»   » సి.కళ్యాణ్ ...నయనతార తో ఈ సారి బిజినెస్

సి.కళ్యాణ్ ...నయనతార తో ఈ సారి బిజినెస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రీసెంట్ గా హన్సిక ప్రధాన పాత్రలో వచ్చిన చంద్రకళ ఛిత్రాన్ని డబ్ చేసి వర్కవుట్ చేసిన సి.కళ్యాణ్ ఇప్పుడు మరో హీరోయిన్ ఓరియెంటెడ్ హర్రర్ చిత్రాన్ని డబ్ చేయటానికి ముందుకు వచ్చారు. అది మరేదో కాదు..గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలిచిన నయనతార ప్రధాన పాత్రలో రూపొందుతున్న తమిళ హారర్ థ్రిల్లర్ సినిమా ‘మాయ'. నయనతార టైటిల్ రోల్ పోషిస్తుంది. తెలుగులో మయూరి అనే టైటిల్ తో రిలీజ్ చేయనున్నారని సమాచారం.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అశ్విన్ శరవణన్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో ఆరి ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ‘అనామిక' తర్వాత నయనతార నటిస్తున్న ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా ఇది. పోటెన్షియల్ స్టూడియోస్ పతాకంపై ప్రభు నిర్మిస్తున్న ఈ సినిమాపై తమిళ ప్రేక్షకులలో మంచి అంచనాలు ఉన్నాయి. నయనతార ఉండటంతో తెలుగులోనూ మంచి బిజినెస్ అవుతుందని భావిస్తున్నారు.

ప్రస్తుతం హారర్ చిత్రాల ట్రెండ్ నడుస్తోందన్నది పరిశ్రమ వర్గాల మాట. ఆ మధ్య వచ్చిన పిజ్జా, విల్లా, యామిరుక్కభయమే, ఆ, పిశాచు లాంటి చిత్రాల నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టాయి. ఈమధ్య తెలుగులో రూపొందిన గీతాంజలి లాంటి చిత్రాలు కాసులు తెచ్చిపెట్టాయి. దీంతో ఈ తరహా హార్రర్ చిత్రాల నిర్మాణాల సంఖ్య పెరుగుతోందనే చెప్పాలి. తాజాగా నటినయనతార మాయ చిత్రంతో భయపెట్టడానికి రెడీ అవుతున్నారు.

C.Kalyan bags yet another film’s dubbing rights

చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్ర తమిళనాడు విడుదల హక్కులను తేనాండాళ్ ఫిలింస్ రామనారాయణన్ కొడుకు మురళి సొంతం చేసుకున్నారు. ఈయన చిత్రాన్ని ఐదు కోట్ల ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చి పొందడం విశేషం. చిత్రంలో ప్రధాన ఆకర్షణ నయనతార మాత్రమే. హీరో, దర్శకుడు ఇతర తారాగణం కొత్తవారే.

మరి ఈ చిత్రం అంత మొత్తంతో కొనుగోలు చేస్తే వర్కౌట్ అవుతుందా? అన్న ప్రశ్నకు ప్రస్తుతం ఈ తరహా హారర్ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. అదే విధంగా నయనతార నటించిన ఈ మాయూ చిత్రం ఇతర చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందన్నారు. ఇంతకుముందు పిశాచు చిత్రాన్ని విడుదల చేసి లాభాలను ఆర్జించిన ఈయన నయనతార మాయ కూడా ఆ మ్యాజిక్ చేస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అలాగే...ప్రస్తుతం సి.కళ్యాణ్ నిర్మాతగా జ్యోతిలక్ష్మి చిత్రం రూపొందుతోంది. ఆ చిత్రం వివరాల్లోకి వెళితే...

ఛార్మి కౌర్ సమర్పణలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌, శ్రీశుభశ్వేత ఫిలింస్‌ పతాకాలపై పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘జ్యోతిలక్ష్మీ' చిత్రం పూర్తైంది అయింది. ఈ చిత్రంలో టైటిల్‌ పాత్రను ఛార్మి పోషిస్తోంది. పూర్తి లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా దీన్ని తెరరెక్కిస్తున్నారు.

C.Kalyan bags yet another film’s dubbing rights

జ్యోతి లక్ష్మి సినిమా అనగానే ఇది నిన్నటితరం ఐటం గర్ల్ జ్యోతి లక్ష్మి జీవితం గురించి అని అంతా అనుకుంటున్నారు. కానీ పూరి ‘జ్యోతి లక్ష్మి' కాన్సెప్టు ఇది కాదని స్పష్టమవుతోంది. యాక్షన్ కూడా ఈ టీజర్ లో మిక్స్ చేసి వదిలి సినిమాపై ఆసక్తి రేపారు.

ఈ చిత్రం అందరూ అనుకుంటున్నట్లు హీరోయిన్ జీవితం కాదు..ఓ సెక్స్ వర్కర్ జీవిత కథ అని తెలుస్తోంది. అది మల్లాది వెంకట కృష్ణమూర్తి రచన మిసెస్ పరాంకుసం నవల ఆధారంగా చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో పరాంకుసం అనే వేశ్య...వివాహం చేసుకుని అందరిలా వైవాహిక జీవితం గడుపుతూ ఎలా సెటిలైందనే అంశం చుట్టూ తిరిగుతుంది. దాన్నే కొద్ది పాటి మార్పులతో పూరి చేస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

పేరు క్యాచీగా ఉండాల‌ని ఆలోచిస్తే జ్యోతిలక్ష్మి అయితే బాగుంటుంద‌ని అది ఓకే చేశామ‌ని. అంతేగానీ ఈ సినిమా జ్యోతిల‌క్ష్మి నిజ జీవితానికి సంబంధం లేద‌ని పేర్కొన్నారు.

ఛార్మి కౌర్‌, సత్య, వంశీ ప్రధాన పాత్రల్లో రూపొందనున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పి.జి.వింద, సంగీతం: సునీల్‌ కశ్యప్‌, నిర్మాతలు శ్వేతలానా, వరుణ్‌, తేజ,సి.వి.రావు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

English summary
As per the latest update, Producer C.Kalyan grabbed the rights to dub Nayanatara’s woman centric flick ‘Maya’. Tentatively titled Maayuri in Telugu, this flick will hit the screens very soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu