C/O కంచెరపాలెం తొలి రోజు కలెక్షన్లు.. ఎంతో రాబట్టిందో తెలుసా?
నూతన దర్శకుడు వెంకటేష్ మహా రూపొందించిన C/O కంచెరపాలెం చిత్రం రిలీజ్‌కు ముందే సినీ ప్రముఖలు, విమర్శకుల దృష్టిని ఆకర్షించింది. సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా ఓ మోస్తారు స్పందన కనిపిస్తున్నది.
అమెరికాలో ఈ చిత్రం తొలిరోజున రూ. 25 లక్షల రూపాయలు (36వేల డాలర్లు) వసూలు చేసింది. కేవలం హైదరాబాద్‌లో ఈ చిత్రం రూ.3.5 లక్షలు వసూలు చేయడం గమనార్హం.

శుక్రవారం రిలీజైన మను, సిల్లీ ఫెలోస్ చిత్రాలకంటే భిన్నంగా C/O కంచెరపాలెం చిత్రం కలెక్షన్లను సాధిస్తున్నది. మౌత్ పబ్లిసిటీ మరింత పెరిగితే ఈ సినిమా కలెక్షన్లు కూడా పెరిగే అవకాశం ఉంది.
ప్రవీణా పరుచూరి రూపొందించిన ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి సమర్పించారు. చిన్న తరహా బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం న్యూయార్క్, ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్వించారు.
More from Filmibeat
maha venkatesh rana daggubati praveena paruchuri mohan bhagath వెంకటేష్ మహా ప్రవీణా పరుచూరి రానా దగ్గుబాటి


Click it and Unblock the Notifications











