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం.

    నైజాం ఏరియాలో ఎంత?

    నైజాం ఏరియాలో ఎంత?

    నైజాం డిస్ట్రిబ్యూటర్ ‘భరత్ అనే నేను' చిత్రాన్ని రూ. 22 కోట్లకు కొన్ననట్లు సమాచారం. 25 రోజుల్లో రోజుల్లో రూ. 19.1 కోట్లు వసూలైంది. ఇక్కడ ఇంకా రూ. 3 కోట్లు వసూలు కావాల్సి ఉందని, అప్పుడే డిస్ట్రిబ్యూటర్ లాభాలు చూస్తాడని ట్రేడ్ వర్గాల టాక్.

    సీడెడ్ ఏరియాలో...

    సీడెడ్ ఏరియాలో...

    సీడెడ్ ఏరియాలో రూ. 12 కోట్లకు రైట్స్ అమ్మారు. ఇక్కడ 25 రోజుల్లో రూ. 9.87 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

    ఉత్తరాంధ్రలో

    ఉత్తరాంధ్రలో

    ఉత్తరాంధ్రలో ‘భరత్ అనే నేను' రైట్స్ రూ. 8.2 కోట్లకు అమ్మగా ఇప్పటి వరకు రూ. 8.75 కోట్లు కోట్లు వసూలు చేయడం ద్వారా మంచి లాభాలే వచ్చాయని చెప్పుకుంటున్నారు.

    నెల్లూరు ఏరియాలో

    నెల్లూరు ఏరియాలో

    నెల్లూరు ఏరియాలో భరత్ రైట్స్ రూ. 3 కోట్లకు అమ్మారు. 25 రోజుల్లో రూ. 2.6 కోట్ల వసూలైనట్లు తెలుస్తోంది. సినిమా లాభాల బాట పట్టాలంటే ఇంకా రూ. 40 లక్షల వరకు షేర్ వసూలు కావాల్సి ఉంది. ప్రస్తుతం పరిస్థితుల్లో ఇది కష్టమే అని అంటున్నారు.

    ఈస్ట్ గోదావరి ఏరియాలో

    ఈస్ట్ గోదావరి ఏరియాలో

    ఈస్ట్ గోదావరి ఏరియాలో ఈ చిత్రం రైట్స్ రూ. 6.7 కోట్లకు అమ్మారు. 25 రోజుల్లో రూ. 6.8 కోట్లు రాబట్టింది. దీంతో ఇక్కడి డిస్ట్రిబ్యూటర్ సేఫ్ గా బయట పడ్డట్లు చర్చించుకుంటున్నారు.

    వెస్ట్ గోదావరి

    వెస్ట్ గోదావరి

    వెస్ట్ గోదావరి ఏరియాలో ఈ చిత్రాన్ని రూ. 3.9 కోట్లకు అమ్మగా.... 25 రోజుల్లో రూ. 4.22 కోట్ల షేర్ వసూలైంది.

    లాభాలు బాటలో కృష్ణ, గుంటూరు

    లాభాలు బాటలో కృష్ణ, గుంటూరు

    కృష్ణ ఏరియాలో రూ. 5.75 కోట్ల షేర్, గుంటూరు ఏరియాలో రూ. 8.25 కోట్ల షేర్ వసూలు కావడంతో మంచి లాభాలు వచ్చాయి. ఓవరాల్‌గా ఏపీ, నైజాంలో కలిపి రూ. 65.32 కోట్ల షేర్ వసూలైంది.

    చెన్నైలో సంచలనం

    చెన్నైలో సంచలనం

    చెన్నై సిటీలో భరత్ అనే నేను సంచలన విజయం సాధించింది. బాహుబలి-2(తెలుగు)ను మించిన వసూళ్లు రాబట్టింది. ఇక్కడ బాహుబలి-2 ఫుల్ రన్‌లో రూ. 1.65 కోట్ల షేర్ వసూలు చేయగా, భరత్ అనే నేను రూ. 1.66 కోట్లు కలెక్ట్ చేసింది.

    ఇతర రాష్ట్రాల్లో ఎంత?

    ఇతర రాష్ట్రాల్లో ఎంత?

    కర్నాటకలో భరత్ అనే నేను రూ. 7.8 కోట్లు వసూలు చేసి మంచి లాభాలు తెచ్చింది. చెన్నైలో రూ. 1.65 కోట్లు, రెస్టాఫ్ తమిళనాడు రూ. 1.5 కోట్లు, రెస్టాఫ్ ఇండియా రూ. 1.2 కోట్లు వసూలు చేసింది.

    ఓవర్సీస్ మార్కెట్లో

    ఓవర్సీస్ మార్కెట్లో

    ఓవర్సీస్ మార్కెట్ వసూళ్ల వివరాల్లోకి వెళితే యూఎస్ఏలో రూ. 13.9 కోట్లు, గల్ఫ్ లో రూ. 2 కోట్లు, యూకె-యూరఫ్ లో రూ. 1.13 కోట్లు, ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌లో రూ. 1.76 కోట్లు. రెస్టాఫ్ వరల్డ్ రూ. 65 లక్షలు రాబట్టింది. ఓవరాల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ రూ. 95.26 కోట్లు రాబట్టింది.

    English summary
    Bharat Ane Nenu is running successfully at the box office. Bharat Ane Nenu, which was released on 20th April, has received positive responses from everywhere and also went on to become a blockbuster. The movie has collected Rs 95.26 Cr shares at Worldwide box office after the successful run of 25 days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X