'దశ' అవతారం

నితిన్ హీరోగా నటించిన 'విక్టరీ' కలెక్షన్లు డల్ గానే ఉన్నట్లు తెలిస్తోంది. ఇక కమల్ హాసన్ నటించిన 'దశావతారం' కు ప్రేక్షకాదరణ తగ్గలేదు. ముఖ్యంగా కమల్ హాసన్ నటనను చూసిన ప్రేక్షకులు 'వాహ్ !కమల్' అంటున్నారు. ఇదిలా ఉండగా మరో డబ్బింగ్ చిత్రం 'వీధి రౌడీ' ఈ వారం రిలీజైంది. ఉపేంద్ర హీరోగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు తిప్పికొట్టారు. కథలో ఏ మాత్రం కొత్తదనం లేకపోవటంతో రొటీన్ సినిమాల జాబితాలో చేరిపోయింది.


Click it and Unblock the Notifications











