»   » గ్రాండ్ గా ‘బ్రూస్ లీ' ప్రీమియర్ షో ..డిటేల్స్

గ్రాండ్ గా ‘బ్రూస్ లీ' ప్రీమియర్ షో ..డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘బ్రూస్ లీ' చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈచిత్రం ఎలాంటి కట్స్ లేకుండా యూ/ఎ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న విడుదల చేసేందుకు గ్రాండ్‌గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీమియర్ షోకు ఏర్పాట్లు జరిగిపోయాయి. ఆ ఏర్పాట్లు వివరాలు ఇక్కడ ...

ఈ చిత్రం ప్రీమియర్ షోను ... హైదరాబాద్ మూసాపేట లోని శ్రీరాములు థియోటర్ లో అక్టోబర్ 15 రాత్రి అంటే తెల్లారితే 16న రాత్రి ఒంటి గంటకు ఈ షోను వేస్తున్నారు. టిక్కెట్ రేట్లు అవీ థియోటర్ వద్ద తెలుసుకోవచ్చు. ఈ షో కు వచ్చిన డబ్బులను అనాధ శరణాలయానికి ఇస్తారు.


Bruce Lee grand Premier show by Mega Fans

బ్రూస్ లీ చిత్రాన్ని వరల్డ్ వైడ్ దాదాపు 2000 స్క్రీన్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అమెరికాలో కూడా భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా విడుదల కానన్ని అత్యధిక స్క్రీన్లలో ‘బ్రూస్ లీ' సినిమా విడుదలవుతోంది. 220 స్క్రీన్లలో ‘బ్రూస్ లీ' చిత్రం విడుదలవుతోంది.


నిర్మాత మాట్లాడుతూ ''బ్రూస్‌లీకి వీరాభిమాని అయిన ఓ యువకుడి కథ ఇది. తనకు ఎదురైన ఓ సమస్యపై ఎలా పోరాటం చేశాడన్నది తెరపైనే చూడాలి. వినోదం, కుటుంబ అనుబంధాలకు పెద్దపీట వేస్తూ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. రామ్‌చరణ్‌ చేసే యాక్షన్‌, డ్యాన్సులు అభిమానుల్ని అలరించేలా ఉంటాయి. ఇటీవల విడుదలైన 'లే చలో...' పాటకి మంచి స్పందన లభిస్తోంది. చిత్రాన్ని 16న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము'' అన్నారు.


Bruce Lee grand Premier show by Mega Fans

"వేట ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. మొదలుపెట్టాక, పూర్తయ్యేవరకూ రిక్వెస్ట్‌లు వినపడవ్! రియాక్షన్‌లు కనపడవ్! ఓన్లీ రీసౌండ్!" అంటూ చరణ్ చెప్తూ విడుదల చేసిన ఆయన తాజా చిత్రం డైలాగ్ టీజర్ కు అభిమానులకు పండగే చేసుకున్నారు.


Bruce Lee grand Premier show by Mega Fans

రామ్‌చరణ్‌, రకుల్‌ప్రీత్‌లతో పాటు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన నదియా, అరుణ్‌ విజయ్‌ నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ: కోన వెంకట్‌, గోపీమోహన్‌, మాటలు: కోన వెంకట్‌, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస, కూర్పు: ఎ.ఆర్‌. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్‌: అణల్‌ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.

English summary
Ram Charan fans are organising a Grand premier show of Bruce Lee, in association with premium fashion brand KALAMANDIR. Venue for this show is SRIRAMULU theatre on 16th October, 1AM.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu