»   » ఇన్నాళ్లూ చైతు ప్రేమ గురించి మాట్లాడుకున్నారు, ఇక ఇప్పుడు దీని గురించి..

ఇన్నాళ్లూ చైతు ప్రేమ గురించి మాట్లాడుకున్నారు, ఇక ఇప్పుడు దీని గురించి..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: గత రెండు నెలలుగా మీడియా మొత్తం నాగచైతన్య,సమంత ల ప్రేమ వ్యవహారం గురించే కథలుగా మాట్లాడుకుంటోంది. అయితే ఇప్పుడు చైతూ తెర మీద ప్రేమ ను మాట్లాడుకునే సమయం వచ్చేసింది. అర్దం కాలేదా..అదేనండి నాగచైతన్య చేస్తున్న ప్రేమమ్ రిలీజ్ డేట్ ఇచ్చేసారు. ఈ సినిమాలోనూ నాగచైతన్య...ముగ్గురు అమ్మాయిలతో ప్రేమలో పడతాడు.

నాగచైతన్య హీరోగా నటిస్తున్న చిత్రం 'ప్రేమమ్‌'. షూటింగ్ పూర్తి చేసుకున్నఈ చిత్రం రిలీజ్ కు రెడీ అయ్యింది. కార్తికేయ చిత్రంలో దర్శకుడిగా మారిన చందూ మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఆడియోని ఈ నెల 24న, చిత్రాన్ని వచ్చే నెల 9న విడుదల చేయటానికి దర్శక,నిర్మాతలు నిర్ణయించారు.

Chaitu's Premam audio to be released on 24th

నిర్మాత మాట్లాడుతూ ''ఇదో చక్కటి దృశ్యకావ్యం. అందరికీ నచ్చేలా తీర్చిదిద్దాం. చైతన్య కెరీర్‌లో మరపురాని చిత్రంగా నిలుస్తుంది. ఈనెల 18న తొలి పాట విడుదల చేస్తాం. వచ్చే నెల 9న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''అన్నారు.

మలయాళంలో ఘనవిజయం సాధించి, విమర్శకుల మెప్పు పొందిన చిత్రం 'ప్రేమమ్‌'. ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. నాగచైతన్య హీరో, శ్రుతిహాసన్‌, మడొన్నా సెబాస్టియన్‌, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్స్. సూర్యదేవర నాగవంశీ నిర్మాత.


ఈశ్వరీరావు, జీవా, బ్రహ్మాజీ, శ్రీనివాసరెడ్డి, ప్రవీణ్‌, చైతన్య కృష్ణ ఇతర పాత్రధారులు. చిత్రానికి సంగీతం: గోపీ సుందర్‌ . ఈ చిత్రం నాగచైతన్య 12వ చిత్రం కావడం విశేషం. ప్రస్తుతం గౌతమ్‌ మేనన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సాహసమే శ్వాసగా సాగిపో చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

జార్జ్ అనే కుర్రాడు టీనేజ్ లో, కాలేజ్ లో , సెటిలేజ్ లో ముగ్గురు అమ్మాయిలను ప్రేమిస్తాడు. వారి ప్రేమను సాధించుకోవటం లో ఊహించని అడ్డంకులు ఎదురై ,కలలు కరిగిపోయి ప్రేమించిన వారు మరొకరితో సెటిల్ అవ్వతుంటే తట్టుకోలేక గుండె పగిలేలా.. ఇలా కథ సాగుతుంది. ఇక నివిన్ పౌలీ ఈ చిత్రంతో హీరో గా పరిచయమయ్యారు. ఆల్ఫోన్సే పూతరేన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అతి తక్కువ బడ్జెట్ లో తెరకెక్కింది. మే 29న విడుదలయిన ఈ చిత్రం పెద్ద హిట్టయ్యింది.

English summary
Naga Chaitanya starrer Premam makers have planned to launch the audio of Premam on the 24th of August. Producer announced 9th of September as its release date.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu