twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bheemla Nayak రికార్డుస్థాయిలో పవన్ కల్యాణ్ మూవీ బిజినెస్.. పవర్ స్టార్ బాక్సాఫీస్‌ స్టామినా అంటే అది లెక్క!

    |

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా రిలీజ్‌కు సర్వం సిద్ధమవుతున్నది. ప్రపంచవ్యాప్తంగా పవర్ స్టార్ అభిమానులు ఈ సినిమాకు ఆసక్తిగా ఎదురు చూస్తుండటంతో భారీ స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు నిర్మాత నాగవంశీ సిద్ధమయ్యారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలతోపాటు ఉత్తరాదిలో ఈ సినిమాను రికార్డు స్థాయి థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో భీమ్లా నాయక్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వ్యవహారం సినీ పరిశ్రమను కుదిపేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

    రికార్డు స్క్రీన్లలో భీమ్లా నాయక్

    రికార్డు స్క్రీన్లలో భీమ్లా నాయక్

    భీమ్లా నాయక్ సినిమాను తెలుగు భాషతోపాటు హిందీ భాషలో కూడా డబ్బింగ్ చేసి ఏక కాలంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 4 వేల స్క్రీన్లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించేందుకు ప్లాన్ చేశారు. పవన్ కల్యాణ్ సినిమా ఈ రేంజ్‌లో విడుదల కావడం ఇదే మొదటిసారి అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

    తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్సీ రేటుకు

    తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్సీ రేటుకు

    ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా నమోదైంది. నైజాం ప్రాంతపు హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేజిక్కించుకొన్న సంగతి తెలిసిందే. సుమారు 40 కోట్ల రూపాయలకు నైజాం హక్కులు అమ్ముడుపోయినట్టు సమాచారం. ఇక ఆంధ్రాలో టికెట్ రేట్ వ్యవహారం ఇంకా తేలనందున.. సుమారు 50 కోట్ల మేర హక్కులు అమ్ముడుపోయినట్టు సమాచారం. దాంతో తెలుగు రాష్ట్రాల హక్కులు 90 కోట్లకు అమ్మారనేది తాజా సమాచారం.

    కుమ్మేసిన హిందీ డబ్బింగ్ రైట్స్

    కుమ్మేసిన హిందీ డబ్బింగ్ రైట్స్


    అలాగే హిందీ డబ్బింగ్ రైట్స్‌కు డిమాండ్ భారీగానే కనిపించింది. తొలిసారి పవన్ కల్యాణ్ నటించిన సినిమా స్ట్రెయిట్ డబ్బింగ్ సినిమాగా రిలీజ్ అవుతుండటంతో ఉత్తరాది ప్రేక్షకులు ఆస్తక్తిని కనబరుస్తున్నారు. దాంతో ఈ సినిమా హిందీ హక్కులను సుమారు 25 కోట్లకు అమ్మినట్టు సమాచారం. ఈ మధ్య కాలంలో ఓ డబ్బింగ్ సినిమా ఈ రేంజ్‌లో అమ్ముడుపోవడం ఇదే మొదటిసారి.

    థియేట్రికల్ లెక్క ఇది..

    థియేట్రికల్ లెక్క ఇది..

    ఇక కన్నడ, ఇతర భాషలతోపాటు ఓవర్సీస్ మార్కెట్‌కు సంబంధించిన హక్కులకు భారీగా డిమాండ్ కనిపించింది. ఈ హక్కులను సుమారుగా 25 కోట్ల మేరకు అమ్ముడుపోయినట్టు సమాచారం. అయితే అధికారికంగా వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. దాంతో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 140 కోట్ల మేర క్లోజ్ అయినట్టు తెలిసింది.

    Recommended Video

    Tollywood కి తెలంగాణాలో లేని సమస్యలు ఏపీ లో ఎందుకంటే - Comedian Ali Presmeet | Filmibeat Telugu
    ఓవరాల్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఇలా..

    ఓవరాల్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఇలా..

    ఇదిలా ఉండగా, ఆడియో, శాటిలైట్ రైట్స్ కూడా భారీ రేటుకు అమ్ముడుపోయాయని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఆడియో రైట్స్ 5 కోట్లకుపైగా, శాటిలైట్ హక్కులు 45 కోట్లకుపైగా అమ్మడం జరిగిందని వెల్లడిస్తున్నారు. దాంతో ఈ సినిమా ఓవరాల్‌గా 190 నుంచి 200 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్టు తెలిసింది. అధికారికంగా వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

    English summary
    Power Star Pawan Kalyan's Bheemla Naayak release date announced. This movie is going to hit Theatres on February 25th. Here is the pre release business details.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X