»   »  'జర్నీ' దర్శకుడు నెక్ట్స్ తెలుగు వెర్షన్ రిలీజ్ రేపే

'జర్నీ' దర్శకుడు నెక్ట్స్ తెలుగు వెర్షన్ రిలీజ్ రేపే

Posted By:
Subscribe to Filmibeat Telugu
'Citizen' Releasing on 21st
హైదరాబాద్ : విక్రమ్ ప్రభు హీరోగా నటించిన అనువాద చిత్రం 'సిటిజన్‌'. సురభి హీరోయిన్ . శరవణన్‌ దర్శకుడు. సుబ్రహ్మణ్యం.బి., సురేష్‌.యస్‌, ఎన్‌.సుభాష్‌ చంద్రబోస్‌ కలిసి నిర్మించారు. ఎన్‌.లింగుస్వామి సమర్పకులు. ఈ నెల 21న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

నిర్మాత సుబ్రమణ్యం.బి మాట్లాడుతూ ''సమాజంలోని ఒక ప్రధానమైన సమస్యని ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన చిత్రమిది. అందరినీ భయపెడుతున్న రౌడీయిజంపై ఓ సామాన్య పౌరుడు ఎలా పోరాటం సాగించాడన్నది ఇందులో ఆసక్తికరం. దర్శకుడు శరవణన్‌ కొత్త తరహా స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇది వరకు ఆయన తీసిన 'జర్నీ' తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. అందుకు పూర్తి భిన్నమైన కథని ఎంచుకొని ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. ప్రతీ సన్నివేశం ప్రేక్షకుడికి ఓ ప్రత్యేకమైన అనుభూతినిస్తుంది. విక్రమ్‌ ప్రభు నటన ఆకట్టుకొంటుంది. తమిళంలో 'ఇవన్‌ వేరమాదిరి' పేరుతో విడుదలైన ఈ చిత్రం విశేషమైన ఆదరణ పొందింది. అదే తరహాలో తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది''అన్నారు.

ప్రజలను భయపెట్టి దేశాన్ని దోచుకునే రాజకీయ నాయకుడికి ఓ సామాన్యుడు ఎదురుతిరిగి అతనికి ఎలా బుద్ధి చెప్పాడనే కథాంశంతో ఈ చిత్రం రూపొందిందని ఆయన తెలిపారు. గజరాజు చిత్రంతో పరిచయమైన విక్రమ్ ప్రభు ఈ సినిమాతో ఉత్తమ నటుడిగా గుర్తింపు పొందుతారని, తెలుగువాడైన వంశీకృష్ణ విలన్‌గా ఈ చిత్రంలో కనిపించారని ఆయన అన్నారు. అతనికి కూడా ఈ చిత్రంతో మంచి బ్రేక్ వస్తుందని తెలిపారు. డబ్బింగ్ విషయంలో లిప్‌సింక్‌ను ప్రత్యేకంగా పర్యవేక్షించామని, స్ట్రెయిట్ సినిమా చూసిన అనుభూతి కలుగుతుందని ఆయన తెలిపారు. వంశీకృష్ణ, గణేష్‌ వెంకట్రామన్‌, హరిరాజ్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం:సత్య, పాటలు: భువనచంద్ర, వెన్నెలకంటి, రాకేందుమౌళి, మాటలు: వెన్నెలకంటి శశాంక్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, నిర్మాతలు: బి.సుబ్రహ్మణ్యం, సురేష్.ఎస్, ఎన్.సుభాష్ చంద్రబోస్, దర్శకత్వం: ఎం.శరవణన్.

English summary
"Citizen" is Tamil film 'Ivan Veramathiri' dubbed in Telugu starring Vikram Prabhu and Surabhi directed by M. Saravanan and produced jointly under Lakshmi Ganapati Films banner and Thirupathi Brothers banner. First copy is ready and all set to release it on 21st March in Andhra Pradesh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu