»   » 'ధూమ్ 3' భాక్సాఫీస్ కలెక్షన్స్

'ధూమ్ 3' భాక్సాఫీస్ కలెక్షన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: అమీర్‌ఖాన్, అభిషేక్ బచ్చన్, కట్రీనా కైఫ్ ప్రధాన పాత్రలు పోషించగా శుక్రవారం విడుదలైన 'ధూమ్ 3' సినిమా మొదటి రోజు నుంచే కలెక్షన్లలో సరికొత్త రికార్డులు సృష్టించడం ప్రారంభించింది. విజయ్‌కృష్ణ ఆచార్య దర్శకత్వంలో యశ్‌రాజ్ ఫిలిమ్స్ బేనర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమా విడుదలైన మొదటిరోజు కలెక్షన్లలోనే కాక, ఏ ఒక్క రోజు కలెక్షన్లలోనైనా సరికొత్త రికార్డులు సాధించింది.

మునుపటి రెండు సినిమాలతో పోలిస్తే మరింత భారీతనంతో, భారీ వ్యయంతో రూపొందిన ఈ సినిమాలో సాహిర్, సమర్ అనే కవల సోదరులుగా అమీర్‌ఖాన్ ప్రదర్శించిన అభినయం, కట్రీనా గ్లామర్, రబ్బరు బొమ్మలా ఆమె చేసిన డాన్సులు, విజయ్‌కృష్ణ ఆచార్య దర్శకత్వ ప్రతిభ, సుదీప్ చటర్జీ ఛాయాగ్రహణం, ప్రీతమ్ సంగీతం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

Dhoom 3

విడుదలైన మొదటిరోజు భారతదేశంలో కలెక్షన్ల విషయంలో ఇప్పటివరకు షారుఖ్‌ఖాన్ సినిమా 'చెన్నై ఎక్స్‌ప్రెస్' సాధించిన రూ. 33.10 కోట్లదే రికార్డ్. అలాగే సింగిల్ డే కలెక్షన్ల రికార్డు రూ. 35.91 కోట్లతో ఇటీవల విడుదలైన హృతిక్ రోషన్ సినిమా 'క్రిష్ 3' పేరిట ఉంది. ఈ రెండు రికార్డులనీ మొదటి రోజు కలెక్షన్లతో అధిగమించింది 'ధూమ్ 3'. భారత్‌లో అది 36.22 కోట్లను వసూలు చేసింది.

ఇక ఓవర్సీస్‌లో మొదటి రోజు రూ. 20.20 కోట్లను వసూలు చేసింది ఆ సినిమా. అంటే తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 'ధూమ్ 3' వసూలు చేసిన మొత్తం రూ. 56.42 కోట్లు! భారతీయ సినీ చరిత్రలో ఇది కొత్త అధ్యాయం. అలాగే శనివారం ఈ సినిమా భారత్‌లో రూ. 33.35 కోట్లను వసూలు చేసింది (తెలుగు, తమిళ వెర్షన్లు సహా). దీన్ని బట్టి చూస్తుంటే ఆదివారం కలెక్షన్లతో అంటే మూడు రోజుల మొదటి వారాంతంలోనే ఈ సినిమా రూ. 100 కోట్ల మార్కును దాటేయడం ఖాయంగా కనిపిస్తోంది. ముందు ముందు ఈ సినిమా ఎన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి.

English summary

 It’s Dhoom-Dhoom all the way! The third installment of the franchisee has smashed all the previous box-office record to become the highest opener of all time. Aamir-Katrina starrer has minted Rs 36.22 cr in India. Taran Adarsh tweeted on Saturday: “Dhoom: 3 emerges the biggest non-holiday opener ever.” Tweeted Big B, “Dhoom3 ...Taran Adarsh, trade aficionado, sms's me .. all India collection for 1 day Friday : Rs 36.22 cr !! SPELLBINDINGO !!”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu