»   » ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్స్: ఇండియాలో టాప్ 10 మూవీస్ లిస్ట్

ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్స్: ఇండియాలో టాప్ 10 మూవీస్ లిస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి-2' బాక్సాఫీసు వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఫస్ట్ డే కలెక్షన్ విషయంలో ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటికీ పడగొట్టి సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది.

ఇండియాలో టాప్ 10 ఫస్ట్ డే కలెక్షన్ రికార్డులను పరిశీలిస్తే.... అందులో మూడు స్థానాలు బాహుబలికి సంబంధించినవి కావడం విశేషం. బాహుబలి-2 రిలీజ్ ముందు వరకు సల్మాన్ ఖాన్ 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' రూ. 39.5 కోట్లతో మొదటి స్థానంలో, రెండో స్థానంలో కూడా ఉండేది.

అయితే ఇపుడు తొలి రెండు స్థానాలను బాహుబలి-2 మూవీ దక్కించుకుంది.

బాహుబలి-ది కంక్లూజన్ (తెలుగు)

బాహుబలి-ది కంక్లూజన్ (తెలుగు)

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి-2 తెలుగు వెర్షన్ ఓపెనింగ్ డే వరల్డ్ వైడ్ రూ. 67 కోట్లు వసూలు చేసి నెంబర్. 1 స్థానం దక్కించుకుంది.

బాహుబలి-ది కంక్లూజన్ (హిందీ

బాహుబలి-ది కంక్లూజన్ (హిందీ

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి-ది కంక్లూజన్ హిందీ వెర్షన్ వరల్డ్ వైడ్ ఓపెనింగ్ డే రూ. 41.5 కోట్లు వసూలు చేసి రెండో స్థానంలో ఉంది.

ప్రేమ్ రతన్ ధన్ పాయో (హిందీ)

ప్రేమ్ రతన్ ధన్ పాయో (హిందీ)

సల్మాన్ ఖాన్ బాలీవుడ్ మూవీ ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో' ఓపెనింగ్ డే రూ. 39.5 కోట్లు వసూలు చేసి మూడో స్థానంలో ఉంది.

సుల్తాన్ (హిందీ):

సుల్తాన్ (హిందీ):

సల్మాన్ ఖాన్ నటించిన బాలీవుడ్ మూవీ సుల్తాన్ రూ. 36.5 కోట్లు మొదటి రోజు వసూలు చేసి నాలుగో స్థానంలో ఉంది.

హ్యాపీ న్యూ ఇయర్ (హిందీ)

హ్యాపీ న్యూ ఇయర్ (హిందీ)

షారుక్ ఖాన్ బాలీవుడ్ మూవీ హ్యాపీ న్యూ ఇయర్ తొలి రోజు రూ. 35.5 కోట్లు వసూలు చేసి ఐదో స్థానంలో ఉంది.

ఖైదీ నెం 150

ఖైదీ నెం 150

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెం 150 ఓపెనింగ్ డే రూ. 34 కోట్లు వసూలు చేసి ఆరో స్థానంలో ఉంది.

బాహుబలి: ది బిగినింగ్ (తెలుగు)

బాహుబలి: ది బిగినింగ్ (తెలుగు)

బాహుబలి: ది బిగినింగ్ (తెలుగు) తొలి రోజు రూ. 33.5 కోట్లు వసూలు చేసి ఏడో స్థానంలో నిలిచింది.

సింగం రిటర్న్స్ (హిందీ):

సింగం రిటర్న్స్ (హిందీ):

అజయ్ దేవగన్ బాలీవుడ్ మూవీ సింగం రిటర్న్స్ తొలి రోజు రూ. 31.82 కోట్లు వసూలు చేసి ఎనిమిదవ స్థానంలో ఉంది.

చెన్నై ఎక్స్ ప్రెస్ (హిందీ)

చెన్నై ఎక్స్ ప్రెస్ (హిందీ)

షారుక్ ఖాన్ బాలీవుడ్ మూవీ చెన్నై ఎక్స్ ప్రెస్ (హిందీ) తొలి రోజు రూ. 31 కోట్లు వసూలు చేసి 9వ స్థానంలో ఉంది.

 కబాలి(తమిళం)

కబాలి(తమిళం)

రజనీకాంత్ నటించిన కబాలి మూవీ తొలి రోజు కబాలి రూ. 30.5 కోట్లు వసూలు చేసి టాప్ 10లో చోటు దక్కించుకుంది.

English summary
'Baahubali' franchise dominates All Time Top 10 Day 1 Earners among Indian Films. While the Top 2 Spots were occupied by Telugu & Hindi versions of 'Baahubali 2.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu