»   » అదే ఫిక్సైతే... ‘బ్రహ్మోత్సవం' ఓవర్ సీస్ లో పెద్ద దెబ్బే

అదే ఫిక్సైతే... ‘బ్రహ్మోత్సవం' ఓవర్ సీస్ లో పెద్ద దెబ్బే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్‌బాబు ప్రస్తుతం శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ‘బ్రహ్మోత్సవం'. ఈ చిత్రం మహేష్ కు ఓవర్ సీస్ లో ఉన్న క్రేజ్ దృష్ట్యా అక్కడ భారీగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే రిలీజ్ డేట్ విషయంలోనే అక్కడ సమస్య వస్తోందని సమాచారం.

నిర్మాతలు ఈ చిత్రాన్ని మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు ని దృష్టిలో పెట్టుకుని మే 31 న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే మే 31 ..మంగళవారం అయ్యింది. దాంతో ఓవర్ సీస్ లో ప్రీమియర్ షోలు అన్నీ సోమవారం పడతాయి. ఇంకా చెప్పుకోవాలంటే వీకెండ్ అయిన వెంటనే ఈ షోలు అక్కడ పడతాయి.

ఇలా వీకెండ్ మూడ్ లోంచి బయిటకు రాగనే ఈ సినిమా రిలీజ్ అయితే ఎంతవరకూ ఓవర్ సీస్ లో సక్సెస్ అవుతుందనేది ఇప్పుడు చర్చనీయాంసంగా మారింది. అదే ఎప్పటిలాగే శుక్రవారం రిలీజ్ అయితే శని,ఆది వారాలు కలిసి వచ్చి కలెక్షన్స్ కుమ్ముతాయి.

 Brahmotsavam: Overseas premiers trouble?

ఇలా మంగళవారం రిలీజ్ అయితే వీకెండ్ ఎడ్వాంటేజ్ మిస్ అవుతుందనేది నిజం. అంతేకాదు..శని,ఆదివారాలు వచ్చేదాకా స్ట్రాంగ్ గా రన్ ఉండాలి. ఎక్కడ చిన్న నెగిటివ్ టాక్ వచ్చినా బిజినెస్ పరంగా పెద్ద దెబ్బే. ఓవర్ సీస్ లో ఇక్కడలా కాకుండా సినిమా టాక్ ని బట్టి మిగతా షోలు ఫుల్ అవుతున్నాయి. మరి నిర్మాతలు ఈ సమస్యను ఎలా సాల్వ్ చేస్తారో చూడాలి.

ఈ చిత్రానికి లాస్ట్ మంత్ నూతన సంవత్సరం సందర్బంగా విడుదల చేసిన టీజర్ తో మంచి క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓవర్ సీస్ బిజినెస్ ఓ రేంజిలో జరుగుతోందని ఈ మరకు చర్చలు జరుగుతున్నాయని సమాచారం.

ఓవర్ సీస్ లో రైట్స్ కోసం చిత్ర నిర్మాతలు పీవిపి వారు పదమూడు కోట్లు చెప్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఓవర్ సీస్ లో పేరెన్నికగన్న ఓ డిస్ట్రిబ్యూషన్ సంస్ద నెగోషియేషన్ స్టేజీలో ఉంది. ఇప్పటివరకూ ఏ తెలుగు సినిమాకూ ఈ స్ధాయిలో ఓవర్ సీస్ లో రేటు పలకలేదు.

శ్రీమంతుడు సినిమా ఓవరాల్ గా యుఎస్ లో 18 కోట్లకి పైనే కలెక్ట్ చేయటమే ఈ రేటు ఫిక్స్ చేయటానికి కారణం అంటున్నారు. మరో ప్రక్క ఫ్యామిలీలను టార్గెట్ చేసినట్లున్న ఈ టీజర్ కూడా ప్లస్ అయ్యింది. ఇక్కడ ఆ టీజర్ ని మరోసారి చూడండి.

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి.సినిమాస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌ నిర్మిస్తున్నారు. మహేష్ బాబు కోసం ఈ సారి శ్రీ కాంత్ అడ్డాల విజయవాడ బ్యాక్ డ్రాప్ ని ఎంచుకున్నాడు. పివిపి బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి నిర్మించనున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు.

English summary
Brahmotsavam makers are planning to release the film in a grand manner on May 31st to celebrate Super Star Krishna's birthday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu