దుమ్మురేపుతున్న ధడక్.. బాక్సాఫీస్ వద్ద జాహ్నవి మ్యాజిక్!

By Rajababu

యువ హీరోయిన్ జాహ్నవి నటించిన ధడక్ చిత్రం బాలీవుడ్‌లో దుమ్మురేపుతున్నది. ఓ కొత్త హీరో, హీరోయిన్లు నటించిన చిత్రం భారీ కలెక్షన్లు సాధించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. అందాల తార, దివంగత శ్రీదేవి నటవారసురాలిగా జాహ్నవి బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సాధించిన నాలుగు రోజుల కలెక్షన్లు ఇలా ఉన్నాయి.

తొలి రోజు నుంచే

తొలి రోజు నుంచే

మరాఠీ చిత్రం సైతర్ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంపై సినీ విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైనప్పటికీ భారీ వసూళ్లను రాబడుతున్నది. ధర్మ ప్రొడక్షన్ బ్యానర్‌పై కరణ్ జోహర్ రూపొందించిన తొలిరోజు ధడక్ చిత్రం రూ.8.71 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ బ్యానర్‌లో కొత్త వాళ్లతో తీసిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్ర కలెక్షన్లను అధిగమించింది.

బాలీవుడ్‌లో జాహ్నవి క్రేజ్‌

బాలీవుడ్‌లో జాహ్నవి క్రేజ్‌

ఇక రెండో రోజు కూడా ధడక్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసింది. ఈ చిత్రం రూ.11.04 కోట్లు వసూలు చేసి ట్రేడ్ పండితులను, సినీ విమర్శకులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ చిత్రం జాహ్నవి క్రేజ్‌ను, కరణ్ జోహర్ మేకింగ్ స్టామినాకు నిదర్శనంగా నిలిచింది.

Recommended Video

Dhadak Movie Review ధడక్ సినిమా రివ్యూ
మూడో రోజు భారీ వసూళ్లు

మూడో రోజు భారీ వసూళ్లు

వీకెండ్‌లో మూడో రోజు కూడా ధడక్ చిత్రం భారీ ఆదాయాన్ని మూటగట్టుకొన్నది. ఆదివారం నాడు 13.92 కోట్ల వసూళ్లను రాబట్టింది. నాలుగో రోజు కూడా మంచి ఓపెనింగ్స్ రావడంతో రూ.11 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం.

50 కోట్ల క్లబ్‌లో

50 కోట్ల క్లబ్‌లో

ధడక్ చిత్రం నాలుగురోజుల్లో సుమారు రూ.44.67 కోట్ల వసూళ్లను కలెక్ట్ చేసింది. మంగళవారం ఈ చిత్రం రూ.50 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. తొలివారంలో అదే జోష్ కొనసాగితే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. ఉత్తర భారతంలో ఈ చిత్రానికి ఆదరణ బాగా ఉండటంతో పబ్లిక్ డిమాండ్ మేరకు రాత్రి మూడు గంటల షో కూడా ప్రదర్శించడం గమనార్హం.

సినిమా సక్సెస్ ఫార్మూలా

సినిమా సక్సెస్ ఫార్మూలా

పరువు హత్యల నేపథ్యంగా మరాఠీలో రూపొందిన సైరత్ చిత్రం రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ చిత్రం ఆధారంగా రూపొందిన ధడక్‌లో పార్థవీ సింగ్గా జహ్నవి, మధుకర్‌గా ఇషాన్ కట్టర్ నటించారు. విషాదకరంగా ముగిసే ఈ చిత్రం ప్రేక్షకులను భావోద్వేగాని గురిచేయడం సక్సెస్ ఫార్మూలాగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X