»   » 50 కోట్లు షేర్ క్రాస్...ఫ్యాన్స్ కు పండుగ

50 కోట్లు షేర్ క్రాస్...ఫ్యాన్స్ కు పండుగ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు సుకుమార్ డైరక్షన్ లో ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో'. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రానికి ఓ రేంజిలో రెస్పాన్స్ వస్తోంది. గతంలో ఇంతకుముందెన్నడూ చూడని వెరైటి గెటప్‌లో కనిపిస్తున్న ఎన్టీఆర్‌ను చూసి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఈ చిత్రం సాధించిన అద్భుత విజయంపై నిర్మాత ప్రెస్ నోట్ ని విడుదల చేసారు.

నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ - ''ఓ మంచి కథాంశంతో ఎన్టీఆర్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో నిర్మించిన 'నాన్నకు ప్రేమతో..' చిత్రాన్ని ప్రేక్షకులు అపూర్వంగా ఆదరించి అఖండ విజయాన్ని చేకూర్చారు. 'నాన్నకు ప్రేమతో..'లో ఎన్టీఆర్‌ నటన అద్భుతంగా వుందని, ఇందులో ఓ కొత్త ఎన్టీఆర్‌ని చూసామని, కుటుంబ సభ్యులందరూ కలిసి చూసి ఆనందించ దగ్గ మంచి సినిమాగా సుకుమార్‌ ఈచిత్రాన్ని తీర్చిదిద్దారని అందరూ అభినందిస్తుంటే ఆనందంగా వుంది.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


BVSN about Nannaku Prematho success

అంతేకాదు కేవలం రెండు వారాల్లోనే ఈ చిత్రం 50 కోట్ల షేర్‌ని క్రాస్‌ చేసి ఇంకా బ్రహ్మాండమైన కలెక్షన్స్‌తో రన్‌ అవడం మంచి చిత్రానికి ఎప్పుడూ ప్రేక్షకులు సపోర్ట్‌ చేస్తారన్న విషయం మరోసారి ప్రూవ్‌ అయింది. ముఖ్యంగా 'నాన్నకు ప్రేమతో' యు.ఎస్‌లో కేవలం రెండు వారాల్లోనే 2 మిలియన్స్‌ కలెక్ట్‌ చేయడం మరింత ఆనందంగా వుంది. ఇంతటి అపూర్వమైన విజయాన్ని అందించిన ప్రేక్షకలోకానికి, ఎన్టీఆర్‌ అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను'' అన్నారు.


ఎన్టీఆర్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఫోటోగ్రఫీ: విజయ్‌ చక్రవర్తి, ఆర్ట్‌: రవీందర్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, పాటలు: చంద్రబోస్‌, డాన్స్‌: రాజు సుందరం, శేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుధీర్‌, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్‌.

English summary
NTR's Nannaku Prematho, despite mixed reviews from critics and audiences alike, has managed to earn over Rs.50 crore in the worldwide ticket window in just two weeks.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu