Don't Miss!
- News
Vallabhaneni Vamsi : ఆ ఇద్దరు టీడీపీ నేతలపై వల్లభనేని వంశీ పరువునష్టం దావా ..
- Finance
SBI: లోన్ తీసుకుంటే వడ్డీ డిస్కౌంట్.. అబ్బా SBI బలే ఆఫర్.. పూర్తి వివరాలు
- Technology
OnePlus నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ! లాంచ్ తేదీ ,స్పెసిఫికేషన్లు!
- Automobiles
సీరియల్స్ చేస్తూ ఖరీదైన బెంజ్ కారు కొనేసి రూపాలి గంగూలీ.. ధర ఎంతో తెలుసా?
- Sports
INDvsNZ : హార్దిక్ తెలివిగా ఆడాడు.. కెప్టెన్‌ను మెచ్చుకున్న మాజీ లెజెండ్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
- Lifestyle
Chanakya Niti: జీవితంలో ఈ సుఖాలు అనుభవించాలంటే మంచి కర్మలు చేసుండాలి, అవేంటంటే..
Pogaru 2 day Collections కుమ్మేస్తోన్న ధృవ సర్జా.. మాస్ సత్తా ఇదే
మాస్ సినిమాలకు ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్, విజిల్స్ వేసేలా డైలాగ్స్, పాటలు, హీరోయిజం, హీరోయిన్ గ్లామర్ ఇలా అన్ని ఉండి కాసింత కథ కూడా ఉంటే సినిమా ఆడేస్తుంది. అదే మాస్‌కు ఉన్న పవర్. తాజాగా ఈ వారం ఇదే ఫార్మూలాతో పొగరు అనే కన్నడ డబ్బింగ్ చిత్రం తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అలా ధృవ సర్జా అనే హీరో కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు.
నేచురల్ బ్యూటీ సాక్షి అగర్వాల్ లేటేస్ట్ ఫోటోలు..

రష్మిక మందాన్నతో..
పొగరు సినిమాపై తెలుగు నాట ఇంతటి క్రేజ్ ఏర్పడటానికి ముఖ్యకారణం రష్మిక మందాన్న. రష్మిక వల్లే ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. కరాబు అనే పాట వల్లే సినిమాపై ఇంతటి హైప్ పెరిగింది. అయితే రష్మిక పాత్రకు సినిమాలో ఎలాంటి ప్రాధాన్యం లేకపోయినా గ్లామర్ పరంగా బాగానే ఆకట్టుకుంది.

కలెక్షన్ల జోరు..
పోటీలో నాలుగు సినిమాలు ఉన్నా కూడా పొగరుకు మంచి ఓపెనింగ్సే వచ్చాయి. డబ్బింగ్ చిత్రాల పరంగా చూస్తే పొగరు మంచి వసూళ్లనే రాబట్టింది. మొదటి రోజు 1.35 కోట్ల గ్రాస్, 76 లక్షలను కొల్లగొట్టి పర్వాలేదనిపించింది. ఇక రెండో రోజు సైతం మంచి కలెక్షన్లనే రాబట్టింది.

ఏరియాల వారిగా..
రెండో రోజు పొగరు కలెక్షన్లు ఇలా ఉన్నాయి.. నైజాం ఏరియాలో 19లక్షలు, సీడెడ్‌లో 12లక్షలు, ఉత్తరాంధ్రలో 8లక్షలు, ఈస్ట్ 3లక్షలు, వెస్ట్ 2లక్షలు, గుంటూరు 2.7 లక్షలు, కృష్ణా 2.5లక్షలు, నెల్లూరులో 1.8 లక్షల కొల్లగొట్టింది.

మొత్తంగా ఎంతంటే?
నైజాం, సీడెడ్ అని ఇలా కాకుండా విడుదలైన ప్రతీ సెంటర్‌లో పొగరు సినిమా దూసుకుపోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పొగరు సినిమా మొదటి రోజు 76 లక్షలను కొల్లగొడితే రెండో రోజుల 51 లక్షలను వసూళ్లు చేసింది. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు ఎంత దూరంలో ఉందో ఓ సారి చూద్దాం.

ఎంత రాబట్టాలంటే..
పొగరు సినిమా తెలుగు రాష్ట్రాల్లో హిట్ అవ్వాలంటే నాలుగు కోట్లను కొల్లగొట్టాల్సి ఉంది. రెండు రోజుల్లో మొత్తంగా 1.27కోట్లు రాబట్టింది..ఇంకా 2.73కోట్లను రాబడితే బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది. అంటే ఈ సినిమాకు టార్గెట్ చాలా పెద్దదిగానే ఉందని కనిపిస్తోంది. మొత్తానికి మాస్ సినిమాకు ఆదరణ మాత్రం తగ్గలేని పొగరు నిరూపిస్తోంది.