Just In
- 2 hrs ago
‘ఆచార్య’ టీంకు షాక్.. మొదటి రోజే ఎదురుదెబ్బ.. లీకులపై చిరు ఆగ్రహం
- 3 hrs ago
‘ప్లే బ్యాక్’ నేను తీద్దామని అనుకున్నా కానీ.. సుకుమార్ కామెంట్స్ వైరల్
- 4 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు రొమాన్స్.. భర్తతో లిప్ లాక్‌తో రెచ్చిపోయిన శ్రియ
- 5 hrs ago
మహేశ్ బాబు కొత్త సినిమాలో ప్రియాంక: ప్రకటనకు ముందే మొదలైపోయిన వార్తలు
Don't Miss!
- News
మాజీ రాష్ట్రపతి కలాం సోదరుడు మహమ్మద్ ముత్తుమీర కన్నుమూత
- Finance
IPO: LIC ఆథరైజ్డ్ క్యాపిటల్ భారీ పెంపు, రూ.25,000 కోట్లకు..
- Sports
కిడ్స్ జోన్లో టీమిండియా క్రికెటర్ల ఆట పాట!వీడియో
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Automobiles
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
విజిల్ కలెక్షన్ల సునామీ.. 300 కోట్ల క్లబ్‌లో! విజయ్ సరికొత్త రికార్డ్
తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిన బిగిల్ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తెలుగులో ఈ సినిమాను విజిల్ పేరుతో రిలీజ్ చేశారు. తొలి రోజే సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా విజయవంతంగా 17 రోజుల రన్ పూర్తి చేసుకొని సరికొత్త రికార్డ్ సృష్టించింది. దీంతో విజయ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ 17 రోజుల్లో బిగిల్ (విజిల్) సాధించిన కలెక్షన్స్‌పై ఓ లుక్కేద్దామా..

300 కోట్ల క్లబ్‌లో విజిల్
ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 25వ తేదీన మొదలైన బిగిల్ హంగామా నేటికీ కనిపిస్తుండటం విశేషం. ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేసిన విజయ్ ఆడియన్స్ చేత భేష్ అనిపించుకుంటున్నాడు. విడుదలైన అన్నిసెంటర్లలో జోష్ కొనసాగిస్తూ తాజాగా 300 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది విజిల్.

రాష్ట్రాల వారీగా బిగిల్ వసూళ్లు
దేశవ్యాప్తంగా బిగిల్ వసూళ్లు చూసినట్లయితే.. మొత్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి 188 కోట్ల మేర గ్రాస్ వసూలు చేసింది. కర్ణాటకలో 19 కోట్లు, రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 19.38 కోట్లు, తమిళనాడులో 130 కోట్లు, కేరళలో 15.76 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.72 కోట్లు రాబట్టింది బిగిల్ (విజిల్) మూవీ.

తమిళ్ వర్షన్.. తెలుగు వర్షన్ చూస్తే
తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో విడుదలైన బిగిల్ మూవీ రెండు భాషల్లోనూ అంచనాలను అందుకొని దూసుకుపోతోంది. తమిళ వర్షన్‌లో ఇప్పటిదాకా 144.06 కోట్ల నెట్ వసూళ్లు నమోదు చేసిన ఈ సినిమా తెలుగు వర్షన్‌లో 15.94 కోట్లు రాబట్టింది. మొత్తంగా 160 కోట్ల నెట్ వసూళ్లు నమోదయ్యాయి.

సౌత్ రాష్ట్రాల్లో బిగిల్ బిజినెస్
సౌత్ ఇండియన్ రాష్ట్రాల్లో బిగిల్ బిజినెస్ చెప్పుకోదగినదిగా ఉంది. తమిళనాడులో 85 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ఇప్పటికి 77 కోట్లు వచ్చేశాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్లకు గాను 11.20 కోట్లు, కర్ణాటకలో 12 కోట్లకు గాను 11.20 కోట్లు, కేరళలో 3 కోట్లకు గాను 8.10 కోట్లు, అలాగే ఓవర్సీస్‌లో 30 కోట్లకు గాను 37 కోట్లు రాబట్టింది బిగిల్.

విజిల్ మూవీ.. విజయ్ క్యారెక్టర్
అట్లీ డైరెక్షన్‌లో తెరకెక్కిన విజిల్ సినిమాలో విజయ్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించాడు. ఫుట్‌బాల్ కోచ్‌గా కాస్త క్లాస్ లుక్‌లో కనిపించే ఓ పాత్ర, మాంసం వ్యాపారిగానూ ఫుల్ మాస్ యాంగిల్‌లో మరో పాత్రలో కనిపించి ఫ్యాన్స్‌ను అలరించాడు విజయ్. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్‌పై నిర్మించిన ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించాడు. చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించింది.