»   » 'బాహుబలి' తో సహా: ఈ సూపర్ హిట్స్ అన్నీ దొంగ దెబ్బ దాటినవే

'బాహుబలి' తో సహా: ఈ సూపర్ హిట్స్ అన్నీ దొంగ దెబ్బ దాటినవే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఈ మద్యకాలంలో సూపర్ హిట్ గా నిలిచిన అత్తారింటికి దారేది, బాహుబలి, ప్రేమమ్ ఈ మూడు చిత్రాలకు ఒక సిమిలారిటీ ఉందీ. అదేమిటో వింటే మీరు షాక్ అవుతారు. ఈ మూడు సూపర్ హిట్ కాకముందు ఒకే విధమైన సమస్యను ఎదుర్కొన్నాయి. ఇంతకీ ఆ సమస్య ఏమిటీ అంటారా..అదే పైరసీ.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

బాహుబలి విషయానికి వస్తే... ఈ చిత్రంలో కీలకమైన కొన్ని సన్నివేశాలు...కొన్ని లీకై పోయాయి. మొత్తం ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. సినిమాకు పనిచేసి బయిటకు వెళ్లిన వాళ్లే ఆ పనిచేసారని తేలింది. దాంతో కేసులు పెట్టారు. తర్వాత ఆడియో రిలీజ్ కు ముందే లీకయ్యింది.

అత్తారింటికి దారేది విషయానికి వస్తే...ఈ చిత్రం ఫస్టాఫ్ మొత్తం లీకైంది. సినిమా పని అయిపోయింది అనుకున్నారు అంతా. అయితే ఊహించని విధంగా సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత ఆ లీక్ చేసిన వారిపై కేసులు గట్రా పెట్టారు.

 Coincidence Between...Baahubali, Atharintiki Dharedhi, Premam

అలాగే.. మళయాళ చిత్రం ప్రేమమ్ సూపర్ హిట్టైంది.ఈ చిత్రం కూడా సెన్సార్ కాపీ బయిటకు లీకైంది. అంతా కంగారు పడ్డారు. అయితే ఆ లీక్ ఎఫెక్ట్ సినిమాపై కొంచెం కూడా పడలేదు. కలెక్షన్స్ స్టడీగానే ఉన్నాయి.

ఇక రీసెంట్ గా తమిళ చిత్రం పులి...సినిమాకు సంభందించి ట్రైలర్ రిలీజ్ కు ముందే బయిటకు వచ్చేసింది. ఈ లీక్ తో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ తర్వాత ట్రైలర్ పెద్ద హిట్టైంది.

ఇలా ఈ నాలుగు చిత్రాలు పైరసీ లేదా లీకేజ్ జరగటం తర్వాత పోలీస్ కంప్లైంట్స్...తదనంతరం సూపర్ హిట్ అవటం జరిగింది. మొదట మేకర్స్ కంగారు పడ్డా తర్వాత ఊపిరి పీల్చుకున్నారు.

English summary
Incidentally, Baahubali, Atharintiki Dharedhi, Premam...all these three blockbuster films faced the piracy menace at different stages.
Please Wait while comments are loading...