»   » జై లవకుశ కలెక్షన్లపై బిగ్‌బాస్ దెబ్బ.. అయినా 100 కోట్లకు చేరువలో..

జై లవకుశ కలెక్షన్లపై బిగ్‌బాస్ దెబ్బ.. అయినా 100 కోట్లకు చేరువలో..

Posted By:
Subscribe to Filmibeat Telugu
Jai Lava Kusa collectons dropped because Bigg Boss జై లవకుశ కలెక్షన్లపై బిగ్‌బాస్ దెబ్బ !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నది. విడుదలైన తొలి రోజు నుంచే కలెక్షన్ల దూకుడు ప్రదర్శిస్తున్న ఈ చిత్రం వారాంతానికి ఎన్టీఆర్ కెరీర్లోనే రికార్డు వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ చేసిన మూడు పాత్రలకు బ్రహ్మండమైన రెస్పాన్స్ వస్తున్నది. ప్రధానంగా జై పాత్రకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే బిగ్‌బాస్ ఫైనల్ కారణంగా జై లవకుశ కలెక్షన్లపై దెబ్బ పడినట్టు సమాచారం. తొలివారాంతానికి జై లవకుశ కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

గ్రాస్ 62 కోట్లు..

గ్రాస్ 62 కోట్లు..

జై లవకుశ చిత్రం విడుదలైన నాలుగు రోజుల్లోనే 62 కోట్ల గ్రాస్ రాబట్టినట్టు ట్రేడ్ అనలిస్టులు పేర్కొంటున్నారు. ఇక షేర్ విషయానికి వస్తే సుమారు రూ.40 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రాన్ని పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూటర్లు సంతృప్తిగానే ఉన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.

వీకెండ్ కలెక్షన్లు ప్రాంతాల వారీగా..

వీకెండ్ కలెక్షన్లు ప్రాంతాల వారీగా..

నైజాం 11.60
సీడెడ్ 8.10
గుంటూరు 4.46 కోట్లు
వైజాగ్ 4.19 కోట్లు
ఈస్ట్ గోదావరి 4.14 కోట్లు
కృష్ణా 3.18 కోట్లు
పశ్చిమ గోదావరి 2.50 కోట్లు
నెల్లూరు 1.69 కోట్లు
తెలంగాణ, ఏపీ కలిపి సుమారు 40 కోట్లు..


అమెరికాలో కుమ్మేస్తున్న..

అమెరికాలో కుమ్మేస్తున్న..

ఓవర్సీస్‌లోనూ జై లవకుశ కలెక్షన్లపరంగా దుమ్ము దులుపుతున్నది. బుధ, గురువారాల్లో 12, 82, 691 డాలర్లు (8.31 కోట్లు) వసూలు చేయగా, శుక్ర వారం 2,64,953 డాలర్లు, శనివారం 2,73, 608 డాలర్లు వసూలు చేసింది. అంటే మొత్తం 18, 21, 252 డాలర్లను వసూలు చేసింది. ఇంకా ఆదివారం కలెక్షన్లు అందుబాటులోకి రాలేదు.


2 మిలియన్ క్లబ్‌లో..

2 మిలియన్ క్లబ్‌లో..

అమెరికాలో ఎన్టీఆర్ చిత్రం తొలిసారి 2 మిలియన్ క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. ఆదివారం కలెక్షన్లు యూఎస్‌లో భారీగా ఉన్నట్టు సమాచారం. ఇంకా లండన్, మిగితా ప్రాంతాల్లో కలెక్షన్లు కూడా సంతృప్తికరంగానే ఉన్నట్టు తెలుస్తున్నది.


జనతా గ్యారేజ్ రికార్డులపై గురి

జనతా గ్యారేజ్ రికార్డులపై గురి

గతేడాది సెప్టెంబర్ 1వ తేదీన విడుదలైన జనతా గ్యారేజ్ చిత్ర వసూళ్లను అధిగమించేందుకు జై లవకుశ పరుగులు పెడుతున్నది. జనతా గ్యారేజ్ చిత్రం భారీ వసూళ్లు సాధించి రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే. కలెక్షన్ల పరంగా ఆంధ్ర రాష్ట్రంలో రూ. 134.8 కోట్లు వసూలు చేస్తే... తెలంగాణలో రూ. 93 కోట్లు వసూలు చేసింది. అలాగే కేరళలో రూ. 4.40 కోట్లు వసూల్ చేసింది. 2016 ఏడాదిలో విడుదలై హిట్ చిత్రాల జాబితాలో జనతా గ్యారేజ్ మూడో స్థానంలో నిలిచింది. ఈ రికార్డులను జై లవకుశ అధిగమించే అవకాశం ఉంది.


బిగ్‌బాస్ దెబ్బ..

బిగ్‌బాస్ దెబ్బ..

జై లవకుశకు సంబంధించి ఆదివారం సాయంత్రం ఆటలపై బిగ్‌బాస్ ప్రభావం పడినట్టు తెలుస్తున్నది. బిగ్‌బాస్ ఫైనల్‌ కార్యక్రమం కోసం ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోవడంతో కలెక్షన్లలో తేడా పడినట్టు సమాచారం. సోమవారం కలెక్షన్ల బట్టి జై లవకుశ పరిస్థితి ఏమిటనే విషయం తెలుస్తుంది.English summary
Jai Lava Kusa collections looking good around the globe. This movie is heading towards 100 crores club. This movie doing good in US business too. Reports suggest that Sunday collectons dropped because Bigg Boss final.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu