twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    1000 కోట్ల దంగల్.. చైనాలో ప్రభంజనం.. త్వరలో 2 వేల క్లబ్‌లోకి

    బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ హవాకు చైనాలో ఎదురే లేకుండా పోతున్నది. మే 5వ తేదీన రిలీజైన దంగల్ కలెక్షన్ల సునామీ ఇంకా కొనసాగుతూనే ఉంది.

    By Rajababu
    |

    బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ హవాకు చైనాలో ఎదురే లేకుండా పోతున్నది. మే 5వ తేదీన రిలీజైన దంగల్ కలెక్షన్ల సునామీ ఇంకా కొనసాగుతూనే ఉంది. చైనాలో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా దంగల్ ఓ రికార్డును సొంతం చేసుకొన్నది. తాజాగా చైనా దేశంలో రూ.1000 కోట్లు వసూలు చేసిన చిత్రంగా చరిత్ర సృష్టించింది. అయితే కలెక్షన్ల పరంగా బాహుబలి2, దంగల్ మధ్య విదేశీ గడ్డపై భారీ పోటీ జరుగుతున్నది.

    1000 కోట్ల మైలురాయిని

    1000 కోట్ల మైలురాయిని

    చైనా బాక్సాఫీస్ వద్ద దంగల్ చిత్రం రూ.1000 కోట్ల మైలురాయిని దాటింది. చైనా సినీ చరిత్రలో అరుదైన 32 చిత్రాల్లో దంగల్ చోటు దక్కింది అని ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ వెబ్‌సైట్ మావోయాన్ వెల్లడించింది. చైనాలో దంగల్ ఊహించిన విజయం సాధించింది. విదేశీ గడ్డపై సూపర్ హిట్ అయిన భారతీయ చిత్రంగా దంగల్ రికార్డు క్రియేట్ చేసింది అని చైనాలో భారతీయ పంపిణీదారుడు ప్రసాద్ శెట్టి తెలిపారు.

    9000 థియేటర్లలో

    9000 థియేటర్లలో

    మే 5న రిలీజ్ అయిన దంగల్ చిత్రం హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దాదాపు 9000 థియేటర్లలో ఇంకా నడుస్తున్నది. ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లను సాధించే చైనా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం కలెక్షన్ల వరద పారిస్తున్నది అని ప్రసాద్ పేర్కొన్నారు. గత నెల రోజులుగా ఈ చిత్రానికి చైనా ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు అని ఆయన వెల్లడించారు.

    దంగల్ వర్సెస్ బాహుబలి2

    దంగల్ వర్సెస్ బాహుబలి2

    కలెక్షన్ల పరంగా బాహుబలి2, దంగల్ మధ్య రసవత్తర పోటీ జరుగుతున్నది. అమెరికాతోపాటు ఇతర దేశాల్లో బాహుబలి కలెక్షన్లను కొల్లగొడుతుంటే.. చైనాలో దంగల్ దూసుకెళ్తున్నది. ప్రపంచవ్యాప్తంగా దంగల్ రూ.1800 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. దాని వెనుకనే కొద్ది తేడాతో బాహుబలి2 వసూళ్లను సాధిస్తున్నది.

    2 వేల కోట్ల క్లబ్‌పై దృష్టి

    2 వేల కోట్ల క్లబ్‌పై దృష్టి

    ఇదిలా ఉంటే, దంగల్ జోరు చూస్తుంటే.. చైనా బాక్సాఫీస్ వద్ద అమీర్ సినిమా మరింత సంచలనాన్ని క్రియేట్ చేసే అవకాశం కనిపిస్తున్నది. త్వరలోనే దంగల్ చిత్రం రూ.2000 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశాలు మెరుగుపడ్డాయి. ఒకప్పుడు రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరడమే కష్టంగా మారిన భారతీయ సినిమాలకు ప్రస్తుతం రూ.2 వేల కోట్ల క్లబ్ చాలా సులభంగా కనిపిస్తున్నది.

    English summary
    Superstar Aamir Khan is on cloud nine as his wrestling drama has entered the 1,000 crore-mark at the Chinese box office. ''According to Maoyan, a popular ticketing website in China which is connected to most of the theatres in the country, Dangal's gross earnings has crossed one billion RMB, joining the exclusive club of just 32 films in China's cinema history,'' reported PTI.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X