»   » సమంత కొత్త చిత్రం ట్రైలర్‌ (వీడియో)

సమంత కొత్త చిత్రం ట్రైలర్‌ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : ధనుష్‌, సమంత, అమీజాక్సన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన 'తంగమగన్‌' చిత్రం ట్రైలర్‌ విడుదలైంది. ధనుష్‌ తన ట్విట్టర్‌ ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ... వీడియో లింక్‌ను అభిమానులతో పంచుకున్నారు. వెల్‌రాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడండి.

రఘవరన్ బి.టెక్ వంటి హిట్ కాంబినేషన్ లో డిసెంబ‌ర్ 18న విడుద‌ల‌కు సిద్దమ‌వుతున్న ధ‌నుష్ చిత్రం ‘న‌వ‌మ‌న్మథుడు. తమిళ స్టార్ హీరో ధనుష్ సినీ కెరీర్లోనే బిగ్లెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం 'విఐపి ' తెలుగు, తమిళం భాషలలో ఈ చిత్రం విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

వేల్ రాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. అయితే ఇపుడు ఇదే కాంబినేషన్తో మరోసారి రిపీట్ అయ్యింది. ధనుష్ స్వీయ నిర్మాణంలో నటిస్తున్న తాజా చిత్రం 'తంగమగన్ '. ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేస్తున్నారు.

వేల్ రాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో ధనుష్ సరసన సమంత, అమీ జాక్సన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్ కు గానూ నవ మన్మధుడు అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. రీసెంట్ గా డబ్బింగ్ పూర్తి చేసారు. నాగార్జున కెరీర్లో మన్మధుడు సూపర్ హిట్ చిత్రం. ఇదే టైటిల్ తో రాబోతోండంటతో క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు.

Dhanush's Thangamagan - Official Trailer

అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో పాటలను యూట్యుబ్ ద్వారా విడుదల చేశారు. ఇప్పుడు ఈ పాటలు య్యూట్యుబ్లో హల్చల్ చేస్తున్నాయి. ఇందులో నాలుగు పాటలు ఉన్నాయి, నాలుగు పాటల్లో దేనికదే ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్ 18న విడుదలకు సిద్దమవుతోంది.

డి.ప్రతాప్ రాజు స‌మ‌ర్పణలో బృందావ‌న్ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రం తెలుగులో విడుదలవుతుంది. వేల్ రాజ్ ద‌ర్శకుడు.
ఎన్‌.వెంక‌టేష్, ఎన్‌.ర‌వికాంత్ నిర్మాత‌లు. సెన్సార్ స‌హా అన్నీ కార్యక్రమాల‌ను పూర్తి చేసి సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

ధ‌నుష్, స‌మంత‌, ఎమీజాక్సన్‌, రాధికా, శ‌ర‌త్‌కుమార్‌, కె.ఎస్‌.ర‌వికుమార్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సంగీతంః అనిరుధ్ ర‌విచంద్రన్, కెమెరాః ఎ.కుమర‌న్‌, ఎడిటింగ్ః ఎం.వి.రాజేష్‌కుమార్‌, స‌హ నిర్మాత‌లుః ఎం.డి.ఎం.ఆంజ‌నేయ‌రెడ్డి, కె.య‌స్‌.రెడ్డి, ద‌ర్శకత్వం:వేల్‌రాజ్‌.

English summary
Thangamagan, starring Dhanush, Amy Jackson, Samantha, Radhikaa Sarathkumar & K.S. Ravikumar. Director Velraj is back with the VIP team and the songs from Thangamagan composed by Anirudh Ravichander are already topping charts. Dhanush's ‘Thanga Magan’ is being dubbed into Telugu as ‘Nava Manmadhudu’. The movie had completed its dubbing activities as well as censor formalities very recently.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu