twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాకిచ్చిన 'చెన్నై ఎక్స్‌ప్రెస్‌' కలక్షన్స్

    By Srikanya
    |

    ముంబై : షారుఖ్‌ ఖాన్‌, దీపికా పదుకొణే జంటగా నటించిన 'చెన్నై ఎక్స్‌ప్రెస్‌' చిత్రం యావరేజ్ చిత్రంగా అంతటా టాక్ వచ్చింది, అప్ టు ది మార్క్ లేదంటూ రివ్యూలు వచ్చాయి. అయితే వాటి ప్రభావం ఏదీ ఈ చిత్రం కలక్షన్స్ పై పడకపోవటం ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది. సినిమా విడుదలకు ముందు ఆగస్టు 8న ప్రదర్శించిన పెయిడ్‌ ప్రివ్యూల ద్వారా వచ్చిన మొత్తం రూ.6.75 కోట్లతోపాటు తొలి రోజు రూ.33.12 కోట్లు, రెండో రోజు రూ.28.05 కోట్లు, మూడో రోజు రూ.32.50 కోట్ల వసూళ్లు కలిపి రూ.100.42 కోట్లు దాటేసింది. రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో రూపొందిన 'చెన్నై ఎక్స్‌ప్రెస్‌' రూ.70 కోట్ల నిర్మాణ వ్యయంతో తెరకెక్కింది.

    బాలీవుడ్‌లో ఒక సినిమా రూ.వంద కోట్లు వసూలు చేయడం ఇప్పుడు కామనై పోయింది. అయితే అది ఎన్ని రోజుల్లో కలెక్టు చేసింది అన్నదే ఇప్పుడు ప్రధానాంశంగా చర్చించుకొంటున్నారు. ఇప్పటివరకూ 20కి పైగా హిందీ చిత్రాలు బిలియన్‌ క్లబ్బులో చేరి భారతీయ సినిమా స్థాయిని పెంచాయి. మొన్నటిదాకా సల్మాన్‌ ఖాన్‌ నటించిన 'ఏక్‌ థా టైగర్‌' సినిమా అయిదు రోజుల్లో రూ.వంద కోట్లు సాధించి ప్రథమ స్థానంలో ఉంది. అయితే ఇప్పుడు ఆ రికార్డును షారుఖ్‌ ఖాన్‌, దీపికా పదుకొణే జంటగా నటించిన 'చెన్నై ఎక్స్‌ప్రెస్‌' బద్దలు కొట్టింది. కేవలం మూడు రోజుల్లోనే ఆ మార్కును దాటేసింది.

    నార్త్ కుర్రాడు...సౌత్ అమ్మాయితో ప్రేమలో పడటమే కాన్సెప్టు తో వచ్చిన ఈ చిత్రంలో ...షారూఖ్ రాహుల్ గా కనిపిస్తాడు. అతను తన తాత.. అస్దికలను రామేశ్వరంలో కలిపాలని బయిలుదేరతాడు. అదే సమయంలో తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తూండంతో ... తమిళనాడు గ్రామంలోని ..ఇంట్లోంచి పారిపోయి వచ్చిన మీనమ్మ(దీపిక పదుకోని)..చెన్నై ఎక్సప్రెస్ లో మన హీరోని కలుస్తుంది. ఆమెతో పాటు ఆమె తండ్రి (సత్యరాజ్)అనుచరులు..వెనకే ఉంటారు. ఈ లోగా టిక్కెట్ కలెక్టర్ వచ్చి వాళ్లని టిక్కెట్ అడగటంతో అతన్ని వెళ్లై ట్రైన్ లోంచి క్రిందకు తోసేస్తారు.

    ఈ సంఘటనకు సాక్ష్యం...రాహుల్ కావటంతో అతన్ని తమతోపాటు తమ గ్రామంకి రమ్మంటారు. ఏం చేయాలో అర్దం కాని పరిస్దితుల్లో అతను ఆమె తో పాటు వాళ్ల ఊరు వస్తాడు. అక్కడ ఆమె...రాహుల్ ని పెళ్లి తప్పించుకోవటం కోసం బోయ్ ప్రెండ్ గా పరిచయం చేస్తుంది. ఆ తమిళనాడులోని కుగ్రామంలో భాషకూడా రాని రాహుల్ ఎలా తప్పించుకుని బయిటపడ్డారు. వీరిద్దరు మద్య ప్రేమ కథ ఎలా చిగురించింది...చివరకు వీళ్లిద్దరూ ఎలా ఒకటయ్యారు అనేది మిగతా కథ.

    English summary
    Being one of the most-awaited Hindi movies of 2013, Chennai Express packed a solid punch in paid previews on Thursday by collecting Rs 6.75 crores nett in the domestic market. This is the highest ever collection at the Indian Box Office.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X