»   » అక్కడ.... ‘భరత్ అనే నేను’ సంచలన విజయం, ఇదే ఇప్పటి వరకు టాప్!

అక్కడ.... ‘భరత్ అనే నేను’ సంచలన విజయం, ఇదే ఇప్పటి వరకు టాప్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్ బాబు 'భరత్ అనే నేను' చిత్రం తమిళనాడులో సంచలన విజయం అందుకుంది. మహేష్ బాబు గత చిత్రం 'స్పైడర్' తమిళనాడులో కూడా పెద్ద ప్లాప్ అయినప్పటికీ ఆ ప్రభావం ఈ మూవీపై ఏమాత్రం పడలేదు. ఊహకు అందని కలెక్షన్లతో సూపర్ స్టార్ చిత్రం అక్కడ దూసుకెళుతోంది.

'Bharath Ane Nenu' Movie Collections

తమిళనాడులో 'భరత్ అనే నేను' 17 రోజుల్లో రూ. 4.2 కోట్లు వసూలు చేసింది. కేవలం చెన్నై సిటీలోనే రూ. 1.59 కోట్ల గ్రాస్ రాబట్టింది. తెలుగు వెర్షన్ మాత్రమే విడుదలై ఇంత భారీ మొత్తంలో వసూళ్లు రాబట్టడం విశేషం.

ఓన్లీ తెలుగు వెర్షన్లో ఇదే టాప్

ఓన్లీ తెలుగు వెర్షన్లో ఇదే టాప్

ఈ మూవీ కలెక్షన్ల గురించి ట్రేడ్ అనలిస్ట్ సురేందర్ వెల్లడిస్తూ... ‘తమిళనాడు వ్యాప్తంగా ‘భరత్ అనే నేను' మూవీ 17 రోజుల్లో రూ. 4.2 కోట్లు వసూలు చేసింది. కేవలం తెలుగు భాషలో విడుదలైన చిత్రాల్లో హయ్యెస్ట్ గ్రాస్ ఇది. ఒక చెన్నై సిటీలోనే రూ. 1.59 కోట్లు రాబట్టింది, ఓవరాల్ టిఎన్ కలెక్షన్లలో 38% ఇది' అంటూ ట్వీట్ చేశారు.
తమిళనాడులో భాగా ఆడిన మూవీస్

తమిళనాడులో భాగా ఆడిన మూవీస్

గతంలో బాహుబలి సిరీస్ సినిమాలు, ఈగ చిత్రాలు తమిళనాట బాగా ఆడాయి. అవి తెలుగుతో పాటు తమిళ డబ్బింగ్ వెర్షన్ కూడా రిలీజై మంచి వసూళ్లు సాధించాయి. అయితే భరత్ అనే నేను చిత్రం కేవలం తెలుగులో మాత్రమే విడుదలై ఇక్కడ సంచలన విజయం అందుకుంది.
స్పైడర్ పెద్ద డిజాస్టర్

స్పైడర్ పెద్ద డిజాస్టర్

మహేష్ గత చిత్రం ‘స్పైడర్' మూవీ తెలుగు, తమిళంలో రూపొందింది. రెండు భాషల్లో తమిళనాట భారీగా విడుదలైన ఈ చిత్రం అంచనాలను అందుకోవడంలో ఫెయిల్ అయింది. ప్లాప్ టాక్ రావడంతో కేవలం రూ. 10 కోట్లు మాత్రమే వసూలు చేసి తీవ్రమైన నష్టాలను మిగిల్చింది.


రూ. 200 కోట్ల దిశగా

రూ. 200 కోట్ల దిశగా

మహేష్ బాబు కెరీర్లోనే ‘భరత్ అనే నేను' చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా నిలిచింది. ఇప్పటి వరకు ఈ మూవీ తొలి రెండు వారాల్లో రూ. 190 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసి రూ. 200 కోట్లను అందుకునే దిశగా పరుగులు పెడుతోంది.
English summary
"After 17 days, #BharatAneNenu's TN gross stands at approximately Rs 4.2 crores. Highest-earning grosser for a Telugu only film in TN. Chennai city's 17-day gross is an impressive Rs 1.59 crores, nearly 38% of the TN total #MaheshBabu #SSMB . [sic]" trade tracker Surendhar tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X