»   »  ‘బ్రహ్మోత్సవం’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ (అఫీషియల్)

‘బ్రహ్మోత్సవం’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ (అఫీషియల్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు నటించిన 'బ్రహ్మోత్సవం' చిత్రం విడుదలై గురువారంతో వారం పూర్తయింది. సినిమా విడుదలైన రోజు నుండే ప్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం రెండో రోజు నుండే వసూళ్లు దారుణంగా పడిపోయాయి. గురువారం అయితే వసూళ్లు మరీ దారుణంగా ఉన్నాయి. మహేష్ బాబు గత సినిమా 'శ్రీమంతుడు' తొలివారం రోజుల్లో వరల్డ్ వైడ్ దాదాపు రూ. 60 కోట్ల షేర్ సాధించింది. ప్లాప్ టాక్ కారణంగా 'బ్రహ్మోత్సవం' అందులో సగంతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది.

ఫస్ట్ వీకెండ్ తర్వాత సినిమా టాక్ సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి తెలిసి పోవడంతో.... 'బ్రహ్మోత్సవం' ప్రర్శించబడుతున్న థియేటర్లలో చాలా వరకు ఖాళీ సీట్లే దర్శనమిచ్చాయి. నైజాం, సీడెడ్ ఏరియాల్లో చాలా చోట్ల సినిమాను తీసేసి వేరే సినిమాలు వేసారు.

ఇంతకు ముందు మహేష్ బాబు నటించిన '1-నేనొక్కడినే', 'ఆగడు' లాంటి సినిమాలు కూడా ప్లాప్ అయినా.... పరిస్థితి 'బ్రహ్మోత్సవం' అంత దారుణంగా మాత్రం లేదు. ఆ రెండు సినిమాలు యూఎస్ఏలో మంచి వసూళ్లే సాధించాయి. అయితే 'బ్రహ్మోత్సవం' ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఓవర్సీస్ మార్కెట్లో కూడా దారుణంగా పడిపోయింది.

బ్రహ్మోత్సవం తొలివారం వివిధ ఏరియాల్లో సాధించిన షేర్ వివరాలు స్లైడ్ షోలో....

నైజాం

నైజాం


నైజాం ఏరియాలో ఈచిత్రం రూ. 8.35 కోట్ల ఫస్ట్ వీక్ షేర్ సాధించినట్లు అభిషేక్ పిక్చర్స్ వారు ప్రకటించారు. రోజువారీ వసూళ్లు పరిశీలిస్తే శుక్ర: రూ. 4 కోట్లు, శని రూ. 1.59 కోట్లు, ఆది: 1.44 కోట్లు, సోమ: 69 లక్షలు, మంగళ: 35 లక్షలు, బుధ: 16 లక్షలు, గురు: 11 లక్షలు వసూలు చేసింది.

ఆంధ్ర

ఆంధ్ర


ఆంధ్రా ఏరియాలోని 9 జిల్లాల్లో కలిపి ఈ చిత్రం తొలి వారం రూ. 12.8 కోట్లు వసూలు చేసింది.

సీడెడ్

సీడెడ్


రాయలసీమ జిల్లాల్లో ఈ చిత్రం తొలి వారం రూ. 3.01 కోట్ల షేర్ సాధించింది.

యూఎస్ఏ

యూఎస్ఏ


యూఎస్ఏలో ఈ చిత్రం తొలివారం రూ. 4.05 కోట్లు ($ 1,092,0750) వసూలు చేసింది.

కర్నాటక

కర్నాటక


కర్నాటకలో ఈ చిత్రం తొలివారం రూ. 3.50 కోట్లు వసూలు చేసింది.

రెస్టాఫ్ ఇండియా

రెస్టాఫ్ ఇండియా


ఇండియాలోని ఇతర ప్రాంతాల్లో వేసిన షోల ద్వారా తొలి వారం రూ. 1 కోటి షేర్ వచ్చింది.

టోటల్

టోటల్


బ్రహ్మోత్సవం తొలివారం ప్రపంచ వ్యాప్తంగా 33.96 కోట్లు వసూలు చేసింది. సినిమా విడుదల ముందు తొలివారం రూ. 70 కోట్ల షేర్ వస్తుందని అంచనా వేసారు. అయితే అందులో సగం కూడా సినిమా అందుకోలేక పోయింది.

English summary
That "Brahmotsavam" is a dud is not at all secret. On the very first day, the film's result was known to everyone but producers, distributors, exhibitors didn't expect that theaters would turn empty within days. The movie was lifted off from many theaters in Hyderabad and Ceded area after the weekend with low turnout of audiences.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more