నాని రికార్డు :ఒకే నెలలో మూడు రిలీజ్ లు

నాని హీరోగా క్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'పైసా'. కేథరిన్ హీరోయిన్. ఈ నెల 7 వ తేదీన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు సుకురానున్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని నాని తెలిపారు. 'పైసా' అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
నాని ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం 'జెండాపై కపిరాజు'. పిభ్రవరి 14న ఈ చిత్రం విడుదల అవుతోంది. ఈ చిత్రం దర్శకుడు మాట్లాడుతూ ''దేశానికి సేవ చేయడం కోసం ప్రాణాల్ని అర్పించనక్కర్లేదు. ప్రతి వ్యక్తి తనని తాను సంస్కరించుకుంటే దేశాన్ని సంస్కరించినట్టేనన్న అంశం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుంది. సున్నితమైన ఈ అంశాన్ని వినోదాత్మకంగా చెబుతున్నాము''అన్నారు. హీరో నాని మాట్లాడుతూ తాను ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నంగా ఈ చిత్రంలో తన క్యారెక్టర్ ఛాలెంజింగ్‌గా ఉంటుందని, చెడు మీద సాగించే యుద్దమే ఈచిత్రం..అందుకే 'జెండాపై కపిరాజు' అనే టైటిల్ పెట్టినట్లు తెలిపారు.
నాని, వాణి కపూర్ జంటగా తెలుగు, తమిళంతో తెరకెక్కుతున్న చిత్రం 'ఆహా కళ్యాణం'. హిందీలో హిట్టయిన బ్యాండ్ బాజా భారత్ చిత్రానికి రీమేక్‌గా ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ ఈచిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సంస్థ సౌత్ లో నిర్మిస్తున్న తొలి సినిమా ఇదే. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 21 న విడుదల అవుతోంది.


Click it and Unblock the Notifications











