»   » చరిత్ర సృష్టించిన దంగల్.. బాహుబలి2 రికార్డు బ్రేక్.. 2000 కోట్ల వైపు పరుగు..

చరిత్ర సృష్టించిన దంగల్.. బాహుబలి2 రికార్డు బ్రేక్.. 2000 కోట్ల వైపు పరుగు..

Written By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన దంగల్ చిత్రం ఓవర్సీస్ మార్కెట్‌లో కలెక్షన్ల ప్రకంపనలు సృష్టిస్తున్నది. ప్రపంచంలోనే అత్యధిక కలెక్షన్లను సాధించిన భారతీయ చిత్రంగా దంగల్ చరిత్ర సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా దంగల్ రూ.1800 కోట్లు వసూళ్లు చేయడం విశేషం.

ఓవర్సీస్‌లో రూ.1100 కోట్లు

దంగల్ చిత్రం ఓవర్సీస్ మార్కెట్‌లో రూ.1100 కోట్లు వసూలు చేసింది అని సినీ విమర్శకులు ఉమేర్ సంధూ ట్వీట్ చేసింది. చైనాలో హాలీవుడ్ చిత్రాల రికార్డులను తిరగరాసింది అని ఉమేర్ సంధూ పేర్కొన్నారు.


చరిత్ర సృష్టించిన చిత్రంగా..

విదేశాల్లో అత్యధికంగా కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా దంగల్ చరిత్ర సృష్టించింది. దంగల్ ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్లు వసూలు చేసింది. బాహుబలి రూ.1575 కోట్లతో రెండోస్థానంలో ఉంది అని ఉమేర్ మరో ట్వీట్ చేశారు.


దంగల్‌తో బాహుబలిని పోల్చొద్దు..

దంగల్‌తో బాహుబలిని పోల్చొద్దు..

విదేశాల్లో సత్తా చాటుతున్న బాహుబలి2, దంగల్ చిత్రాలను ఒకదానితో మరొకదానిని పోల్చి చూడకూడదు అని అమీర్ ఇటీవల అన్నారు. ఈ రెండు చిత్రాలు చాలా గొప్ప చిత్రాలు. దేశ కీర్తిని రెపరెపలాడించాయి అని ఆయన పేర్కొన్నారు. దంగల్ చిత్రం కేవలం చైనాలోనే రూ.800 కోట్లు వసూలు చేయడం విశేషం. ఇంకా తైవాన్‌లో రూ.26 కోట్లు వసూలు చేసింది. దీంతో ఓవర్సీస్ మార్కెట్లో అని దేశాల కలెక్షన్లు కలిపితే రూ.1100 కోట్లు దాటేసిందని ట్రేడ్ అనలిస్టులు పేర్కొంటున్నారు.


చైనాలో సునామీ..

చైనాలో సునామీ..

కుస్తీ క్రీడ కథా నేపథ్యంగా రూపొందిన దంగల్ చిత్రం దేశవ్యాప్తంగా భారీ కలెక్షన్లు సాధించింది. నోట్ల రద్దు సందర్భంగా విడుదలైన ఈ చిత్రం మిగితా చిత్రాల కంటే ఎక్కువ వసూళ్లను సాధించింది. ఈ చిత్రం మే 5న చైనాలో విడుదలై కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నది.English summary
Aamir Khan starrer Dangal has done an unimaginable business at the Chinese box office. Despite new releases, the biographical sports drama has remained rock-steady in China. Dangal is the Highest Grosser Worldwide Indian Movie Now! Dangal 1800 cr Worldwide, Baahubali2 1575 cr Worldwide till now.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu