twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చలో, టచ్ చేసి చూడు బాక్సాఫీస్ రిపోర్ట్.. రవితేజకు షాకిచ్చిన నాగశౌర్య

    By Rajababu
    |

    మాస్ మహారాజా రవితేజ నటించిన టచ్ చేసి చూడు, యువ హీరో నాగశౌర్య ఛలో సినిమాలు పోటాపోటీగా రిలీజయ్యాయి. ఈ రెండు చిత్రాలపై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనే వ్యక్తమైంది. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాల రిపోర్ట్ పరిశీలించగా ఛల్ సినిమా పైచేయి సాధించినట్టు కనిపిస్తున్నది. ఈ రెండు చిత్రాల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

    ఛలోకు పాజిటివ్ టాక్

    ఛలోకు పాజిటివ్ టాక్

    చిన్న చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగశౌర్య ఛలో చిత్రం తొలి రోజున మంచి టాక్‌ను సొంతం చేసుకొన్నది. కామెడీ, నాగశౌర్య, రష్మిక గ్లామర్ ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి. దాంతో తొలి రోజు కలెక్షన్లు పాజిటివ్‌గా వచ్చాయి.

     నాగశౌర్యకు బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

    నాగశౌర్యకు బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

    తెలుగు రాష్ట్రాల్లో ఛల్ సినిమా తొలి రోజు రూ.1.10 కోట్ల షేర్ కొల్లగొట్టిందట. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం మొదటిరోజున రూ.1.85 కోట్లు సాధించినట్టు తెలిసింది. నాగశౌర్య కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని చెప్పుకొంటున్నారు.

     ఓవర్సీస్‌లో ఛలో చిత్ర వసూళ్లు

    ఓవర్సీస్‌లో ఛలో చిత్ర వసూళ్లు

    ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా నాగశౌర్య రికార్డు కలెక్షన్లను సాధించాడు. తన కెరీర్‌లో గతంలో మునుపెన్నడూ లేని విధంగా వసూళ్లు రాబట్టడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేశాయి. అమెరికాలో ప్రీమియర్స్‌తో కలిపి తొలి రోజున 60 లక్షలు డాలర్లను సొంతం చేసుకోవడం విశేషం.

     టచ్ చేసి చూడు రిపోర్ట్

    టచ్ చేసి చూడు రిపోర్ట్

    ఇక టచ్ చేసి చూడు సినిమా విషయానికి వస్తే .. రవితేజ మరోసారి మాస్ మహారాజా అవతారంతో తెర మీద రఫ్ ఆడించాడు. కానీ రొటీన్ కథ కావడం, కామెడీ వర్కవుట్ కాకపోవడం సినిమా కలెక్షన్లకు అవరోధంగా మారినట్టు టాక్.

     తొలిరోజు కలెక్షన్లు

    తొలిరోజు కలెక్షన్లు

    తెలుగు రాష్ట్రాల్లో టచ్ చేసి చూడు సినిమా రూ.4.94 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అయితే రాజా ది గ్రేట్ సినిమా తొలిరోజు సాధించిన రూ.5 కోట్ల కలెక్షన్ల మార్క్‌ను రవితేజ టచ్ చేయలేకపోయాడనేది ట్రేడ్ వర్గాల విశ్లేషణ.

     తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు

    తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు

    టచ్ చేసి చూడు చిత్రం నైజాంలో రూ.1.59 కోట్లు, సీడెడ్‌లో సుమారుగా 50 లక్షలు, ఉత్తరాంధ్రలో 40 లక్షలు, గుంటూరులో 47 లక్షలు, తూర్పు గోదావరిలో 38 లక్షలు, పశ్చిమ గోదావరిలో 30 లక్షలు, కృష్ణాలో 23 లక్షలు, నెల్లూరులో 20 లక్షలు వసూలు చేసినట్టు సమాచారం.

     ఓవర్సీస్‌లో టచ్ చేసి చూడు

    ఓవర్సీస్‌లో టచ్ చేసి చూడు

    అమెరికాలో ఈ చిత్రం ప్రీమియర్లతో కలుపుకొని టచ్ చేసి చూడు సుమారు రూ.24 లక్షలు వసూలు చేసింది. అలాగే కర్ణాటకలో 40 లక్షల కలెక్షన్ల రాబట్టినట్టు సమాచారం.

    English summary
    Mass Maharaja Ravi Teja's Touch Chesi Choodu released wide across the two Telugu states and Overseas. The movie took a decent opening owing to the popularity of the actor. Total Day1 AP & TS Share was 4.16 Crores. The film took a disastrous opening in Overseas markets.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X