»   » ట్రిమ్మింగ్ చేసినా... దారణం: 'బ్రహ్మోత్సవం' ఫస్ట్ డే కలెక్షన్స్ (ఏరియావైజ్)

ట్రిమ్మింగ్ చేసినా... దారణం: 'బ్రహ్మోత్సవం' ఫస్ట్ డే కలెక్షన్స్ (ఏరియావైజ్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'బ్రహ్మోత్సవం'...మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాక సినీ లవర్స్ సైతం ఎదురుచూసిన సినిమా. ఎంతో హై ఎక్సపెక్టేషన్స్ తో విడుదలైన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ నెంబర్స్ లిఖించటంతో ఫెయిలైంది. ఈ చిత్రం మొదటి రోజు కలెక్షన్స్ ట్రేడ్ పండితలను షాక్ చేసాయి.

అప్పటికీ ఈ చిత్రం 12 నిముషాలు పాటు ట్రిమ్ చేసారు. సెకండాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు లేపేసారు. అయితే ఆ ఇంపాక్ట్ కూడా ఏమి కనపడటం లేదు అని అంటున్నారు. ట్రిమ్మింగ్ తర్వాత మరింత కన్ఫూజ్ కు జనం గురి అవుతున్నారని చెప్పుకుంటున్నారు.


శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలు (ఆంధ్రా, తెలంగాణా) కలిసి 12.75 కోట్ల షేర్ వచ్చిందని సమాచారం. ఈ చిత్రం మొదటి రోజు ఓపినింగ్ కలెక్షన్స్ లో నాలుగో స్దానంలో ఉంది. ఐదు షోలతో వచ్చిన ఈ చిత్రం ఇంకా ఎక్కువ కలెక్టు చేస్తుందని అందరూ అంచనా వేసారు. అంచనాలతో పోలిస్తే ఈ కలెక్షన్స్ దారుణమే అంటున్నారు. ముఖ్యంగా నిన్న సాయింత్రానికే డ్రాప్ అవటం చాలా సింగిల్ స్క్రీన్స్ లో కనపించటం డిస్ట్రిబ్యూటర్స్ ని బయ్యర్లును కంగారుకు గురి చేసింది.


ఎందుకంటే ఈ చత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు ఎనభై కోట్లు వరకూ జరిగింది. దాంతో ఓపినింగ్ కలెక్షన్స్, మొదటి రోజే డ్రాప్, నెగిటివ్ టాక్...చూస్తూంటే సోమవారం నుంచి పరిస్దితి ఇంకా దారుణంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.


శ్రీమంతుడు చిత్రం వచ్చిన ఈ సినిమాకావటంతో డిస్ట్రిబ్యూటర్స్ చాలా నమ్మకాలు పెట్టుకున్నారు. భారీ ఎత్తున ఈ చిత్రంపై పెట్టుబడి పెట్టారు. ఈ చిత్రం శ్రీమంతుడు రికార్డ్ ని రీచ్ అవటంతో ఫెయిలైంది. శ్రీమంతుడు చిత్రం టాలీవుడ్ తొలి రోజు కలెక్షన్స్ లో మూడువ ప్లేస్ లో ఉంది.


అంతేకాకుండా శ్రీమంతుడు చిత్రం యుఎస్ లో కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అక్కడ కేవలం $557K (149 లక్షలు) మాత్రమే కలెక్ట్ చేసింది. ఈ కలెక్షన్స్ సర్దార్, శ్రీమంతుడు, బాహుబలి కన్నా తక్కువ. ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో బాహుబలి చిత్రం ఫస్ట్ డే కలెక్షన్స్ లో తొలి స్దానంలో ఉండగా, సర్దార్ గబ్బర్ సింగ్ సెకండ్ ప్లేస్ లో ఉంది. శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం మూడు,నాలుగు స్దానాలు ఆక్రమించటం విశేషం.


స్లైడ్ షోలో ఏరియావైజ్ కలెక్షన్స్ వివరాలు..


నైజాం

నైజాం

నైజాం ఏరియాలో బ్రహ్మోత్సవం తొలి రోజు రూ. 3.67 కోట్లు వసూలు చేసింది.సీడెడ్

సీడెడ్

సీడెడ్ ఏరియాలో బ్రహ్మోత్సవం తొలి రోజు రూ. 1.50 కోట్లు వసూలు చేసింది.


వైజాగ్

వైజాగ్

వైజాగ్ ఏరియాలో బ్రహ్మోత్సవం తొలి రోజు రూ1.96 లక్షలు వసూలు చేసింది.


ఈస్ట్ గోదావరి

ఈస్ట్ గోదావరి

ఈ ఏరియాలో బ్రహ్మోత్సవం తొలి రోజు రూ. 1.60 కోట్లు వసూలు చేసింది.


 వెస్ట్ గోదావరి

వెస్ట్ గోదావరి

వెస్ట్ గోదావరిలో బ్రహ్మోత్సవం తొలి రోజు రూ. 1.92 కోట్లు వసూలు చేసింది.


కృష్ణ

కృష్ణ

కృష్ణ ఏరియాలోబ్రహ్మోత్సవం తొలి రోజు రూ.75 లక్షలు వసూలు చేసింది.


గుంటూరు

గుంటూరు

గుంటూరు ఏరియాలో బ్రహ్మోత్సవం తొలి రోజు రూ. 1.90 కోట్లు వసూలు చేసింది.


 నెల్లూరు

నెల్లూరు

నెల్లూరు ఏరియాలో బ్రహ్మోత్సవం తొలి రోజు రూ. 45 లక్షలు వసూలు చేసింది.


టోటల్

టోటల్

బ్రహ్మోత్సవం తొలి రోజు ఏపీ, తెలంగాణల్లో టోటల్ రూ. 13.78 కో కోట్లు వసూలు చేసింది.మహేష్‌బాబు, కాజల్‌, సమంత, ప్రణీత, సత్యరాజ్‌, రావు రమేష్‌, జయసుధ,రేవతి,శరణ్య,ఈశ్వరి,తనికెళ్ల భరణి,సాయాజీషిండే, నాజర్‌, తులసి,కృష్ణభగవాన్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్‌, ఛాయాగ్రహణం: రత్నవేలు, కళ: తోట తరణి, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాతలు: పెరల్‌.వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె, మహేష్‌బాబు, దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల . సమర్పణ: జి.మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లిమిటెడ్‌. బ్రహ్మోత్సవం మహేష్ బాబు

English summary
Brahmotsavam, which hit screens the other day, amidst the fans galore and huge expectations, failed to spin magical numbers at the box-office on the first day, which came as a huge shock even for the trade pundits.Directed by Srikanth Addala, Brahmotsavam collected a total share of 12.75 Cr in AP and Telangana, according to the distributors figures.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu