For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'ఢమురకం'తో ఎవరు లాభపడ్డారు?

  By Srikanya
  |

  హైదరాబాద్ : నాగార్జున తాజా చిత్రం 'ఢమురకం'లేటుగా రిలీజైనా భారీగానే విడుదల చేసారు నిర్మాతలు ఆర్.ఆర్.మూవీ మేకర్స్. మార్నింగ్ షో నుంచే కార్టూన్ షో లా ఉందని డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం వీకెండ్స్ లో బాగానే కలెక్టు చేసింది. అప్పటికీ నాగార్జున,అనూష్క,దర్శకుడు శ్రీనివాసరెడ్డి మీడియాలో పదే పదే ఇంటర్వూలతో కనిపించి ప్రమేషన్ చేసారు. అయితే సినిమా ఎంత కలెక్టు చేసినా నిర్మాతలకు మాత్రం నష్టాన్నే మిగిల్చిందని ట్రేడ్ వర్గాల సమాచారం. కానీ మరో వైపునుంచి డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం చిత్రం తీసుకుని హ్యాపీగా ఉన్నారని తెలుస్తోంది.

  నిర్మాతలు లాస్ అవటానికి కారణం... బడ్జెట్ నాగార్జున బిజినెస్ ని మించి దాదాపు నలభై కోట్ల వరకూ పెట్టడం,సరైన టైమ్ కి విడుదల చేయకపోవటం,విడుదలలో వాయిదాలు అని తెలుస్తోంది. దాదాపు ఇరవై ఐదు కోట్లు వరకూ షేర్ కలెక్టు చేసిందని లెక్కలు చెప్తున్నా..నిర్మాతలకు అందుకే నష్టం వచ్చిందని అంటున్నారు. సినిమాపై అంచనాలు పెద్దగా క్రియేట్ చేయలేకపోవటంతో డిస్ట్రిబ్యూటర్స్ కి చాలా తక్కువ రేట్లకే ఇచ్చేరని,అందుకే వారు లాభపడ్డారని వినికిడి. దాంతో వారు తమ తక్కువ పెట్టుబడిని రికవరీ చేసుకుని సేఫ్ జోన్ లోకి వెళ్లగలిగారు.

  మరో ప్రక్క నిర్మాతలు ఆర్.ఆర్ మూవీ మేకర్స్ వారు ఈ సినిమా నిమిత్తం మరో తలనొప్పిలో ఇరుక్కున్నారు. ఈ చిత్రం తమిళ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న రామనాధన్..తనకు డబ్బుకు రికవరి చేయాలని తమిళనాడు డిస్ట్రిబ్యూషన్ అశోషియేషన్ లో కంప్లైంట్ చేసారు. చెన్నైకి చెందిన అభిరామి థియోటర్ ఓనర్ అయిన రామనాధన్ ఈ చిత్రం పంపిణీ హక్కులను ముప్పై లక్షలకు తీసుకున్నారు. అయితే పది లక్షలు మాత్రమే వచ్చాయని,మిగతా ఇరవై లక్షలూ రికవరి చేయాలని కోరుతూ పిర్యాదు చేసారు.

  దాంతో తమిళనాడు డిస్ట్రిబ్యూషన్ అశోషియేషన్ ..ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పై రెడ్ మార్క్ విధించింది. తమిళనాడు ఈ బ్యానర్ నుంచి వచ్చిన ఏ చిత్రమూ విడుదల చేయకూడదని ఆర్డర్స్ పాస్ చేసారు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు డిస్ట్ర్రిబ్యూటర్స్ కు అయిన లాస్ ని కాంపన్ససేట్ చేసి విషయం సెటిల్ చేసుకోవాలంటున్నారు.

  మరో వైపు నాగార్జున 'ఢమరుకం' సినిమా విడుదల చాలా ఆలస్యం అయినప్పటికీ మంచి విజయం సాధించిందని, తన కెరీర్లోనే పెద్ద హిట్ గా నిలిచిందని, ఇప్పుడు నేను నిజమైన కింగ్ లా ఫీలవుతున్నాను అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు అక్కినేని నాగార్జున. సినిమాను హిట్ చేసిన వారికి, సినిమా విజయం కోసం కృషి చేసిన వారికి ఆయన థ్యాంక్స్ చెప్పారు.

  English summary
  Damarukam is the highest grosser in Nag's 26 years long career . Due to the frequent postponements of the release, distributors backed off from race to acquire the rights of the film for hefty prices. To release the film at any cost, the makers have sold the theatrical rights at low prices although the making costed a bomb. This came as a blessing in disguise for the distributors and buyers as they recovered their investment already and most of them entered into profit zone. On the other hand, RR Movie Makers incurred a huge loss due to the astronomical budget, nominal price for rights and release issues.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X