»   » బాలయ్య లెజెండ్ 1000(వెయ్యి) రోజుల పోస్ట‌ర్ విడుద‌ల‌,ఎక్కడ ఆడుతోందంటే

బాలయ్య లెజెండ్ 1000(వెయ్యి) రోజుల పోస్ట‌ర్ విడుద‌ల‌,ఎక్కడ ఆడుతోందంటే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం లెజెండ్. 2014, మార్చి 28న విడుద‌లైన ఈ చిత్రం క‌డ‌ప‌జిల్లాలోని ప్రొద్దుటూరు అర్చన థియేట‌ర్‌లో స‌క్సెస్ ఫుల్‌గా 950 రోజుల‌ను పూర్తి చేసుకుని 1000 రోజుల దిశ‌గా ప‌య‌నిస్తుండ‌టం విశేషం.

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణను ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను ఆవిష్క‌రించిన తీరు రియ‌ల్లీ సూప‌ర్బ్‌. ఈ శుభ సంద‌ర్భాన అర్చ‌న థియేట‌ర్ ప్రొప్రైట‌ర్ కె.ఓబుల్ రెడ్డి, లెజెండ్ ద‌ర్శ‌కుడు బోయ‌పాటిని క‌లిసి లెజెండ్ 950 నుండి 1000వ రోజు పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.


ర‌జ‌నీకాంత్ న‌టించిన త‌మిళ చంద్ర‌ముఖి చెన్నైలో 891 రోజుల విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శించ‌ప‌డి ద‌క్షిణాది సినిమా చ‌రిత్ర‌లో ఓ రికార్డ్‌ను క్రియేట్ చేసింది. ఈ రికార్డ్‌ను తిర‌గ‌రాస్తూ నంద‌మూరి బాల‌కృష్ణ లెజెండ్ 950 రోజ‌లను పూర్తి చేసుకుని 1000 రోజులుకు ప‌య‌నిస్తుంది.


తొలి సినిమాగా

తొలి సినిమాగా

ద‌క్షిణ భార‌త సినిమాల్లోనే 4 డిజిట్స్ పూర్తి చేసుకుంటున్న తొలి సినిమాగా `లెజెండ్`ప్ర‌ద‌ర్శించ‌బ‌డుతూ ద‌క్షిణ భార‌త చ‌ల‌న చిరిత్ర‌లో సరికొత్త హిస్ట‌రీని క్రియేట్ చేయ‌నుంది.


బాలయ్యకు ధాంక్స్

బాలయ్యకు ధాంక్స్

`లెజెండ్‌`ను ఇంత మెమ‌ర‌బుల్ మూవీగా గుర్తుండిపోయేలా చేసిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు, నంద‌మూరి అభిమానుల‌కు హీరో నంద‌మూరి బాల‌కృష్ణ చిత్ర‌ ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను, నిర్మాత‌లు రామ్ ఆచంట‌, గోపీచంద్ ఆచంట‌, అనీల్ సుంక‌ర‌, సాయికొర్ర‌పాటి స‌హా చిత్ర‌యూనిట్ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.


రాజీపడలేదు కాబట్టే అన్ని రోజులు

రాజీపడలేదు కాబట్టే అన్ని రోజులు

బాలకృష్ణ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిన లెజెండ్‌ చిత్రాన్ని సాయి కొర్రపాటి సమర్పణలో అనిల్‌ సుంకర, గోపి ఆచంట, రామ్‌ ఆచంట నిర్మాతలుగా క్వాలిటీ విషయంలో రాజీపడకుండా తెరకెక్కించారు. ఈ చిత్రం 127 సెంటర్లలో 50 రోజులు, 31 సెంటర్లలో 100 రోజులు పూర్తిచేసుకుని పెద్ద విజయం సాధించింది.


జనం కోసం పాటుపడే వ్యక్తితో

జనం కోసం పాటుపడే వ్యక్తితో

‘సింహా'లో రాయల్‌గా కనిపించే బాలయ్యబాబును కాస్త మీటర్‌ పెంచి ఇందులో జనం కోసం పాటుపడే వ్యక్తిగా చూపించారు. 100 సినిమాల్లో ఫ్యామిలీ హీరోగా చేసిన జగపతిబాబును విలన్‌గా పరిచయం చేశారు. బాలయ్యబాబు పవర్‌ని తట్టుకోవాలంటే ఎదురుగా బలమైన వ్యక్తి తప్పకుండా ఉండాలి. జగపతిబాబుగారు ఆ రోల్‌కి సంపూర్ణమైన న్యాయం చేశారు.''


