ఈ రోజు రిలీజ్ లేదు‌: ధనుష్ ‘ధర్మయోగి’ రిలీజ్ ఫోస్ట్ ఫోన్

By Srikanya

హైదరాబాద్‌: ధనుష్‌ హీరోగా నటించిన తాజా తమిళ చిత్రం 'కోడి'.. తెలుగులో 'ధర్మయోగి' పేరుతో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఆర్‌.ఎస్‌. దురై సెంథిల్‌కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా ఈ చిత్రం ఈ రోజు( శుక్రవారం) విడుదల కావాల్సి ఉంది. అయితే సాంకేతిక కారణాల వల్ల చిత్ర విడుదలను శనివారానికి వాయిదా వేసినట్లు నిర్మాత వెల్లడించారు. రాజకీయ నేపథ్యంగా సాగే 'ధర్మయోగి' చిత్రంలో ధనుష్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

తొలిసారి ధనుష్‌ ఈ చిత్రం ద్వారా ద్విపాత్రాభినయం చేయటంతో ప్రాజెక్టు పై మంచి క్రేజ్ నెలకొని ఉంది. ఇందులో ధనుష్‌ చేసిన రెండు క్యారెక్టర్స్‌ పూర్తి విభిన్నంగా ఉంటాయని తెలుస్తోంది. త్రిష, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్లుగా నటించగా, తమిళ్‌ స్టార్‌ హీరో విజయ్‌ తండ్రి ఎస్‌.ఎ.చంద్రశేఖర్‌ ఓ ప్రత్యేక పాత్రను చేయడం విశేషం.

శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై యువ నిర్మాత సి.హెచ్‌.సతీష్‌కుమార్‌ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు.

నిర్మాత సి.హెచ్‌.సతీష్‌కుమార్‌ మాట్లాడుతూ... ''ధనుష్‌ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన 'కొడి' చిత్రంపై చాలా హైఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నాయి. తెలుగులో ధనుష్‌కి వున్న ఫాలోయింగ్‌ అందరికీ తెలిసిందే. ధనుష్‌ చేసిన రెండు క్యారెక్టర్స్‌ పూర్తి విభిన్నంగా వుంటాయి. ఈ చిత్రంలో త్రిష, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా, తమిళస్టార్‌ హీరో విజయ్‌ తండ్రి ఎస్‌.ఎ.చంద్రశేఖర్‌ ఓ ప్రత్యేక పాత్రను చేయడం విశేషం.

Dhanush's Dharma Yogi postponed to Oct 29

ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి దీపావళి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగులో 500కి పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నాం. త్రిష ఈ సినిమా నెగెటివ్‌ షేడ్‌ ఉన్న పాత్రలో చేస్తోంది. ఈ చిత్రం పెద్ద హిట్‌ అయి మా విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌కి మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను'' అన్నారు.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కబాలి చిత్రానికి సంగీతాన్ని అందించిన సంతోష్‌ నారాయణన్‌ ఈ చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లో ధనుష్ డ్యూయల్ షేడ్స్ ఫ్యాన్స్ కి ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ని అందిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X