తిరగరాయాలన్నా మేమే

తిరగరాయాలన్నా మేమే

బాలకృష్ణ మాట్లాడుతూ ... ''ఎమ్మిగనూరులో 'లెజెండ్‌' సినిమా ఇన్ని రోజులు ఆడటం ఆనందంగా ఉంది. ఇంతమంది అభిమానం పొందడం నా పూర్వజన్మ సుకృతం. చరిత్ర సృష్టించాలన్నా మేమే..చరిత్రను తిరగరాయాలన్నా మేమే.''అన్నారు


నాకు బీపి వస్తే ఏపీ వణుకుద్ది

నాకు బీపి వస్తే ఏపీ వణుకుద్ది

సినిమా గురించి... 'నీకు బీపీ వస్తే నీ పీఏ వణుకుతాడేమో.. నాకు బీపీ వస్తే ఏపీ వణుకుద్దీ..' అంటూ నందమూరి బాలకృష్ణ పలికిన సంభాషణలు, బోయపాటి శ్రీను దర్శకత్వ శైలి, రెండు పాత్రల్లో చూపించిన వైవిధ్యం, కథ కథనాలు, దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం వెరసి 'లెజెండ్‌'కి మరపురాని విజయాన్ని అందించాయి. 'సింహా' తరవాత బాలకృష్ణ-బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన చిత్రం 'లెజెండ్‌'. వారాహి చలనచిత్రం, 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.


ఆ ఘనత బోయపాటిదే

ఆ ఘనత బోయపాటిదే

2014లో సరైన హిట్టు ఒక్కటీ లేదే అనుకుంటున్న తరుణంలో సరిగ్గా బోయపాటి 'లెజెండ్‌'ని రంగంలోకి దించాడు. ఈ ఏడాదిలోనే బ్లాక్‌బస్టర్‌ హిట్‌ని పరిశ్రమకు ఇచ్చాడు. అటు ప్రేక్షకుల్ని కేరింతలు కొట్టించాడు. ఈ క్రెడిట్‌ పూర్తిగా నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనులదే. బాలయ్యలో అసలైన సింహాన్ని తెరపైకి తెచ్చాడు. యాక్షన్‌లో ఉగ్రనరసింహుడిని చూపించాడని ఫ్యాన్స్ అంటున్నారు.


గుండె పగిలిపోయే ఉద్వేగం

గుండె పగిలిపోయే ఉద్వేగం

లెజెండ్‌ గర్జనతో థియోటర్స్ మార్మోగిపోయాయి. కుటుంబ ప్రేక్షకుల కోసం చక్కని సెంటిమెంట్‌ రంగరించి వదలటం ప్లస్ అయ్యింది. ముఖ్యంగా సెకండాఫ్ లో సెంటిమెంట్‌, ట్రెయిన్‌ ట్రాక్‌పై ఎపిసోడ్‌లో ప్రేమ సన్నివేశం ప్రేక్షకుడి గుండె పగిలిపోయే ఉద్వేగాన్ని ఇచ్చాయి. గుడిమెట్లపై బాలయ్య ఉగ్రరూపం యాక్షన్‌కే కొత్త హంగులు అద్దిందని అంతటా వినపడుతోంది. మాస్‌ యాక్షన్‌ ప్రియులకు ఇదో కన్నుల పండుగగా మారింది.


చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ

చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ

''చరిత్ర సృష్టించడం నందమూరి వంశానికే సాధ్యం. నాడు ఎన్టీఆర్‌ ఎన్నో విజయాలు సాధించారు. ఇప్పుడు బాలకృష్ణ దాన్ని కొనసాగిస్తున్నారు. బాలకృష్ణ సినిమాల్లోనే కాదు... హిందూపురం ఎమ్మెల్యేగా సేవ చేస్తూ నిజమైన హీరోగా నిలిచారు''అన్నారు


బోయపాటి శ్రీను మాట్లాడుతూ....

బోయపాటి శ్రీను మాట్లాడుతూ....

''నా' అనుకునే వాళ్లను దగ్గరకు తీసుకొని ఆదరించడం నందమూరి, నారా వంశాల లక్షణం. రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్ర ప్రాంతం ఏమైపోతుందో అని అందరూ అనుకున్నారు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతో అదృష్టాంధ్రప్రదేశ్‌గా మారింది.


సాయి కొర్రపాటి మాట్లాడుతూ....

సాయి కొర్రపాటి మాట్లాడుతూ....

''బాలకృష్ణ మాపై ఎంతో నమ్మకముంచి ఈ సినిమా ఇచ్చారు. 'లెజెండ్‌'పేరుతో వచ్చి లెజెండరీ విజయం సాధించింది. ఈ సినిమా విజయంలో బోయపాటి శ్రీను కృషి ఎంతగానో ఉంది. బాలకృష్ణగారు మరోసారి సినిమా చేసే అవకాశమివ్వాలని కోరుకుంటున్నామ''న్నారు.


క్రేజీ సెల్ఫీ విత్ బాలయ్య

క్రేజీ సెల్ఫీ విత్ బాలయ్య

తను పెద్ద స్టార్ ని అనే విషయం ప్రక్కన పెట్టి టీవీ యాంకర్స్ తోనూ, చిన్న చిన్న నటులుతోనూ ఆయన చాలా ఉత్సాహంగా గడిపారు. అంతేకాదు వారు అడిగిన వెంటనే క్రేజీ సెల్ఫీలతో వారిలో ఉల్లాసం నింపి అందరినీ సంతోషపెట్టిన ఆ ఫొటోలు మీరు ఇక్కడ చూడవచ్చు.ఇక్కడ చదవండి


English summary
Nandamuri Balakrishna and director Boyapati Sreenu combination blockbuster film Legend is heading to complete 1000 days run. The film released on March 28, 2014 is progressing from 950 to 1000 days in Archana Theater, Proddaturlu in Kadapa district.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu